Why Green Crackers Dangerous: గ్రీన్‌ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?

9 Nov, 2023 07:29 IST|Sakshi

కోర్టులు, ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించిన 63 శాతం నమూనాలలో బేరియంతో పాటు ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నాయని తేలింది. ఇవి మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దీపావళి వేడుకలు సమీపిస్తున్న సమయంలో వెల్లడైన ఈ అధ్యయనం టపాసుల విక్రేతల ఉత్సాహాన్ని చల్లార్చేలా ఉంది. ఈ తరహా గ్రీన్‌ క్రాకర్స్‌ విక్రయాలను నిలిపివేయాలని ఈ అధ్యయనం చేపట్టిన సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీఎస్‌ఐఆర్‌ నీరి అధికారిక గ్రీన్ లోగోతో మార్కెట్‌లోకి విడుదల చేసిన టపాసులు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. 

ప్రభుత్వేతర సంస్థలు, ఆవాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో గ్రీన్‌ టపాసులలో బేరియం, ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నట్లు తేలింది. ఇవి మనిషి ఆరోగ్యాన్ని హరింపజేస్తాయి. దేశవ్యాప్తంగా బేరియం వ్యాపింపజేసే పటాకులను నిషేధించారు. సాంప్రదాయ బాణసంచాలో వెలువడే మెటల్ ఆక్సైడ్ బేరియం అనేది శబ్ద కాలుష్యంతోపాటు కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. 
ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..

మరిన్ని వార్తలు