స్త్రీగా పుట్టడమే ఓ అవార్డ్‌..

4 May, 2018 00:46 IST|Sakshi

స్త్రీగా పుట్టడమే ఓ అవార్డ్‌ అంటున్నారు మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఈ మాట చెప్పారామె. అలాగే ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఆమె స్పందిస్తూ – ‘‘ప్రతీరోజు ఎన్నో  రేప్‌లు జరగడం చూస్తున్నాం. ఈ విషయం గురించి నా ఒపీనియన్‌ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మన ఒపీనియన్స్, నిరసన తెలియజేస్తూ ఉంటే ఏ పనీ జరగదు. దానికి బదులు ఇవి ఆగడానికి సరైన పరిష్కారం వెతికితే బాగుంటుంది.

ప్రపంచం మొత్తం మీద, మన దేశంతో సహా కొన్ని కొన్ని జీర్ణించుకోలేని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనకు రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. అయ్యో.. ఇలా జరిగిందే? అని బాధపడి మర్చిపోవటం. మరొకటి ఇలాంటి క్రైమ్స్‌కి పాల్పడే వాళ్ల గురించి పదే పదే చర్చించడం మానేసి, సొసైటీలో స్త్రీలకు సహాయంగా ఉంటూ, గౌర వించే మగవాళ్లను హైలైట్‌ చేస్తూ మాట్లాడటం.

అప్పుడు తప్పుడు దోవలో వెళుతున్న మగవాళ్లలో ఆలోచన రేకెత్తించగలుగుతాం. మంచి దోవలో వెళితే మన గురించి కూడా ఇలా నాలుగు మంచి మాటలు మాట్లాడతారు కదా అనే భావనని కలిగించగలుగుతాం అని నా ఫీలింగ్‌. ఈ విధంగా ఎంతో కొంత మంచి మార్పుని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు’’ అని అన్నారు సుస్మితా సేన్‌.

మరిన్ని వార్తలు