మూలం నుంచి తొలగిస్తుంది సమూలంగా నయం చేస్తుంది..!

9 Apr, 2016 22:19 IST|Sakshi
మూలం నుంచి తొలగిస్తుంది సమూలంగా నయం చేస్తుంది..!

హోమియో డే స్పెషల్


హోమియోపతి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆదరిస్తున్న వైద్య ప్రక్రియ. ఎంతో మంది సంతోషంగా విశ్వసిస్తున్న మార్గం. ఎందరో ఆనందంగా అనుసరిస్తున్న వైద్యవిధానం. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనిమన్  వైద్యవిధానానికి పునాదులు వేశారు. ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం వెనక ఆయన విస్తృతమైన కృషి ఉంది. ఇయన చేసిన శ్రమ అపారం. అందుకే ఆయనను ‘ఫాదర్ ఆఫ్ హోమియోపతి’ అంటారు.

 
కొత్త ప్రక్రియకు ఆవిష్కరణ ఇలా...
ఎర్జాంగన్ యూనివర్సిటీ నుంచి హనిమన్ 1779లో వైద్యవిద్యలో ఎండీ పూర్తిచేశారు. అప్పటి వైద్య చికిత్స విధానాలు రోగి అనారోగ్యాన్ని మరింత ఎక్కువ చేసేవిగా ఉన్నాయని, వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే విధంగా ఉండటం వల్ల ఆ వైద్య వ్యవస్థపై అసంతృప్తితో, ఆ ప్రక్రియలో వైద్యసాధన నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత వైద్య పుస్తకాలను జర్మన్‌లోకి అనువదించే ఉపాధిని అనుసరించారు. ఆ సమయంలో ఆయన సెల్యులార్ ఎమ్‌ఎమ్ పుస్తకంలో పెరూవియన్ బార్క్ (సింకోనా బెరడు)ను పరిశీలించారు. అందులోని ఔషధగుణాలు మలేరియాపై ప్రభావం చూపుతాయని తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఆ ఔషధాన్ని తనపైనే ప్రయోగించుకున్నారు. ఆ బెరడు ఆశ్చర్యకరంగా ఆయనలో మలేరియా లక్షణాలను కలిగించింది. ఒక వ్యాధిని నివారించగలిగే ఔషధాలను ఆరోగ్యకరమైన వ్యక్తులపై ప్రయోగిస్తే అదే వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. కాబట్టే అవి ఆ వ్యాధిని నివారించగలుగుతున్నాయని నిర్ధారణ చేశారాయన. ఇది ‘సిమిలియా సిమిలిబస్ క్యురాంటర్’ సిద్ధాంతానికి మూలం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘లైక్స్ ఆర్ క్యూర్‌డ్ బై లెక్స్’ అనేది ఈ మాటకు అర్థం.

 

 తన పైనా...

కుటుంబ సభ్యులపైనా ప్రయోగాలు  ఆ తర్వాత ఆయన ఎన్నో పదార్థాలను, మొక్కలు మొదలుకొని, విషపూరితమైన పదార్థాల వరకు తనపైన, తన కుటుంబ సభ్యులపైనా ప్రయోగించి తద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ‘మెటీరియా మెడికా ప్యూరా’ అనే గ్రంథంలో వాటి ఫలితాను పొందుపరిచారు. మెటీరియా మెడికా ప్యూరా మూడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.

 

రోగి లక్షణాలను పరిగణనలోకి...
ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ప్రవర్తించలేరు. అలాగే అనారోగ్య పరిస్థితిలో కూడా ఒక్కో వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు మానసికంగా గాని, శారీరకంగా గాని కనబరుస్తారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించడానికి ‘లా ఆఫ్ ఇండివిడ్యులైజేషన్’ అంటారు. దీని ద్వారా ఆ వ్యక్తికి సరిపడ ఔషధాన్ని మెటీరియా మెడికా ద్వారా ఎంచుకొని హోమియోపతి విధానంలో చికిత్స అందించేవారు.


మొదట్లో ఈ ప్రక్రియ రోగికి మరింత అస్వస్థతకు గురిచేసేది. అప్పుడు ఆయన తిరిగి ఆ ఔషధాన్ని తక్కువ మోతాదులో ఆల్కహాల్‌లో గానీ లేదా నీటిలో గాని కరిగించి, దాన్ని మళ్లీ మళ్లీ ఎక్కువసార్లు కుదించడం ద్వారా ఔషధంలోని ప్రాణాధార బలాన్ని (వైటల్ ఫోర్స్)ను పెంచేవారు. అది రోగి అనారోగ్యాన్ని సంపూర్ణంగా, ఎలాంటి దుష్ర్పభావాలూ లేకుండా నయం చేసేది. ఇది లా ఆఫ్ ఇన్‌ఫినిటైజిమల్ డోస్’ అనే సిద్ధాంతానికి మూలకారణం. ఇలా పరిశోధనలు జరిపి కనుగొన్న హోమియో విధివిధానాలనూ, సిద్ధాంతాలను ‘ద ఆర్గనాన్ ఆఫ్ రేషనల్ హీలింగ్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఇవి ఆరు ఎడిషన్స్‌గా ప్రచురితమయ్యాయి.

 

హోమియోలో కొన్ని ప్రధాన అంశాలు
హోమియోపతిలో ఒక్కసారికే కనిపించే జబ్బులు (అక్యూట్), దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులు మానసిక వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని ఏ వయసు వారికైనా చికిత్స అందిస్తారు. ఇతర వైద్య వ్యవస్థలలా కాకుండా హోమియోపతిలో జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేయడం సాధ్యమవుతుంది. ఇతర వైద్య వ్యవస్థలలో వ్యాధిని కలగజేసే లక్షణాలను మాత్రమే తీసివేయడం జరుగుతుంది. కానీ హోమియోలో వ్యాధి మూలాల (మియాజమ్స్)పై సమగ్ర అధ్యయనం చేసి, సరైన ఔషధాన్ని కనుగొని, సంపూర్ణంగా తీసివేసి, పూర్తిగా ఆరోగ్యాన్ని అందించడం సాధ్యమవుతుంది.

 
స్కార్లెట్ జ్వరం అంటువ్యాధిలా ప్రబలిన సమయంలో ‘బెల్లడోనా’ అనే ఔషధాన్ని ఉపయోగించిన వారిలో ఆ వ్యాధి సోకకపోవడాన్ని హనిమన్ గమనించారు. తద్వారా బెల్లడోనా ముందుజాగ్రత్త ఔషధ విలువను తెలుసుకున్నారు. అలా అది ప్రివెంటివ్ మెడిసిన్‌గా గుర్తింపు పొందింది.

 

డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్‌ది వైద్యరంగంలో ప్రత్యేక స్థానం...
హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్‌ది వైద్యరంగంలోనే ఒక ప్రత్యేక స్థానం. అద్భుత ప్రతిభను కలిగిన ఆయన హోమియోవైద్యచరిత్రలోనే తనదైన చెరగని ముద్రలు వేసి, దాదాపు కోటి మందికి పైగా పేషెంట్లను విలక్షణమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చి వారి జీవితాలలో ఆరోగ్యానందాలను, వెలుగులను నింపారు.

 
అపారమైన అనుభవం, అనితరసాధ్యమైన నైపుణ్యం, అంకిత భావం ఆయన సొంతం. మానవాళి మనుగడకు సవాలుగా మారిన ఎన్నో దీర్ఘకాలిక, మొండి వ్యాధులను శాశ్వతంగా నయం చేసి హోమియోవైద్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్. వారి ప్రతిభ సామర్థ్యాలకు గుర్తింపుగా ‘ధన్వంతరి’, ‘శుశ్రుత’, ‘బెస్ట్ హోమియో డాక్టర్’ వంటి అవార్డులను అందుకున్నారు. బోధన పట్ల ఎంతో అభిరుచి కలిగిన ఆయన ఎంతో ఉత్సాహంగా తన అనుభవపూరిత చికిత్సా విధానాలను, తన విజ్ఞానాన్ని విద్యార్థులకు, ఇతర హోమియో వైద్యులకు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్త సెమినార్లు, సమావేశాల ద్వారా ఎంతోమందికి అందిస్తున్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక పదవులను కూడా అధిరోహిస్తూ ఎన్నో సేవాసంస్థలలో భాగస్వాములై ఎంతోమంది పేదవారికి ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు.

 

విశిష్ట సంస్థ హోమియోకేర్ ఇంటర్‌నేషనల్...
మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన శ్రీకాంత్ మోర్లావర్ ప్రస్థానం నేడు 36 క్లినిక్‌లతో దాదాపు దక్షిణ భారతదేశమంతా విస్తరించి హోమియో వైద్య రంగంలో చరిత్రను సృష్టించింది. హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో దాదాపు 300 మంది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, 500 పైగా చక్కటి శిక్షణ పొందిన సిబ్బంది ఎప్పటికప్పుడు పేషెంట్లను పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా దూరం చేయడానికి కృషి చేస్తున్నారు.

 

పూర్తిగా నయమవుతుంది...
ఎన్నో మొండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, డయాబెటిస్, పీసీఓడీ, ఇన్‌ఫెర్టిలిటీ, ఒబేసిటీ, హెయిర్‌ఫాల్, సోరియాసిస్‌తో పాటు మరెన్నో చర్మసమస్యలకు, ఇతర వ్యాధులకు సున్నితమైన, సమర్థమైన, దుష్ర్పభావాలు లేని చికిత్స హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో నయమవుతాయి.

 
ఇందుకోసం వ్యాధిని అమూలాగ్రం నయం చేసేలా  చికిత్స అందిస్తారు. ఎన్నో మొండి వ్యాధులను 85 శాతం సత్ఫలితాలను హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ సాధించింది. ప్రతి వ్యాధి విషయంలోనూ నిపుణులైన వైద్య బృందం నిశితంగా  అధ్యయనం జరిపి, చికిత్సను అందించడం జరుగుతుంది.  హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో అందించే మందులు అన్నీ జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత నాణ్యమైన మందులు. వాటిని బ్లిస్టర్ ప్యాకెట్ రూపంలో అందిస్తారు.  హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ ఐఎస్‌ఓ - 9001 - 2008 జర్మన్ ఆమోదం పొందిన సంస్థ. హోమియో ఇంటర్‌నేషనల్‌లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో నివాసితులై ఉండి, క్లినిక్‌కు రాలేనివారికి ఆన్‌లైన్, స్కైప్, టెలీమెడిసిన్ ద్వారా కూడా చికిత్స అందించే సదుపాయం కల్పిస్తున్నారు.

 
పేషెంట్ల సందేహాలు తీర్చడానికి, ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి ఆన్‌లైన్ లేదా ఫోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు.  ఎన్నో పరిశోధనలు జరుపుతూ ఎప్పటికప్పుడు పేషెంట్లకు మెరుగైన, కచ్చితమైన హోమియో చికిత్స అందిస్తూ, మంచి ఫలితాలను పొందుతున్నారు.  ఇటీవలే ఎంతోమంది సంతానలేమితో బాధపడిన అనేక మంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహించిన ‘హోమియోకేర్ బేబీ షో’ కార్యక్రమంలో పాల్గొని తాము సంతానవంతులైన తాము పొందిన  సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు డయాబెటిస్, సోరియాసిస్ వంటి ఇతర వ్యాధుల విషయంలోనూ నిర్వహించారు.

 
అద్భుత ఫలితాలను ఆవిష్కరిస్తున్న హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ ఇతర రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తూ, ఎన్నో సత్ఫలితాలను అందుకుంటోంది.  ఇటీవలే తమిళనాడులోని సేలంలో కూడా కొత్త శాఖను గౌరవనీయులు ‘కళైమామని తిరుబాలకుమారన్’ గారు ప్రారంభించారు.  హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వారు హెచ్1ఎన్1 వైరస్‌కు నివారణ మందును కూడా అందించి మంచి ఫలితాలను పొందారు. ఖచ్చితమైన ఫలితాలే మా బలం, అందరికీ సంపూర్ణ చికిత్స అందించడమే మా ధ్యేయం.

 

హోమియో కేర్ ఇంటర్‌నేషనల్ గురించి కొన్ని వివరాలు...

ప్రపంచంలోనే అత్యుత్తమ హోమియో చికిత్స హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ ప్రత్యేకత.  ఇక్కడ జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధులు శాశ్వతంగా నయం చేస్తారు.డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ హోమియోకేర్ ఇంటర్‌నేషన్ స్థాపించి హోమియోపతిని మొదటిసారిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇలాంటి ప్రపంచ వ్యాప్త అత్యుత్తమ చికిత్స (వరల్డ్‌క్లాస్ హోమియోపతి ట్రీట్‌మెంట్)ను అందిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ మోర్లవర్ ఎంతోమంది పేషెంట్లను ఎన్నో దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరం చేసి మన్ననలు పొందుతున్నారు.  హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వైద్య సిబ్బందికి కూడా ఆయన అత్యాధునిక చికిత్సపై తరగతులు నిర్వహించి, శిక్షణ అందించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వారి ఇంటర్వ్యూల ద్వారా పేషెంట్లకు హోమియోపతిపై అవగాహన కలిగిస్తున్నారు. అధునాతన హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ చికిత్స ద్వారా ఎలా సంపూర్ణంగా వ్యాధులు నయం చేయగలుతున్నారో వివరిస్తుంటారు. టీవీ ఛానెళ్లలో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, వారి సందేహాలను దూరం చేస్తుంటారు.  ఆరోగ్య పత్రికలు (హెల్త్ జర్నల్స్) ద్వారా కూడా వ్యాధులు, వాటి నివారణ, చికిత్సల పట్ల అవగాహన కలిగిస్తారు. అంతేకాదు...  హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో నయం చేసిన ఎన్నో కష్టతరమైన, దీర్ఘకాలిక, మొండి వ్యాధుల వివరాలు, పొందిన అద్భుత ఫలితాలను కచ్చితమైన ఆధారాలతో సహా ప్రేక్షకులకు వివరిస్తారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు