నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి

28 May, 2018 00:53 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

ప్రేమ అంటూ పట్టుకున్నదంటే పుట్టే లక్షణాల్లో ఒకటి, నిద్ర లేకపోవడం. ఎన్ని పాటల్లో ఎందరు నాయికానాయకులు దాన్ని పాడుకునివుంటారు! ‘ప్రియమైన నీకు’ చిత్రంలో స్నేహ కూడా అలాగే పాడుతుంది, కాకపోతే మరింత అందంగా, మరింత కవిత్వంగా.

‘నీలి కన్నుల్లో అతని బొమ్మని 
చూసి  నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకొనే రేయిలో’ అంటుంది. ఈ గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. పల్లవి వెంటనే గుర్తురాకపోతే గనక అది ఇలా సాగుతుంది. అందులోనూ నాయకుడిని చూడగానే నాయిక పడే తడబాటు.
‘మనసున ఉన్నది చెప్పాలనున్నది 
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి 
బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ’.

దీనికి సంగీతం శివ శంకర్‌. పాడినవారు చిత్ర. 2001లో వచ్చిన ఈ తెలుగు– తమిళ ద్విభాషా చిత్రానికి దర్శకుడు బాలశేఖరన్‌. తరుణ్‌ నటించారు. 

మరిన్ని వార్తలు