నన్నడగొద్దు ప్లీజ్‌ 

3 Oct, 2018 00:39 IST|Sakshi

హాయ్‌ సార్‌.! నన్ను ఒక అమ్మాయి లవ్‌ చేస్తోంది. పెళ్లి చేసుకుందామని తనే నన్ను ఫోర్స్‌ చేసింది. కానీ ‘‘నాకు ఉద్యోగం లేదుగా నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా..?’’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ తను ఒప్పుకొకపోగా బాగా ఏడ్చింది. అయినా సరే తనని బలవంతంగా ఇంటికి పంపించేశాను. అప్పటికే వాళ్ల ఇంట్లో మా విషయం తెలుసు కానీ వాళ్ల నాన్నకి మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. తను మూడు రోజుల తర్వాత కాలేజ్‌కి వచ్చింది. అదే రోజు వెళ్లి తనతో మాట్లాడటానికి ప్రయత్నించాను. తను మాత్రం ‘నువ్వు ఎవరో నాకు తెలియదు’ అని ముఖం మీదే చెప్పిండి. ఎంత రిక్వెస్ట్‌ చేసినా ‘నువ్వంటే ఇష్టం లేదు, నన్ను చంపకు’ అని కోప్పడింది. తనెప్పుడూ ‘నాకు నువ్వు తప్ప ఎవరూ వద్దు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను’’ అనేది. అలాంటిది ఇలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. తనేమో ఎంతో ఈజీగా నన్ను మరచిపోయింది. కానీ నేను మరచి పోలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి సార్‌... నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్‌. – రాజేష్‌

వద్దనుకుని వెనక్కి పంపేశావు కదా...!?ఇప్పుడు కూర్చుని బాధపడితే ఏం దొరుకుద్ది బ్రో...నిరాశ... నిస్పృహ.... నిర్వేదం.... తప్ప.. ???????????‘నిర్వేదం అంటే ఏంటి సార్‌???’నాకు తెలియదు నీలూ..! ఏదో ఫ్లోలో అనేశాను...!‘రాజేష్‌ కూడా ఫ్లోలో అనేశాడు సార్‌ ‘‘కుదరదు ఇంటికి పో’’ అని. అమ్మాయి అన్నంత  పనీ చేసింది.. పోయింది..! మరి ఇప్పుడేమి చెయ్యాలి సార్‌..?పాపం రాజేష్‌ గుండె.. పుండై ఏడుస్తోంది సార్‌?!?’ఎందుకు ఏడవడం...? ఒక్కోసారి వర్కౌట్‌ కాదు. ఆ రోజు వెళ్లమని చెప్పకుండా ఉండమని చెప్పినా వర్కౌట్‌ అవుతుందని గ్యారెంటీ ఏంటి? అమ్మాయి పేరెంట్స్‌ ఎలాగూ కుదరదని చెప్పేశారు కదా!?!‘సార్‌....! ఉన్న విషయాన్నే న్యూస్‌లా చదవకుండా యూజ్‌ ఏమైనా ఉంటే చెప్పండి సార్‌!’ప్రేమను మింగి.. బాధను దిగమింగాలి..! వేరే మార్గం లేదు..!! మనోడికి కూడా మంచి రోజులు వస్తాయి.!! అప్పటిదాకా జాబ్‌ ట్రయల్స్‌ చెయ్యడం మంచిది..!!!‘మంచిది సార్‌!!!!!!’
ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దొంగలో కరుణ

ఇలా చేసిన అత్తను చూశారా?

బోల్డ్‌ కబుర్లు

దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...

ఆలయ ద్వారం... అనంత శక్తి కేంద్రం

బంగారు పూలు నాకెందుకు!

జయహో భక్త హనుమాన్‌

నిలబడే ఉన్నారా!?

బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

గంధపు చెక్క... పన్నీటి చుక్క

ఆశాదీక్షలే ఇరు భుజాలు

మామిడి ఉపయోగాలు

పండు తెచ్చావా లొట్టలేశావా?

నిశ్చల ప్రేమ కథా చిత్రం

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...