ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా సంపద పెంపు

28 May, 2018 00:55 IST|Sakshi

పథకాల ఎంపికలో జాగ్రత్తలు అవసరం

సాక్షి మైత్రి ఇన్వెస్టర్‌ క్లబ్‌ సదస్సులో నిపుణులు

సాక్షి, విశాఖపట్నం: సంపద పెంచుకోవడానికి  స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాల ని ఆదివారం విశాఖలో జరిగిన సాక్షి మైత్రి ఇన్వెస్టర్‌ క్లబ్‌ సదస్సులో ముఖ్య వక్త సీడీఎస్‌ఎల్‌ రీజనల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ వెనిశెట్టి  సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు అవగాహన చేసుకోవడం కీలకమని, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఎంపికలో జాగ్రత్త వహించాలని అన్నారు.

  ఖాతాదారుల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తున్నాయని, డీమ్యా ట్, ట్రేడింగ్, ఏస్‌బీఐ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ అకౌంట్‌ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రియల్‌ ఎస్టేట్, గోల్డ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడులు మెరుగ్గా వుంటాయని ఆయన అన్నారు. సదస్సులో ఎస్‌బీఐ క్యాప్‌ రీజినల్‌ హెడ్‌ టి.జగన్‌మోహన్‌రెడ్డి, మ్యూచువల్‌ చీఫ్‌ మేనేజర్‌ ఎల్‌. కృష్ణకుమార్‌ నిపుణలు, సాక్షి విశాఖ బ్రాంచి మేనేజర్‌ కె.రేవతికుమారిలతో పాటు వ్యాపార, వర్తక యజమానులు, రిటైర్డ్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు