వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి

5 Mar, 2018 00:35 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది
సినిమాలో ఒక పాత్ర వ్యక్తిత్వాన్ని పాటలో పట్టుకోవడం, అదీ కవితాత్మకంగా మలవగలగడం గీతరచయితకు ఒక సవాలు. దాన్ని విజయవంతంగా ‘స్వర్ణకమలం’ కోసం ఛేదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. భానుప్రియ పోషించిన మీనాక్షి పాత్ర స్వభావాన్నీ, ఆమె జీవితంలో వచ్చిన పరిణామాలనూ ప్రకృతికి అన్వయిస్తూ ‘కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి/ మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటునున్న కన్నె మల్లికి’ పాట రాశారు. ఇందులోని ఈ పాదాలు మరింత శ్రేష్ఠమైనవి:
‘వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధుర గానకేళి’
‘కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు’.
దీనికి సంగీతం ఇళయరాజా. పాడినవారు ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్‌. వెంకటేష్‌ నాయకుడు.

మరిన్ని వార్తలు