ఉండ్రాళ్లు

26 Aug, 2017 11:02 IST|Sakshi
ఉండ్రాళ్లు

కావలసినవి : బియ్యపురవ్వ– కప్పు; నీళ్లు – రెండు కప్పులు; శనగపప్పు – పావు కప్పు(నానబెట్టాలి);  జీలకర్ర – టీ స్పూన్‌; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఉప్పు–కొద్దిగ; పచ్చికొబ్బరి – 3 టేబుల్‌ స్పూన్లు

తయారి: ముందుగా మందపాటి పాత్రలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరుగుతుండగా, బియ్యపు రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. చల్లారాక చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, దించి, తీసుకోవాలి.

బెల్లం తాలికలు
కావలసినవి: బియ్యప్పిండి – గ్లాసు; గోధుమ పిండి – అర గ్లాసు; బెల్లం – 2 గ్లాసులు; ఎండు కొబ్బరి ముక్క లు – కొద్దిగా; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పు, బాదంపలుకులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు

తయారి: అర గ్లాసు నీళ్లు పోసి, కొద్దిగా బెల్లం వేసి కరిగించాలి. దీంట్లో గోధుమపిండి వేసి చపాతీపిండిలా కలపాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సన్నగా తాల్చాలి. గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీళ్లుపోసి మరుగుతుండగా బెల్లం కరిగించి, తాలికలను ఉడికించాలి. దీంట్లో బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం బాగా ఉడికాక, ఏలకుల పొడి వేయించిన బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు కలపాలి.

మరిన్ని వార్తలు