ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్‌డ్‌ పర్సన్‌లా కనిపించడం ఖాయం!

4 Sep, 2023 12:31 IST|Sakshi

ఇటీవలకాలంలో చాలామంది ఏజ్‌ పరంగా చూస్తే చిన్నవాళ్లే అయినా వారిని చూస్తే ఏజ్‌డ్‌లా కనిపిస్తారు. వాళ్లు చెబతేగానీ మనకు తెలయను కూడా తెలియదు. దీంతో ఒకరకంగా వారు కూడా సమాజంలో కాస్త ఇబ్బందిగా ఫీలవ్వడమే గాక ఆత్మనూన్యత గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేసే వాటికి దూరంగా ఉండి వీలైనంతలో కొద్దిపాటు జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య మీ ధరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకూడదంటే..
కొందరూ చూస్తే ఎంత ఏజ్‌ వచ్చినా కూడా స్మార్ట్‌గా యంగ్‌గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర అంటున్నారు డాక్టర్‌ పాల్విన్‌. మంచి నిద్ర మన ముఖవర్చస్సు కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. సుఖమైన నిద్ర మనిషి ఏజ్‌ని దాచేస్తుందంటున్నారు. ఎప్పుడూ నిద్ర విషయంలో అస్సలు అశ్రద్ధ కనబర్చకూడదట. ఇదే అన్ని రకాల వ్యాధులు అటాక్‌ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందని కూడా చెబుతున్నారు.

ఈ నిద్ర మన జీర్ణవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతుందంటున్నారు. కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావట. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి అవసరమయ్యే నిద్రను మిస్‌ చేయకండని వార్నింగ్‌ ఇస్తున్నా డాక్టర్‌ పాల్విన్‌.

ఇలా ఒక నెలపాటు వేళకు భోజనం చేస్తూ..కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవడానికి యత్నించి చూస్తే మీకే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం స్వస్థత చెందడమేగాక మీకు తెలియకుండానే మీలో జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో మీ పడకగది కూడా మీరు వెళ్లగానే పడుకోవాలనిపించేంత ఆహ్లాదంగా పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు.

సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్‌, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్‌ తదితర చెడు అలవాట్లను సాధ్యమైనంత తొందరగా వదిలేయాలి. రోజువారి జీవనశైలిలో కొద్ది మార్పులు చేసి నిద్రకు సక్రమంగా షెడ్యూల్‌ని కేటాయించేలా చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని అంటున్నారు. ఈ విధానం పాటిస్తే కచ్చితంగా ఏజ్‌డ్‌ పర్సన్‌లా కనిపించరని, ఆయుః ప్రమాణం పెరిగి మీరు చిన్నవారిలానే కనిపిస్తారని డాక్టర్‌ పాల్విన్‌ చెబుతున్నారు.

(చదవండి: చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే  హ్యాండ్‌ ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌!)

మరిన్ని వార్తలు