అడగండి చెబుతాం...

10 Apr, 2017 13:09 IST|Sakshi
అడగండి చెబుతాం...

హాకీలో ఆటగాళ్లకు శిక్ష విధించే గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డులను ఎప్పుడు వాడతారు?
 ప్రశ్న అడిగిన వారు: స్వరూప్ కుమార్, నెల్లూరు
 
సాధారణంగా హాకీ మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పకుండా అదుపులో ఉంచేందుకు రిఫరీలు ఈ కార్డులను ఉపయోగించి హెచ్చరిస్తారు. ఇందులో అన్నింటికంటే తక్కువ రకమైన శిక్షగా గ్రీన్ కార్డును చెప్పవచ్చు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని ఆపే ప్రయత్నంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే దీంతో హెచ్చరిస్తారు. గ్రీన్ కార్డు చూసిస్తే ఆటగాడు రెండు నిమిషాల పాటు మైదానం వీడాల్సి ఉంటుంది.

ఆ తర్వాతి స్థాయిలో ఎల్లో కార్డ్‌ను జారీ చేస్తారు. ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్టిక్‌తో కాకుండా శరీరంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్లో కార్డు చూపించి ఆటగాడిని బయటికి పంపిస్తారు. ఇందులో కనీసం 5 నిమిషాల పాటు మైదానం వీడాలి. అంతకంటే ఎక్కువ సమయం కూడా శిక్షించవచ్చు. రెడ్ కార్డు అన్నింటిలోకి పెద్ద శిక్ష. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిపై శారీరకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం,  రక్తమోడటంలాంటిది ఏదైనా జరిగితే రెడ్ కార్డు చూపిస్తారు.

రెడ్ కార్డు శిక్షకు గురైతే చూపిస్తే ఆ మ్యాచ్ మొత్తంలో అతను ఆడటానికి వీలుండదు. దాంతో పాటు తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే శిక్షల్లో స్థాయి భేదాలు అంతా రిఫరీ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఏ కార్డు ద్వారానైనా ఆటగాడు బయటికి వెళితే మిగతా 10 మంది సభ్యులతోనే సదరు జట్టు మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపవచ్చు.
 

మరిన్ని వార్తలు