హెల్దీ టొమాటో

12 Apr, 2017 23:16 IST|Sakshi
హెల్దీ టొమాటో

ప్రతిరోజూ టొమాటోలను ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటే ఒంటి రంగుతోపాటు చర్మ లావణ్యం కూడా మెరుగవుతుంది.టొమాటో రక్తాన్ని శుభ్రపరచడంలో బాగా పని చేస్తుంది.లివర్‌ సిర్రోసిస్‌ సమస్యను రాకుండా నివారిస్తుంది.నేచురల్‌ యాంటీసెప్టిక్‌గా పని చేసి ఇన్‌ఫెక్షన్‌లను రానీయకుండా నివారిస్తుంది.  వీటిలోని  నికోటినిక్‌ యాసిడ్‌ బ్లడ్‌ లో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఇందులో విటమిన్‌ కె సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రక్తం గడ్డకట్టని సమస్యతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా ఆహారంలో టొమాటోను చేర్చుకోవాలి.ఇందులో ఉండే లైకోపిన్‌ సమర్థమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది క్యాన్సర్‌ కారక సెల్స్‌ను నివారించడంలో బాగా పని చేస్తుంది. మహిళలకు ఎదురయ్యే గర్భాశయంలో ట్యూమర్స్‌ వంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గర్భాశయంలో అనవసర టిష్యూ ల పెరుగుదలను నిరోధిస్తుంది.

మరిన్ని వార్తలు