తొడిమలు తీస్తే... తాజా!

6 Nov, 2015 00:15 IST|Sakshi
తొడిమలు తీస్తే... తాజా!

ఇంటిప్స్
 
బెండకాయలకు రెండు వైపులా ఉన్న తొడిమెలను తీసేసి వాటిని ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది.

ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తపడకుండా ఉంటాయి.
 
 

మరిన్ని వార్తలు