ముదిమిలో హాబీలతో మేలు

8 Feb, 2016 23:27 IST|Sakshi
ముదిమిలో హాబీలతో మేలు

పరిపరి   శోధన

ముదిమి వయసులో ఏం చేయగలం... రామా కృష్ణా అని కాలక్షేపం చేయడం తప్ప అనుకుంటే తప్పే అంటున్నారు అంతర్జాతీయ వైద్య పరిశోధకులు. నిజానికి ఆ వయసులో కావలసినంత తీరిక దొరుకుతుందని, మనసుకు నచ్చిన హాబీలతో ఆ తీరికను సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఫొటోగ్రఫీ, కుట్లు, అల్లికలు, తోటపని వంటి హాబీలు అలవాటు చేసుకుంటే, ముదిమి వయసులో మెదడు చురుకుగా పనిచేస్తుందని, దానివల్ల డెమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవని తమ అధ్యయనంలో తేలినట్లు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ముదిమి వయసులో ఇలాంటి హాబీలలో నిమగ్నమైన వారికి మెదడుకు సంబంధించిన రుగ్మతలు తలెత్తే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వారు అంటున్నారు.
 

 
 

మరిన్ని వార్తలు