నన్నడగొద్దు ప్లీజ్‌ 

2 May, 2018 00:21 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌..! నా ఫ్రెండ్‌ ఒక అమ్మాయిని లవ్‌ చేశాడు. వాళ్లది టూ సైడ్‌ లవ్‌. వాళ్లు రాంగ్‌ కాల్‌తో కలుసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోస్‌ షేర్‌ చేసుకున్నారు తప్ప ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఒకరోజు నా ఫ్రెండ్‌ చనిపోయాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి మా ఫ్రెండ్‌ వాళ్ల అన్నయ్యతో మాట్లాడుతుండేది. తర్వాత కొన్నిరోజులకి ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు ఆ అమ్మాయి.. ఆ అబ్బాయిని లవ్‌ చెయ్యడం కరెక్టేనా చెప్పండి సార్‌? – మధు
మధు నువ్వు మంచివాడివి.ఆ అమ్మాయిని తూలనాడక, చీప్‌గా చూడకుండా, లోకువ చెయ్యకుండా, తన మొదటి ప్రేమను హేళన చెయ్యకుండా.. తన కొత్త ప్రేమను ఛీ కొట్టకుండా...!!‘ఏంటి సార్‌..? మధు యాక్చువల్లీ... ఆ అమ్మాయి ప్రేమ కరెక్టా అని రాశాడు. కాబట్టి.. మధు ఆ అమ్మాయిని తూలనాడుతూ.. చీప్‌గా చూస్తూ.. లోకువ చేస్తూ.. మొదటి లవ్‌ను హేళన చూస్తూ.. సెకెండ్‌ లవ్‌ను ఛీ కొట్టినంత పని చేశాడేమోనని అనుమానిస్తున్నారా సార్‌? మధు అలాంటి వాడు కాదు సార్‌. ఆ అమ్మాయిని తూలనాడక.. చీప్‌గా చూడకుండా.. లోకువ చెయ్యకుండా.. తన మొదటి ప్రేమను హేళన చెయ్యకుండా.. తన కొత్త ప్రేమను ఛీ కొట్టకుండా ఏదో చిన్న డౌట్‌ క్లియర్‌ చేసుకోవడానికి రాశాడు సార్‌!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు