హెల్త్‌టిప్స్‌

23 Mar, 2019 01:03 IST|Sakshi

చిన్న చిన్న సమస్యలకు కూడా మందులు వాడుతూ ఉంటే వాటి వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇతర అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మెడిసిన్‌ను వాడాలి. దీంతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. పైగా ఎలాంటి అనారోగ్యాన్నయినా ఇట్టే తగ్గించుకోవచ్చు

జలుబు, ఫ్లూ జ్వరానికి...
ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక నిమ్మకాయను పిండి అనంతరం ఆ తొక్కను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాల ఉంచాక తీసేయాలి. ఆ నీటిలో టీస్పూన్‌ తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు, ఫ్లూ జ్వరం తగ్గుతాయి.

వికారంగా ఉంటే...
కడుపు అంతా ఉబ్బరంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే నల్లమిరియాల పొడి, నిమ్మరసం తీసుకుని వాటిని ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం తగ్గుతుంది. 

గాల్‌ స్టోన్స్‌కు...
నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్‌ ఆయిల్‌తో కలిపి తింటుంటే గాల్‌ స్టోన్స్‌ పోతాయి. దానివల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.


 

మరిన్ని వార్తలు