ప్యాంట్‌ మీద పెయింట్‌

22 Dec, 2016 23:12 IST|Sakshi
ప్యాంట్‌ మీద పెయింట్‌

న్యూలుక్‌

డెనిమ్‌ ప్యాంట్లను ఎప్పుడూ ఒకే విధంగా ధరించాలంటే బోర్‌ కొడుతుంది. వాటికి సులువుగా కొత్త హంగులు తీసుకురావచ్చు. రకరకాల మోడల్స్‌లో కలర్‌ఫుల్‌ ప్యాంట్లుగా మార్చేసి, న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. ప్యాంట్‌ మీద రంగులన్నీ ఇలా పులిమేస్తే అబ్‌స్ట్రాక్‌ పెయింట్‌లా అదిరిపోయే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.

ప్యాంట్‌ మీద నెమళ్ళు, సీతాకోకచిలుకలు, అందమైన రంగ వల్లుల డిజైన్లు పెయింట్‌ వేయిస్తే చూడముచ్చటగా మారిపోతుంది. డెనిమ్‌ ప్యాంట్‌ బాటమ్‌కి వైట్‌ ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ వేసి, దాని మీద నలుపురంగు పెయింట్‌తో ఎంచక్కని డిజైన్‌ గీస్తే,,, ఇలా కొత్తగా కళ్లకు కడుతుంది.
 

మరిన్ని వార్తలు