వందలమందికి ‍ప్రాణంపోసిన ‘రక్తవీర్‌’

25 Nov, 2023 09:18 IST|Sakshi

బీహార్‌లోని సుపౌల్‌కు చెందిన ఒక యువకుడు రక్తదాతలకు స్ఫూర్తిదాయకునిగా నిలుస్తున్నాడు. ఈ యువకుని చొరవతో ఇప్పటివరకు 1,100 మంది ప్రాణాలు నిలిచాయి. వివిధ సామాజిక సంస్థలు  ఆ యువకుడిని సన్మానించాయి. ఈ కుర్రాడి పేరు అవినాష్ కుమార్ అమర్ అలియాస్ లోలప్ ఠాకూర్(28). ఇప్పటి వరకు అవినాష్‌ 330 లీటర్ల రక్తాన్ని తమ సంస్థ ద్వారా దానం చేశాడు. నగరంలో ఎవరికి రక్తం కావాలన్నా అందరికీ ముందుగా అవినాష్‌ పేరు గుర్తుకువస్తుందని స్థానికులు చెబుతుంటారు. 

మూడేళ్ల క్రితం 2019 ఆగస్టు నెలలో తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు, అతనిని చూడటానికి  ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో తనకు తొలిసారిగా రక్తదానం చేయాలనే ఆలోచన వచ్చిందని అవినాష్‌ తెలిపారు. తరువాత అవినాష్‌ తన స్నేహితులతో కలిసి ఓ రక్తదాన సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ‘రక్తవీర్ గ్రూప్’ అని పేరు పెట్టారు. ఈ గ్రూప్‌ 2019 నుండి అవసరమైనవారికి రక్తం అందిస్తూ వస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియడంతో వారంతా అవినాష్‌ మొదలు పెట్టిన సంస్థ ద్వారా రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు. 

తమ సంస్థకు సోషల్ మీడియా ఒక వరంలా మారిందని అవినాష్‌ తెలిపారు. తమ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చాలమంది చేరారని, వారంతా రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా తమ సంస్థకు అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. 
ఇది కూడా చదవండి: గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి

మరిన్ని వార్తలు