ఆ నేడు సెప్టెంబర్ 13, 1993

12 Sep, 2015 23:20 IST|Sakshi
ఆ నేడు సెప్టెంబర్ 13, 1993

కదిలింది శాంతిరథం...
ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసర్ అరాఫత్‌లు వైట్‌హౌజ్‌లోని సౌత్‌లాన్‌లో  జరిగిన  కార్యక్రమంలో పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పాలస్తీనాకు పరిమితమైన స్వయంప్రతిపత్తికి మార్గం సుగమం చేసే ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిల్‌క్లింటన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
 ‘‘ఇప్పటి వరకు జరిగిన రక్తపాతం, కాలువలు కట్టిన కన్నీళ్లకు అడ్డుకట్టవేద్దాం’’ అన్నారు రాబిన్ ఆ సమావేశంలో. ‘‘ఈ ప్రక్రియ మా  జీవితాల్లో అత్యంత కీలకమైనది’’ అన్నారు అరాఫత్.

 ‘‘భవిష్యత్ శాంతి చర్చలకు ఇదో పునాదిరాయిలాంటిది’’ అన్నారు రాజకీయ విశ్లేషకులు.అయిదు ఇరు వర్గాలలోని అతివాదులకు మాత్రం ఈ శాంతిప్రక్రియ బొత్తిగా నచ్చలేదు.  ఈ శాంతికరచాలనం ఆ తరువాత కాలంలో ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చింది అనేది వేరే విషయంగానీ...పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రెండు వర్గాల ప్రతినిధులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం, శాంతివచనాలు వల్లించడం...ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.  ఈ సమావేశం ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది.
 

మరిన్ని వార్తలు