ఎందుకలా ఉన్నావ్‌?

30 Jul, 2018 00:45 IST|Sakshi

చెట్టు నీడ 

బాధ, సంతోషం కలసిందే జీవితం. ఎప్పటిమాట! ఎప్పటి మాటైనా ఎప్పటికీ తెలుసుకోవలసిన మాట. కలవడానికి ఏవైనా రెండు ఉండాలి. అందుకేమో జీవితంలో సుఖఃదుఖాలు కలిసి ఉంటాయి. కలవకుండా రెండూ వేర్వేరుగా ఉంటే? వేర్వేరుగా ఉండడం అంటే జీవితంలో ఏదో ఒకటే ఉండడం. బాధగానీ, సంతోషం గానీ! అలా ఉండదు కానీ, ఉంటే కనుక రెండిటికీ విలువ ఉండదు. అప్పుడిక జీవితం కూడా విలువను కోల్పోతుంది. ఏదో బతికేస్తున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషం విసుగనిపిస్తుంది.

ఎప్పుడూ బాధ విరక్తి కలిగిస్తుంది. కాబట్టి రెండూ కలిసే ఉండాలి. మానవజన్మ చేసుకున్న అదృష్టం ఏంటంటే బాధలో, సంతోషంలో లోకం మన ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఉంటుంది!  సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి సంతోషిస్తుంది. బాధలో ఉంటే దగ్గరకొచ్చి ‘ఎందుకలా ఉన్నావ్‌?’ అని అడుగుతుంది. ‘ఏం లేదు’ అంటే వదిలి పెట్టదు. ఏముందో చెప్పేవరకు వదిలి వెళ్లదు. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకు బాధగా ఉన్నామో చెప్పుకోవడం కన్నా, మనసులోని బాధను అదిమిపట్టుకుని నవ్వు ముఖం పెట్టడం తేలికని! వాస్తవానికి మనం చెయ్యవలసింది కూడా అదే. బాధను ఉంచుకోవాలి. సంతోషాన్ని పంచుకోవాలి.

>
మరిన్ని వార్తలు