మేని మెరుపులకు...

9 Jul, 2014 23:21 IST|Sakshi
మేని మెరుపులకు...

చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే...
 
Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది.
 
Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్‌లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి.
 
Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి.
 
Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు.
మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది.
 
Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది.
 
Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్‌ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు.
 
Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్‌ఫ్యూమ్‌ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.
 

మరిన్ని వార్తలు