ఓట్స్‌ ముస్లీ

24 Mar, 2017 23:54 IST|Sakshi
ఓట్స్‌ ముస్లీ

హెల్దీ ట్రీట్‌

కావలసినవి: ఓట్స్‌ – 1 కప్పు నీరు – 2 కప్పులు ఆపిల్‌ – 1 నిమ్మరసం – 2 టీ స్పూన్లు కిస్‌మిస్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ వేరుశనగపప్పు – 1 టేబుల్‌ స్పూన్‌ పాలు – 1 కప్పు  తేనె – 2 టీ స్పూన్లు

తయారి:
1. రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి.
2. ఉదయాన ఆపిల్‌ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి.
3. తర్వాత ఇందులో కిస్‌మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్‌ వేసి కలపాలి.
4. పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి.

నోట్‌: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్‌ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా