భారతీయ యాత్రాదర్శిని

10 Jun, 2016 22:57 IST|Sakshi
భారతీయ యాత్రాదర్శిని

సందర్శనీయం

 

భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఈ పవిత్ర వేద భూమిలో అతి ముఖ్యమైన తీర్థయాత్రలు కైలాస మానస సరోవర యాత్ర, అమర్‌నాథ్ యాత్ర, చార్‌ధామ్ యాత్ర, కాశీయాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలు ముఖ్యమైనవి.

 

కైలాస మానస సరోవర యాత్ర
పార్వతీపరమేశ్వరుల నివాసంగా భావించే కైలాస శిఖరం శివ భక్తులకు, హరి భక్తులకు, దేవీ భక్తులకు పరమ పవిత్రమైన పుణ్యస్థలం. ఆదిశంకరాచార్యులవారు కైలాసానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నాలుగు శివలింగాలను అనుగ్రహించాడట. ఆదిశంకరాచార్యులవారు ఆ లింగాలను తూర్పు సముద్ర తీరం నందు గల పూరి క్షేత్రం నందు గోవర్ధన పీఠాన దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలోనూ, గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలో కాళికా మఠం, ఉత్తరాంచల్ రాష్ట్రం నందు బదరీనాథ్ క్షేత్రంలో జ్యోతిర్మఠం అనబడు నాలుగు మఠాలను స్థాపించి, వాని యందు శివలింగాలను ప్రతిష్ఠించారు. కైలాస పర్వతం ఒక్కో సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంటుంది. ఇది పరమేశ్వరుని లీలగా చెప్తారు. కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రూబి, నీలం రంగులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెప్తుంది.

 
భూమి మీద వున్న మంచినీటి సరస్సు - మానస సరోవరం. ఋషుల కోరికపై బ్రహ్మ తన మనస్సు (మానసము) నుండి సృష్టించినందు వలన దీనిని మానస సరోవరం అని అంటారు. ఈ సరోవరంలోని నీరు చతుర్వేద సార మని అంటారు. దేవతలు ఈ సరోవరంలో స్నానం చేయటానికి స్వర్గలోకం నుండి ప్రతి రాత్రి వేంచేస్తుంటారని, పండుగ రోజుల్లో.. పున్నమి రోజుల్లో  తప్పక వస్తారని ప్రతీతి. ఇంత విశిష్టమైనటువంటి కైలాస మానస సరోవర యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి హిందువు పరితపిస్తూ ఉంటాడు. ఫోన్: 8106201230

 

అమర్‌నాథ్ యాత్ర
అమర్‌నాథ్ అంటే జరామరణాలు లేనివాడని అర్థం. ఈ అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు ‘శివలింగం’ ఉంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం, తరగటం జరుగుతుంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ మంచులింగం పెద్దదిగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఒక వింతగా కొనియాడబడుతోంది. గణేశునికి, పార్వతీదేవికి ఇక్కడ రెండు మంచులింగాలు వున్నాయి.

 

ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. మీరు మాత్రం అలాగే శాశ్వతుడిగా ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యం?’ అని అడిగింది. అందుకు ఈశ్వరుడు ‘ఇది పరమ రహస్యం. కనుక ప్రాణకోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి’’ అని ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈ అమర్‌నాథ్ గుహను ఎంచుకున్నాడు. శివుడు ఈ గుహను ఎన్నుకోవటానికి ముందు తనతోపాటు వున్న వారందరినీ వదిలిపెట్టి వెళ్లాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో ముందుగా వాహనమైన నందిని పహల్‌గామ్‌లో, చంద్రుని చందన్వారి వద్ద, సర్పాలను పిషాంగ్ సరోవర తీరాన గల శేష్‌నాగ్ వద్ద, కుమారుడైన గణేశున్ని మహాగుణ పర్వతం వద్ద, పంచభూతాలను పంచ్‌తర్ణి వద్ద వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌లోని అమరలింగం వున్న గుహ లోపలికి వెళ్లాడు. అక్కడ తన అమరత్వ రహస్యం, జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. ఆ సమయంలో గుహలో రెండు గుడ్ల నుండి జన్మించిన పిల్ల పావురాళ్లు శివుడు పార్వతితో చెప్పిన అమరగాథను విన్నాయట. ఈ విషయం తెలుసుకొన్న శివుడు ‘‘జీవధర్మమైన జనన మరణాలు ఈ పావురాల జంటకు వుండదు. మనిద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో వుండి దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దాం’’ అని తెలియజేశాడు. ఇప్పటికీ ఈ పావురాల జంట అజరామరమై ఈ గుహకు వచ్చి శివుని అర్చించినవారికి దర్శనమిస్తూ ముక్తిని ప్రసాదిస్తు న్నాయని చెబుతారు. మహాద్భుతమైన ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకోవ టానికి ప్రతియేటా కొన్ని లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం జూలై నెల 2  నుండి ప్రారంభం అవుతుంది.  ఫోన్: 9100090295

 

చార్‌ధామ్ యాత్ర
ఉత్తరాంచల్‌లోని ఘల్‌వాల్ ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ప్రసిద్ధమైనవి. ఈ నాలుగింటిని కలిపి చార్‌ధామ్ అంటారు. వీటిని ఒకేసారి సందర్శించి రావటానికే చార్‌ధామ్ యాత్ర అని పేరు.

 
యమునోత్రి: ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం.  సూర్యదేవుని సంతానంలో ఒకరు యముడు, మరొకరు యమున-సూర్యుని భార్య ఛాయాదేవి, ఒకరోజున ఛాయాదేవికి యమున మీద కోపం వచ్చి భూలోకంలో పడిపొమ్మని శపించిందట. అందువలన యమున భూలోకంలో నదిగా చేరింది.

 
గంగోత్రి: గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుండి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి గంగోత్రి చేరేవరకూ ఈ పవిత్ర గంగాజలంలో మానవస్పర్శకూడా ఉండదు. అంత పవ్రితంగా ఉంటుంది.

 
బద్రీనాథ్: బదరీ అనగా రేగుచెట్టు. రేగు చెట్టు, లక్ష్మీనివాసం. కనుక నారాయణుడు ఆ చెట్టు నీడలోనే తపమాచరించాడు. అందువల్లే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రం అని పేరు. ఇది నర నారాయణుల నివాస స్థలమవటం వల్ల నారాయణాశ్రమం అని కూడా పిలుస్తారు. నారదుడు ఈ క్షేత్రంలో అర్చకత్వం చేసినందువల్ల నారద క్షేత్రమని కూడా పేరు. శ్రీకృష్ణ నిర్యాణాంతరం పాండవులు తమ జీవితాలను చాలించదలచి స్వర్గారోహణ సమయంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారట. స్వర్గారోహణ పర్వంలో వర్ణించిన ‘మానా’ పర్వతం బద్రీనాథ్‌కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

 
కేదార్‌నాథ్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం  ఆదిశంకరులచే 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ స్వామి ఆరు నెలలు మానవుల పూజలను, ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు. ఆలయం మూసివేయగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్‌కు 52 కి.మీ. దూరంలో ఉన్న ఉఖీమర్‌లో వున్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. ఫోన్: 7032666924

 

కాశీ క్షేత్ర యాత్ర
కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి శివుడికి కాశీ విశ్వేశ్వరుడని పేరు. విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత, ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు. చరిత్రలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ పెద్దపెద్ద ఆలయాలు వారణాసిలో ఉన్నాయి. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీ నగరం నిర్మించబడిందని పురాణ వచనం. పరమేశ్వరునికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువలన ఈ వూరికి ‘ఆనందకావనం’ అనే పేరు కూడా ఉన్నది. ఇంకా ప్రతివీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి, బెనారస్‌గా మారంది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతి వారు నివసించేవారు. అందువల్ల దీనికి ‘కాశి’ అనే పేరు స్థిరపడింది.   ఫోన్: 7032666927

 

భారతీయ యాత్రా ప్రపంచంలో ఆర్ వి టూర్స్ అండ్ టావెల్స్
సనాతన సంస్కృతికి, ఆచారాలకు నిలయం అయిన భారతదేశంలోని పైన పేర్కొన్న కైలాస మానస సరోవరం, అమర్‌నాథ్, చార్‌ధామ్, కాశీ యాత్రలతోపాటు, భారతదేశం నలుమూలల అన్ని ఆధాత్మిక ప్రదేశాలకు యాత్రా ప్యాకేజీలు అందిస్తున్న సంస్థ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ గడిచిన 14 సంవత్సరాలుగా ఎంతోమంది తెలుగువారి ఆహార అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. సువిశాల భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా యాత్రికులను పంపిస్తూ తెలుగువారి ఆదరాభిమానాలు పొంది ఆత్మీయ ట్రావెల్‌గా పిలువబడుతున్న సంస్థ ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంవత్సరం కూడా పైన తెలిపిన అన్ని యాత్రా స్థలాలకు ప్రత్యేకమైన ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి వున్న వారు ఆర్‌వి ట్రావెల్స్‌ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు