నైస్ క్రీమ్

23 Aug, 2016 00:05 IST|Sakshi
నైస్ క్రీమ్

ఇంటిప్స్


ఐస్‌క్రీమ్‌ను మూత గట్టిగా ఉన్నా బాక్స్‌లో వేసి, ఆ బాక్స్‌ను ఓ పాలిథీన్ షీట్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. అప్పుడు ఐస్‌క్రీమ్ మరీ గట్టిగా బిగిసిపోకుండా సాఫ్ట్‌గా ఉంటుంది.


{ఫిజ్ దుర్వాసన వస్తుంటే... ఓ నిమ్మ చెక్కను కానీ నారింజ బద్దను కానీ ఫ్రిజ్‌లో పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయానికల్లా దుర్వాసన పోతుంది.


ఎండు మిరపకాయల మీద కొద్దిగా ఉప్పు, నూనె చిలకరించి డబ్బాలో పెడితే... ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.ఊరగాయ మంచి ఎరుపు రంగులో కనిపించాలంటే... చిటికెడు బేకింగ్ సోడా వేయాలి. డైనింగ్ టేబుల్ మీద ఈగలు ముసురుతుంటే... ఉప్పు నీటిలో ముంచిన బట్టతో తుడిస్తే ఇక అవి రావు.

మరిన్ని వార్తలు