Italy Issues: ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?

28 Oct, 2023 07:57 IST|Sakshi

ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్  పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ.

దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. 
ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు

మరిన్ని వార్తలు