బ్లాగుల్లో కిచెన్ కబుర్లు

5 May, 2015 12:11 IST|Sakshi
బ్లాగుల్లో కిచెన్ కబుర్లు

కొత్తగా కాపురం పెట్టిన జంటకు వంట వండుకుని తినటం అంటే పెద్ద పరీక్షే. ఇంట్లో అమ్మో, అమ్మమ్మో చేసి పెట్టే కూరలు, పులుసులు తిని వాటికి పేర్లు పెట్టడమే తప్ప వాటిని శ్రద్ధగా వండి జీవిత భాగస్వామికి వడ్డించే నవతరం ఇల్లాళ్లు బహు అరుదు. కొందరికి కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటేనే ఇష్టం ఉండదు. భోజన ప్రియుడైన భర్తకు శ్రీమతి పిండివంటల మాటేలా ఉన్నా రుచికరంగా కూరనైనా రెడీ చేస్తే ఎంత హ్యాపీ. అలాంటి యువతుల కోసం, స్వయంపాకం చేసుకునే బ్రహ్మచారుల కోసం ఇంటర్‌నెట్‌లో ఎన్నో వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే సరి ఘుమఘుమలాడే వంటలు రెడీ..


 కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి క్షణం అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దానితో పాటే మనం కూడా అప్‌డేట్ అవ్వాలి. టెక్నాలజీని అందుకోవడంలో ఎప్పుడూ ముందుండాలి. ఆ విషయంలో వైజాగ్‌వారు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. వంటలు రాక చేతులు కాల్చుకున్న వారిని చూశాం. తొలి నాళ్లలో వంటల పుస్తకాలు వచ్చాయి. అందులో ఏ ఐటమ్ ఎలా త యారు చేయాలో చూసి కాస్తో కూస్తో వండుకునేవారు. కానీ ఇప్పుడు బుక్స్ , ఈ-బుక్స్‌గా మారిపోయాయి. అంతా ఇంటర్‌నెట్ మయం. అందుకే ఇప్పుడు వంటల పుస్తకాలను పక్కన పెట్టేసి వంటల బ్లాగ్స్/వెబ్‌సైట్స్ ఫాలో అవుతున్నారు వంట నేర్చుకోవాలనుకునేవారు.
 
 బ్లాగులో వంటలు
 బ్లాగు అంటే ఆన్‌లైన్ డైరీ లాంటిది. మనం ఏం రాయాలి అనుకుంటే అది రాయచ్చు. కాకపోతే దానికి నెటిజన్లలో కాస్త ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. నెట్ యూజ్ చేసేవారిని అట్రాక్ట్ చేయగలిగితే చాలు. అది సక్సెస్ అయినట్లే.
 
 మనిషి ఎంత కష్టపడినా సరే తిండి  కోసమే... అందుకే రకరకాల వెరైటీ వంటకాలు తయారు చేస్తూ వాటిని ఇంటర్‌నెట్‌లో బ్లాగ్/వెబ్‌సైట్ క్రియేట్ చేసి వాటిలో అపలోడ్ చేస్తున్నారు చాలా మంది. వాటిలో కొన్ని వైజాగ్ నుంచి కూడా ఉన్నాయండి. శైలూస్‌ఫుడ్.కాం,హేమాస్‌కిచెన్, ఫేస్‌బుక్‌లో బనానాలీఫ్ రెసిపీస్ ఇలాంటి ఫుడ్ వెరైటీలను అందించేవే.
 
 ఆల్ వెరైటీ
 రెసిపీస్ అంటే కేవలం ఒకటి రెండు కాదు. ఇంటర్నేషనల్  వంటకాల నుంచి మన సంప్రదాయ వంటకాల వరకు అన్ని రకాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. ఆ వంటకు కావలసిన వస్తువుల దగ్గర నుంచి దానిని ఎలా తయారు చేయాలి? తయారు చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది? అనే విషయాలు ఫొటోతో సహా పెడుతున్నారు. దీని వలన ఆ వంటకం మీద ఫస్ట్‌లోనే ఒక ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడే అది ట్రై చేయలా లేదా అని డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్‌లో ఎలాంటి డ్రింక్స్ తాగితే బాడీ కూల్ అవుతుం. ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాలు కూడా అప్‌డేట్ చేస్తున్నారు.
 
 శైలూస్ ఫుడ్
 ఫుడ్ బ్లాగ్స్‌లో బాగా పాపులర్ అయిన వాటిలో ఠీఠీఠీ.ట్చజీఠటజౌౌఛీ.ఛిౌఝ ఒకటి. అది మన సిటీకి చెందిన శైలజ మెయింటెన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మ,అమ్మమ్మ చేసే వంటలు చూస్తూ పెరిగిన శైలజ చిన్నప్పుడు వంటలో వాళ్లకి సహాయం చేసేవారు. తర్వాత కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు తయారుచేసే వంటల రెసిపీస్ అన్నీ రాసుకునేవారు. గవర్నెమెంట్ ఉద్యోగం వదిలేసిన తర్వాత కిచెన్‌లో ఎక్కువగా టైం గడిపేవారు. కొత్త కొత్త వంటలు చేసేవారు. సీజన్‌లో వచ్చే కూరగాయలతో కొత్త ఫ్లేవర్స్‌లో వంటలు చేసేవారు. ఇంట్లో వాళ్లకు బాగా నచ్చేవి. అలా తయారు చేసిన కొత్త వంటకాలను అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశానంటున్నారు.
 
 బనానాలీఫ్ రెసీపీస్
 ఫేస్‌బుక్... ఈ పదం ఒక్కటి చాలు... కొన్ని కోట్ల మంది ఫేవరెట్ బుక్. ఇందులో పబ్లిసిటీ చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రొడక్ట్ కానీ,ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలా ఓపెన్ చేసినదే ‘బనానా రెసిపీస్’ పేజ్. దీని గురించి పేజ్ అడ్మిన్ కుసుం లత ఇలా చెప్పారు. ‘నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వంటలు అందరితో పంచుకోవాలి అని ఈ పేజ్ స్టార్ట్ చేశాను. సౌత్ ఇండియా,నార్త్ ఇండియాలో ఫేమస్ వంటలు నా పేజ్‌లో అపడేట్ చేస్తాను. అది కూడా అన్నీ వెజిటేరియన్. అలాగే ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. అందుకే వాటిని కూడా ప్రమోట్ చేస్తాను. త్వరలో ఒక వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏ వంట ఎలా చేయాలి అని నన్ను అడిగి ట్రై చేస్తుంటారు.

మరిన్ని వార్తలు