మెల్లమెల్లగ వచ్చిండే... పాటల బిస్కెట్‌ ఏసిండే...

17 Jun, 2018 00:57 IST|Sakshi

మీరు యూతా? అంటే వయసులో కాదు. ఆలోచనల్లో, ఆచరణల్లో, జీవితాన్ని అందంగా జీవించడంలో... మీరు యూతా? అయితే ఇది మీకోసమే! 2000 – 2018 వరకు వచ్చిన కొన్ని వేల పాటల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించి, ఉత్సాహపరిచి, ఉల్లాసాన్నిచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ పాటలను వరల్డ్‌ మ్యూజిక్‌ డే (జూన్‌ 21) సందర్భంగా మీకు అందిస్తున్నాం. ఈ లిరిక్స్‌ చూడగానే మీరు ట్యూన్‌ పట్టేశారా... అంటే మీరు తప్పకుండా యూత్‌ అన్నట్టే! ఇందులో చాలా పాటలను మీరు విని ఉంటారు. చాలా పాటలను ఒక యుఫోరియాలా పాడుకొని ఉంటారు. ఇవే అత్యుత్తమం అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇది అసలు ఒక ర్యాంకింగ్‌ అని, సెలెక్షన్‌ అనీ మేం భావించట్లేదు. సరదాగా మేం ఎంపికచేసిన ఈ పాటలను మ్యూజిక్‌ డే రోజున సెలెబ్రేట్‌ చేసుకొని పాడుకుంటారని మాత్రమే..! కవర్‌ఫొటో చూడగానే మీకొక ట్యూన్‌ వచ్చేసింది కదా.. యూతెక్కించే పాటకు ట్యూన్‌ కట్టేస్కోండి!!  వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.. పాటల బిస్కెట్‌ ఏసిండే...

సదా నన్ను 
చిత్రం: మహానటి 
సంగీతం: మిక్కీ జె. మేయర్‌ 
గానం: చారులత మణి 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సదా నన్ను నడిపే నీ చెలిమే.. పూదారై నిలిచే / ప్రతీ మలుపు ఇకపై స్వాగతమై.. నా పేరే పిలిచే / ఇదే కోరుకున్న.. ఇదే కోరుకున్న.. అని నేడే తెలిసెలే / కాలం నర్తించదా నీతో జతై.. ప్రాణం సుమించదా నీ కోసమై (2) /నదికి వరదల్లె.. మదికి పరవళ్లై / బెరుకు ఎపుడు వదిలిందో.. చురుకు ఎపుడు పెరిగిందో / తలపు తొలిజల్లై.. తనువు హరివిల్లై / వయసు ఎపుడు కదిలిందో.. సొగసు ఎపుడు కురిసిందో / గమనించే లోగా.. గమకించే రాగాన.. ఏదో వీణ.. లోన మోగేనా / కాలం నర్తించదా నీతో జతై.. ప్రాణం సుమించదా నీ కోసమై (2) / 

వచ్చాడయ్యో సామీ.. 
చిత్రం: భరత్‌ అనే నేను 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : కైలాశ్‌ ఖేర్, దివ్య కుమార్‌  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
ముసలితాత ముడత ముఖం మురిసిపోయెనే.. గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయెనే.. రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్లో గంట.. రంగ రంగ సంబరంగ మోగెనే.. వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఇచ్చాడయ్యో సామీ.. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ (2) / కత్తి సుత్తి పలుగు పార తీయండి.. మన కష్టం సుక్కలు కుంకుం బొట్టుగ పెట్టండి / అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్లు.. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి / అమ్మోరు కన్ను తెరిసిన నవరాతిరి.. ఇన్నాళ్ల చిమ్మచీకటి తెల్లారే సమయం కుదిరి / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి......మట్టిగోడలు చెబుతాయి.. సీమ మనుషుల కష్టాలు / దారి గతుకులు చెబుతాయి.. పల్లె బతుకుల చిత్రాలు / పండగొస్తే ప్రతిఒక్కరి మనసూ మరి పరుగయ్యేది.. పుట్టి పెరిగిన పల్లె వైపేగా / అస్సలైన పండుగ ఎప్పుడంటే.. ఆ కన్నతల్లి కంటినీరు తుడిచిన రోజేగా.. / ఓ నాడు కళ కళ వెలిగిన రాయలోరి సీమిది.. ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత సినబోతోంది / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి......చేతివృత్తులు నూరారు.. చేవగలిగిన పనివారు / చెమటబొట్టు తడిలోనే.. తలుక్కుమన్నది ప్రతి ఊరు / ఎండ పొద్దుకు వెలిగిపోతారు.. ఈ అందగాళ్లు వానజల్లుకు మెరిసిపోతారు / ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు? వీళ్లందరి లాగే బాగ బతికే హక్కున్నోళ్లు / పల్లెటూళ్లు పట్టుబొమ్మలని ఒట్టి జోలపాట పాడక.. తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చెయ్యాలంట / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి......

దారి చూడు..
చిత్రం: కృష్ణార్జున యుద్ధం 
సంగీతం : హిపాప్‌ థమిజా 
గానం–సాహిత్యం : పెంచల్‌దాస్‌ 
దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల బేరే చూడు (2) / కమలపూడి కట్టమింద మామా.. కన్నెపిల్లల జోరే చూడు (2) / బులుగుసొక్కా ఏసిన వాడా పిలగా.. సిలక ముక్కూ చిన్నావాడా (2) / చక్కని చుక్క.. చక్కని చుక్క దక్కే చూడు మామా.. చిత్రకన్ను కొంటేవాడా / మేడలోని కుర్రాదాన్ని పిలగా.. ముగ్గులోకి దింపినావు (2) / నిన్ను కోరి.. నిన్ను కోరి వన్నెలాడి లైలా.. కోట దాటి పేట జేరే (2) / కురస కురస అడవిలోన పిలగా.. కురిసెనె గాంధారి వాన.. (2) / ఎక్కరాని.. ఎక్కరాని.. కొండలెక్కి మామా ప్రేమలోన చిక్కినావు (2) / పూల ఛత్రి పట్టుకొని పిలగా.. ఊరువాడా తోడురాగా (2) / జంటగానే.. జంటగానే.. కూడినారు మామా.. చలువ పందిరి నీడ కింద (2) /

రంగమ్మా మంగమ్మా..
చిత్రం : రంగస్థలం 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : ఎం.ఎం.మానసి 
సాహిత్యం : చంద్రబోస్‌ 
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు (2) / గొల్లభామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే.. (2) పుల్లచీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే.. ఉప్ఫమ్మా ఉప్ఫమ్మా అంటూ ఊదడు.. ఉత్తమాటకైన నన్ను ఊరుకోబెట్టడు (2) / అరె పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగితేలుతుంటే.. మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే.. మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ.. మంచి నీళ్లైనా సేతికియ్యడూ (2) / రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు / హే రామ సిలకమ్మా.. రేగిపండు కొడుతుంటే.. రేగిపండు గుజ్జువచ్చి కొత్తగా సుట్టుకున్న  రైక మీద పడుతుంటే.. (2) / మరకమ్మా మరకమ్మా అంటే సూడడూ.. మారురైకైనా తెచ్చి ఇయ్యడూ (2) / రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు / నా అందమంత మూటగట్టి.. అరె కంది సేనుకే ఎళితే.. కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే (2) / ఉష్షమ్మా ఉష్షమ్మా అంటూ తోలడు.. ఉలకడూ పలకడూ బండరాముడూ.. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు (2)/ 

చూసి చూడంగానే 
చిత్రం : ఛలో
సంగీతం : మహతి స్వరసాగర్‌ 
గానం : అనురాగ్‌ కులకర్ణి, సాగర్‌ 
సాహిత్యం :  భాస్కరభట్ల 
చూసి చూడంగానే నచ్చేశావే.. అడిగి అడగకుండా వచ్చేశావే.. నా మనసులోకి.. అందంగా దూకి / దూరం దూరంగుంటూ ఏం చేశావే / దారం కట్టి గుండె ఎగరేశావే / ఓ చూపుతోటి.. ఓ నవ్వుతోటి / తొలిసారిగా.. నా లోపల.. ఏమయ్యిందో.. తెలిసేదెలా../ నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే / నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే / నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే / అహ ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తోందే / నువు నా కంట పడకుండా.. నా వెంట పడకుండా.. ఇన్నాళ్లెక్కడ ఉన్నావే / నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే / నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే / నీ చిరునవ్వుకై నేను.. గెలుపొంది వస్తాను.. హామీ ఇస్తున్నానులే / ఒకటో ఎక్కం కూడా.. మరిచిపోయేలాగా.. ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండా ఉండగలనా / నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే / నీవంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే / 

బయటికొచ్చి చూస్తే.. 
చిత్రం : అజ్ఞాతవాసి 
సంగీతం – గానం : అనిరు«ద్‌ రవిచందర్‌ 
సాహిత్యం : శ్రీమణి 
బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్‌ / ఇంటికెళ్లే ట్వెల్వ్‌ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్‌ (2)/ ఓయ్‌! నీ చేతికున్న బ్యాంగిల్సే.. తాళమేసె నా సాండిల్సే / వాకు వేలో చూస్తే.. పువ్వుల రెక్కలు ఫుల్లుగా కప్పేసే / కార్నర్‌లో కాఫీ షాప్‌.. వేడివేడిగా విజిలేసే / బస్సు కిటికీ దగ్గర కాలేజ్‌ స్టూడెంట్‌ ఫోన్లో మోగే.. ఎఫ్‌ఎంలో ఎవరో పాడితే ఒళ్లంతా ఎందుకో ఊగెనే / ఆపిల్‌ పండులా సూర్యుడే.. ఎయిరోప్లేనులో నా గుండె.. తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా / ఒళ్లే గుచ్చెలే సడెన్‌గా.. చల్లగాలే విలన్‌లా / బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్‌ / ఇంటికెళ్లే ట్వెల్వ్‌ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్‌ (2)/
నీ పక్కనున్న వేళ.. కారు హార్న్‌ కూడా.. క్లాసికల్లు మ్యూజిక్కా / ఈ మండుటెండ కూడా ఏసీ జల్లుతోంది.. నీ నవ్వులోని మ్యాజిక్కా / ట్యాక్సీ హైరు చేసి నువ్వు.. బేరమాడుతుంటే.. క్యూటుగుంది బేసిగ్గా /బ్రేక్సు వేసినప్పుడల్లా.. నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజూగ్గా / నువ్వున్న కిటికీ.. ఏ వైపో వెతికీ.. వాట్సాపు చేస్తావా / మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుణ్ని తెస్తాగా / బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్‌ / ఇంటికెళ్లే ట్వెల్వ్‌ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్‌ (2)/ ఎఫ్‌ఎంలో ఎవరో పాడితే ఒళ్లంతా ఎందుకో ఊగెనే / ఆపిల్‌ పండులా సూర్యుడే.. ఎయిరోప్లేనులో నా గుండె / తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా / ఒళ్లే గుచ్చెలే సడెన్‌గా.. చల్లగాలే విలన్‌లా / 

వచ్చిండే.. 
చిత్రం : ఫిదా
సంగీతం : శక్తికాంత్‌ కార్తీక్‌ 
గానం : మధుప్రియ, రాంకీ 
సాహిత్యం : సుద్దాల అశోక్‌ తేజ 
వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే / క్రీము బిస్కెట్‌ ఏశిండే / గమ్మున కూసోనియ్యడే / కుదురుగ నిల్సోనియ్యడే / సన్న సన్నగ నవ్విండే / కునుకే గాయబ్‌ చేశిండే / ముద్ద నోటికి పోకుండా.. మస్త్‌ డిస్టర్బ్‌ చేశిండే / పిల్లా రేణుకే.. పిలగాడొచ్చిండే / డిన్నరన్నాడే.. డేటు అన్నాడే / ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేశిండే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... మగవాళ్లు మస్తు చాలూ.. మగవాళ్లు మస్తు చాలూ.. మస్కలుగొడతా ఉంటరే / నువు ఎన్నపూసలెక్క కరిగితె అంతే సంగతే / ఓసారీ సరే అంటూ ఓసారి సారీ అంటూ  మెయింటెయినూ నువు జేస్తే లైఫంతా పడుంటాడే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... అయిబాబోయ్‌ ఎంత పొడుగో.. (3) / ముద్దులెట్టా ఇచ్చుడే / తనముందు నిచ్చెనేసి ఎక్కితే గానీ అందడే / పరువాలే నడుం పట్టి.. పైకెత్తి ముద్దేపెట్టే.. టెక్నిక్‌లే నాకున్నయిలే.. పరేషానే నీకక్కర్లే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... పిల్లా రేణుకే.. పిలగాడొచ్చిండే / డిన్నరన్నాడే.. డేటు అన్నాడే / ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేశిండే / అరే ఓ పిల్ల ఇంక నువ్వు నేలనిడిచి గాలి మోటర్లో / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... 

మధురమే.. 
చిత్రం : అర్జున్‌ రెడ్డి
సంగీతం : రాధన్‌ 
గానం : సమీరా భరద్వాజ్‌ 
సాహిత్యం : శ్రేష్ట
మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే / మధురమే వీక్షణమే.. ఓ చెలీ.. మధురమే వీక్షణమే / మధురమే లాలసయే / మధురం లాలనయే / మధురమే లాహిరిలే / మధురం లలితమే / మధు పవనం వీచి.. మధు పవనం వీచి.. పరువమై మైమరచిందిలే / కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే / మోహం తన్మయమొంది శ్వాసించే గంధాలే / ఊరించే రుచులని మరిగి ఉడికించే తాపాలే / ఉప్పొంగే ఊపిరి సెగలో కవ్వించే దాహాలే / మౌనంగా మధువుల జడిలోన.. పులకించే ప్రాణాలే / మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే /వీచే గాలులు దాగి.. చెప్పేనే గుసగుసలే / చూసే ముసిముసి నవ్వులు.. చేసే బాసలనే / వశమై ఆనందపు లోగిట.. అరుదెంచి ఆకాశం.. సగమై ఈ సాగరమందే.. అగుపించే ఆసాంతం / తీరం ముడివేసిన దారం తీర్చే ఎద బారాలే / మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే......

దండాలయ్యా..
చిత్రం : బాహుబలి 2 
సంగీతం : ఎమ్‌.ఎమ్‌.కీరవాణి 
గానం : కాలభైరవ 
సాహిత్యం : ఎమ్‌.ఎమ్‌.కీరవాణి 
పడమర కొండల్లో.. వాలిన సూరీడా.. పగిలిన కోటలనే వదిలిన మారేడా (2) / తడిసిన కన్నుల్లో.. మళ్లీ ఉదయించి.. కలలో దేవుడిలా కాపై ఉంటావా / నీ అడుగులకే మడుగులు ఒత్తేవాళ్లం.. నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్లం మేమయ్యా / దండాలయ్యా.. దండాలయ్యా.. మాతోనే నువు ఉండాలయ్యా (2) / తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ.. ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా / తను చిందించె చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ.. పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా / నీ మాటే మా మాటయ్యా / నీ చూపే శాసనమయ్యా / మా రాజు నువ్వే.. తండ్రి నువ్వే.. కొడుకు నువ్వే.. మా ఆయువు కూడా నీదయ్యా / దండాలయ్యా.. దండాలయ్యా.. మారాజై నువ్వుండాలయ్యా / 

అరెరె ఎక్కడ ఎక్కడ.. 
చిత్రం : నేను లోకల్‌ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : నరేశ్‌ అయ్యర్, మనీషా ఈరబత్తిని 
సాహిత్యం : శ్రీమణి 
అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం.. ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం / అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం.. ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం / మాటల్లే మరిచే సంతోషం.. పాటల్లే మారింది ప్రతీక్షణం / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం......నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా / ఓ.. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా / మబ్బుల్లో ఓ.. చినుకులు మనమంటా / మనమే చేరే ఏ చోటైనా అయిపోదా పూదోట / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం......ఓ... కళ్లతో ఓ చూపు ముద్దే.. ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా / పెదవితో పెదవులకి ముద్దే.. అడగడం తెలియని అలవాటు మార్చవా / కాటుకనే దిద్దే వేలవుతా.. ఆ వేలే పట్టి ఈ వేళ నీ వెంట అడుగేస్తా / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం......

తాను నేను 
చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో.. 
సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌ 
గానం : విజయ్‌ ప్రకాశ్‌ 
సాహిత్యం :  అనంత శ్రీరామ్‌ 
తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. పైరు చేను / తాను నేను.. వేరు మాను / శశి తానైతే.. నిశినే నేను / కుసుమం తావి.. తాను నేను / వెలుగు దివ్వె తెలుగు తీపి / తాను నేను.. మనసు మేను / దారి నేను.. తీరం తాను / దారం నేను.. హారం తాను / దాహం నేను.. నీరం తాను / కావ్యం నేను.. సారం తాను / నేను తాను.. రెప్పా కన్ను.. వేరై పోని పుడమీ మన్ను (2)/
తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. గానం గమకం / తాను నేను.. ప్రాయం తమకం / తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. పైరు చేను / తాను నేను.. వేరు మాను / శశి తానైతే.. నిశినే నేను / కుసుమం తావి.. తాను నేను / వెలుగు దివ్వె తెలుగు తీపి / తాను నేను.. మనసు మాను / 

ఎవరే..
చిత్రం : ప్రేమమ్‌ 
సంగీతం : రాజేశ్‌ మురుగేశన్‌ 
గానం : విజయ్‌ యేసుదాసు
సాహిత్యం :  శ్రీమణి 
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే.. నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే / పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే.. నీ పేరే పలకడం పెదవులకు అలవాటే / వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే.. వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే / ప్రాణాలే తీస్తోందే నీ ఊహల తోటే.. నా మనసే నీదయ్యే.. వినదే నా మాటే / ఎవరే.. ఎవరే ప్రేమను మాయందీ.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ / ఎవరే నిన్నే నా వైపు నడిపే / నా ఊహల మధురోహల హరివిల్లు నింపే / తియతీయని నిమిషాలే నీలోన ఒంపే / నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే / ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో.. నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ / నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడు.. నువు లేక నే లేననీ / గదిలాంటి మదిలో.. నదిలాంటి నిన్నే.. దాచెయ్యాలనుకుంటే అది నా అత్యాశే / అడుగంత దూరం.. నువు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే /  వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే.. వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే / ప్రాణాలే తీస్తోందే నీ ఊహల తోటే.. నా మనసే నీదయ్యే.. వినదే నా మాటే / ఎవరే.. ఎవరే ప్రేమను మాయందీ.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ / 

ఒక లాలన... 
చిత్రం :  జ్యో అచ్యుతానంద 
సంగీతం : శ్రీ కళ్యాణ రమణ 
గానం: శంకర్‌ మహదేవన్‌ 
సాహిత్యం : భాస్కరభట్ల 
ఒక లాలన.. ఒక దీవెన.. సడి చేయవా.. ఎద మాటునా (2) / తియతియ్యని ప్రియ భావన.. చిగురించదా పొరపాటున / కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో / పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో / ఇంతకాలం దాచుకున్న ప్రేమని, హాయిని.. కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ / పెదవంచు మీద నవ్వుని పూయించుకోడం నీ పని / నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని / 
అందనంత దూరమేలే నింగికీ నేలకీ.. వానజల్లే రాయబారం వాటికి / మనసుంటే మార్గం ఉండదా.. ప్రతి మనిషి నీకే చెందడా? / ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపద / ఒక లాలన.. ఒక దీవెన.. సడి చేయవా.. ఎద మాటునా (2) / తియతియ్యని ప్రియ భావన.. చిగురించదా పొరపాటున / కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో / పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో / 

ప్రణామం ప్రణామం 
చిత్రం :  జనతాగ్యారేజ్‌ 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : శంకర్‌ మహదేవన్‌ 
సాహిత్యం :  రామజోగయ్య శాస్త్రి 
ప్రణామం ప్రణామం ప్రణామం.. సమస్త ప్రకృతికి ప్రణామం /  ప్రమోదం ప్రమోదం ప్రమోదం.. ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం / ప్రయాణం ప్రయాణం ప్రయాణం.. విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు.. నిట్టూర్పులే తడి మేఘాలు.. హృదయమే గగనం.. రుధిరమే సంద్రం.. ఆశే పచ్చదనం / మారే ఋతువుల వర్ణం.. మన మనసుల భావోద్వేగం.. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం / నువ్వెంత నేనెంత రవ్వంత.. ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత / అనుభవమే దాచిందీ కొండంత.. తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా / ఎవడికి సొంతమిదంతా.. ఇది ఎవ్వడు నాటిన పంట / ఎవడికి వాడూ నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా / తరములనాటి కథంతా.. మన తదుపరి మిగలాలంట / కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట / ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం / కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం / 

చలిగాలి చూద్దూ.. 
చిత్రం :  జెంటిల్‌మేన్‌ 
సంగీతం : మణిశర్మ
గానం : హరిచరణ్, పద్మలత, మాళవిక 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ / నన నన్నాన నన్నాన కథ ఏమిటీ / నన నన్నాన నన్నాన తెలుసా మరీ / ఇక ఈ పైన కానున్న కథ ఏమిటీ.. అది నీకైన నాకైన తెలుసా మరీ / అయినా వయసిక ఆగేనా.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ  ఎటు పోతున్నాం అని అడిగామా.. ఎదురుగ వచ్చే దారేదైనా / ఏమైపోతాం అనుకున్నామా.. జత పరుగుల్లో ఏం జరిగినా / శ్రుతిమించే సరాగం ఏమన్నదీ.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ కలతే అయినా కిలకిలమనదా.. మన నవ్వులలో తానూ చేరి / నడిరేయయినా విలవిలమనదా.. నిలువున నిమిరి ఈ దావిరి / మతిపోయేంత మైకం ఏమన్నదీ.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ..

యూ ఆర్‌ మై ఎమ్మెల్యే 
ఓ యే.. ఓసినీ ఓరచూపు గుచ్చినావే.. పోరగాని జిందగీని మార్చినావే / బోరబండ బోరులోకి తోసినావే / ఓయే.. ఓయే.. గండి మైసమ్మలాగ దొరికినావే / గండిపేట చెరువులోన ముంచినావే / సంపేత్తె సంపెయ్యె.. కుమ్మేత్తే కుమ్మెయ్యే.. అయినా నను లవ్‌ సెయ్యే ఓ ఎమ్మెల్యే.. నా ఎమ్మెల్యే (2) / ఏసేత్తే ఏసెయ్యే.. కోసేత్తే కోసెయ్యే.. పర్లేదే ఇటు రాయే ఓ ఎమ్మెల్యే.. నా ఎమ్మెల్యే /
ఎమ్మెల్యే అంటే నువు అనుకున్నది ఏం కాదే / ఎమ్మెల్యే అంటే అరె ఇంకో మీనింగ్‌ ఉందే / ఎమ్‌ అంటే మై మై మై.. ఎల్‌ అంటే లవ్‌లీ లవ్‌లీ లవ్‌లీ.. ఏ అంటే ఏంజల్‌ ఏంజల్‌ ఏంజల్‌.. యూ ఆర్‌ మై ఎమ్మెల్యే (3) / మై లవ్‌లీ ఏంజల్‌ / మై లక్కీ యాపిల్‌ / 

ఓ యే.. ఓసినీ ఓరచూపు గుచ్చినావే....  
చిత్రం : సరైనోడు 
సంగీతం : థమన్‌.ఎస్‌. 
గానం : ధనుంజయ్‌ 
సాహిత్యం :  అనంత శ్రీరామ్‌ 
ఏం సక్కగుందే షేపు.. ఏం సక్కగుందె సూపు.. ఏం సక్కగుందె ఊపు.. నచ్చినాదే నాకు నీ వాపు/ జనంలో నువ్వు టాపు / నీ కంటే నేను తోపు / తగ్గించమాకే హైపు / తగ్గితే వెయ్యలేనె ట్రాపు / ఏ.. టెక్కు నీకు ఉంటే.. ట్రిక్కు నాకు ఉందే.. తిక్క తీర్సుకుందామే / బెట్టు నీకు ఉంటే.. పట్టు నాకు ఉందే.. తెలుసుకోవే ఎమ్మెల్యే../ 
ఎమ్‌ అంటే మై మై మై.. ఎల్‌ అంటే లవ్‌లీ లవ్‌లీ లవ్‌లీ.. ఏ అంటే ఏంజల్‌ ఏంజల్‌ ఏంజల్‌.. యూ ఆర్‌ మై ఎమ్మెల్యే (3) / మై లవ్‌లీ ఏంజల్‌ / మై లక్కీ యాపిల్‌ / 

ఒక లైఫ్‌...
చిత్రం : ఊపిరి
సంగీతం : గోపీ సుందర్‌
గానం : కార్తీక్‌
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
ఒక లైఫ్‌.. ఒకటంటే ఒకటే లైఫ్‌ (2) / ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే / ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే /  ఒక లైఫ్‌.. ఒకటంటే ఒకటే లైఫ్‌ (2) / ఏ ఏం లేదని.. మనం చూడాలిగానీ.. ఊపిరి లేదా.. ఊహల్లేవా.. నీకోసం.. నువ్వే లేవా / చీకటికి రంగులువేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా.. ఒంటరిగ లైఫ్‌ ఉంది.. ఆశకు కూడా ఆశని కలిగించాయి / ఆయువు అనేది ఉండేవరకూ.. ఇంకేదో లేదని అనకు / ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ.. కొత్తదే నీకు / ఒక లైఫ్‌.. ఒకటంటే ఒకటే లైఫ్‌ (2) / ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే / ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే /  

నువ్వంటే నా నవ్వు.. 
నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు.. నువ్వంటు.. నేనంటు లేమని / అవునంటూ మాటివ్వు నిజమంటూనే నువ్వు.. నే రాని దూరాలు నువు పోనని.. / ఎటు ఉన్నా నీ నడక.. వస్తాగా నీ వెనక.. దగ్గరగా రానీను దూరమే / నే వేసే ప్రతి అడుగు.. ఎక్కడికో నువ్వడుగు.. నిలిచున్న నీ వైపే చేరేనులే / నీ అడుగేమో పడి నేల గుడి అయినదే.. నీ చూపేమో సడిలేని ఉరుమయినదే / నువ్వు ఆకాశం.. నేను నీకోసం / తడిసిపోదామ ఈ వానలో..ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే.. సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే.. నీడల్లో నలుపల్లే.. మల్లెల్లో తెలుపల్లే.. ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ / (2)
నే ఇటు వస్తాననుకోలేదా.. తలుపస్సలు తియ్యవు తడితే / పో పసివాడని జాలే పడితే.. బుగ్గన ముద్దిచ్చి చంపేశావే / నువ్వు నేనంటూ పలికే పదముల్లో.. అధరాలు తగిలేనా కలిసే ఉన్నా / మనమంటూ పాడు.. పెదవుల్లో చూడు.. క్షణమైన విడిపోవులే / ఇది ఓ వేదం.. పద ఋజువవుదాం.. అంతులేని ప్రేమకే మనం / నివురు తొలిగేలా.. నిజము గెలిచేలా.. మౌనమే మాట మార్చేసెనా.. నువ్‌ నవ్వేటి కోపానివే.. మనసతికిన ఓ రాయివే / నువ్‌ కలిసొచ్చే శాపానివే.. నీరల్లే మారేటి రూపానివే / నచ్చే దారుల్లో.. నడిచే నదులైనా.. కాదన్నా కలవాలి సంద్రంలోన / విడివిడిగా ఉన్నా.. విడిపోలేకున్నా.. ప్రవహించే ప్రణయం ఇదే / వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు.. నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ / నాలోనే నువ్వుంటూ.. నీతోనే నేనంటూ.. ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ / 

క్రేజీ క్రేజీ ఫీలింగ్‌.. 
చిత్రం : నేను శైలజ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : పృథ్వీ చంద్ర
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
కాంపౌండ్‌ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే.. చైనా వాలెక్కి మూను తాకినట్టుందే / మార్నింగ్‌ లేవగానే నీ మెసేజి చూస్తుంటే.. మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కి సెల్ఫీ దిగినట్టుందే / ఇట్స్‌ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్‌.. (4) 
రోడ్‌ సైడ్‌ నీతోటి పానీపూరీ తింటుంటే.. ప్లేటుకి కోటైనా చీప్‌ అనిపిస్తోందే / నీ షర్ట్‌ బాగుందని ఓ మాటే నువ్వంటే.. కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తోందే / ఇట్స్‌ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్‌.. (4) 
నిన్న మొన్న దాకా సూపరున్న ఫిగరే.. నిన్ను చూసినాక సోసోగుందే / రోజు నన్ను మోసే.. నా బ్యాచిలర్‌ బైకే.. నువ్వు ఎక్కినాక ఐ యామ్‌ హ్యాపీ అందే / రాంగు రూటు అంటూ కేసు రాసే ఎస్సై.. పేరు చెప్పమంటే గంటట్టిందే / నిన్ను నాతో చూసి బాయ్స్‌లోన జెలసీ పెరుగుతుంటే ఆస్కార్‌ విన్నయినట్టుందే / సారీ హరి నో అన్న అమ్మాయిలందర్నీ.. వీకెండ్‌ పార్టీకి పిలవాలని ఉందే / ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ని ఐమాక్స్‌లో వాళ్లకు షో వెయ్యాలని ఉందే / క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్‌.. బేబీ నీకు నాకు మధ్య లవ్వు డీలింగ్‌ (2) 

లవ్‌ చెయ్యాలా వద్దా... 
చిత్రం : కుమారి 21 ఎఫ్‌ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : నరేంద్ర 
సాహిత్యం : రామాంజనేయులు 
హే.. బారుకెళ్తుంది.. బీరు కొడ్తుంది.. పబ్బుకెళ్తుంది.. డ్యాన్సు చేస్తుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (3) / షార్టులేస్తుంది.. హాటుగుంటుంది.. దమ్ము కొడ్తుంది.. చూయింగమ్ము వేస్తుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) / హే వాట్సాప్‌లో ఎయిట్‌ ఓ క్లాక్‌కి గుడ్‌ నైట్‌ అంది.. కానీ లాస్ట్‌ సీను టుడే ట్వెల్వ్‌ థర్టీ ఉంది / సాటర్డే నైటు పార్టీకి రమ్మంది.. ప్రతి ఒక్కడికీ హాయ్‌ చెప్పి హగ్‌ ఇస్తుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) / 
యో బాయ్‌ టెల్‌ మీ.. లవ్‌ చెయ్యాలా వద్దా / ఎవ్రీ బడీ సే నవ్‌.. లవ్‌ చెయ్యాలా వద్దా / కమాన్‌ కమాన్‌ కమాన్‌ పుట్‌ యువర్‌ హ్యాండ్స్‌ అప్‌.. లవ్‌ చెయ్యాలా వద్దా / షేక్‌ ఇట్‌ షేక్‌ ఇట్‌ షేక్‌ నవ్‌.. లవ్‌ చెయ్యాలా వద్దా / హే.. లాంగ్‌ డ్రైవ్‌ అంటే లైక్‌ అంటుంది.. ఎవడి బైకైనా మగాడిలా కూర్చుంటుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) / మిడ్‌నైటు దాటాక ఇంటికొస్తుంది.. డ్రాప్‌ చేసిందెవడంటే ఫ్రెండంటుంది లవ్‌ చెయ్యాలా వద్దా (4) / ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌లిస్ట్‌ ఫైవ్‌ కే ఉంది.. ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయి లేకుంది / గంటకొక్క సెల్ఫీ అప్‌లోడు చేస్తుంది / కామెంటు పెట్టిన ప్రతోడికీ స్మైలే ఇస్తుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) / ఫ్రీడమ్‌ అంటుంది.. ఫ్రీగా ఉంటుంది / ఫోనేమో ఆల్వేస్‌ బిజీగా ఉంటుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) / గుండెల్లో నేనే ఉన్నానంటుంది.. కానీ ఎఫ్‌బీలో ప్రొఫైల్‌ పిక్కు బన్నీదుంటుంది / లవ్‌ చెయ్యాలా వద్దా (4) /

ఇటు ఇటు ఇటు అని...
చిత్రం : కంచె
సంగీతం : చిరంతన్‌ భట్‌ 
గానం : అభయ్‌ జోద్‌పూర్‌కర్, శ్రేయా ఘోషల్‌ 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
ఇటు ఇటు ఇటు అని చిటికెలుఎవ్వరివో.. ఏమో / అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో / సడే లేని అలజడి ఏదో.. ఎలా మదికి వినిపించిందో / స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో......ఒక్కొక్క రోజును ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక / చిరాకు పడి ఎటు పరారైందో సమయం కనబడక / ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్లిపోదా / తనోటి ఉందని మనం ఎలాగు గమనించం గనక / కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా / మన దరికెవరు వస్తారు కదిలించగ / ఉషస్సు ఎలా ఉదయిస్తుందో.. నిశీధి ఎలా ఎటు పోతుందో / నిదుర ఎపుడు నిదురవుతుందో / మొదలు ఎపుడు మొదలవుతుందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో......పెదాల మీదుగా అదేమి గల గల పదాల మాదిరిగ.. సుధల్ని చిలికిన సుమాల చినుకులా అనేంత మాధురిగ / ఇలాంటి వేళకి ఇలాంటి ఊసులె ప్రపంచ భాష కదా.. ఫలానా అర్థం అనేది తెలిపే నిఘంటువు ఉండదుగా / కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ / వినబోతున్న సన్నాయి మేళాలుగ / సడే లేని అలజడి ఏదో.. ఎలా మదికి వినిపించిందో / స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో......

పచ్చ బొట్టేసిన.. 
చిత్రం : బాహుబలి 
సంగీతం : ఎమ్‌.ఎమ్‌. కీరవాణి 
గానం : కార్తీక్, దామిని 
సాహిత్యం :  అనంత శ్రీరామ్‌ 
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.. పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా / జంట కట్టేసిన తుంటరోడా నీతో.. కొంటె తంటాలనే తెచ్చుకుంటాను రా / వెయ్యి జన్మాల ఆరాటమై.. వేచి ఉన్నానే నీ ముందర / చెయ్యి నీ చేతిలో చేరగా / రెక్క విప్పిందే నా తొందర / పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.......మాయగా నీ సోయగాలాలు వేసి.. నన్నిలా లాగింది నువ్వే అలా / కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేల.. హత్తుకుపో నను ఊపిరి ఆగేలా / బాహు బంధాల పొత్తిళ్లలో.. విచ్చుకున్నావే ఓ మల్లిక / కోడె కౌగిళ్ల పొత్తిళ్లలో.. పురివిప్పింది నా కోరిక / పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.......

పూలనే కునుకెయ్యమంటా.. 
చిత్రం : ఐ 
సంగీతం : ఎ.ఆర్‌. రెహమాన్‌ 
గానం : హరిచరణ్, శ్రేయాఘోషల్‌ 
సాహిత్యం : అనంత శ్రీరామ్‌ 
పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా (2) / హేయ్‌.. ఐ అంటే మరి నేనను అర్థము తెలుసోయ్‌ నిన్నా మొన్న / అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా / అయ్యో నాకెదురై ఐరావతమే నేలకు పంపిన తెలికలువై తనువిచ్చెనంటా.. తను వచ్చెనంటా / పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా / 
అసలిపుడు నీకన్నా ఘనుడు లోకాన కనబడునా మనిషై / అది జరగదని ఇలా అడుగు వేసినా  నిను వలచిన మనసై / ప్రతిక్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ / ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువు తీయటి ఈ నిజమై / నా చేతిని వీడని గీత నువై / నా గొంతుని వేరని పేరు నువై / తడి పెదవుల తలుకవనా.. నవ్వునవ్వనా.. ఎంత మధురం/ పూలనే కునుకెయ్యమంటా........
నీరల్లె జారేవాడే నాకోసం ఒక ఓడయ్యాడా / నీడంటు చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా / నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా / నా రాతి గుండెను తాకుతు శిల్పం లాగా మార్చేసిందా / యుగములకైనా మగనిగ వీణ్నే పొగడాలి అంటూ ఉంది నాలో మనసివ్వాలే / ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనము చూసేలాగా వరమేదైనా కావాలె /  పూలనే కునుకెయ్యమంటా........ 

శ్రీమంతుడా... 
చిత్రం: శ్రీమంతుడు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ గానం: యంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
ఓ నిండు భూమి నిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా / పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా / గుండె దాటుకొని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా / రుణం తీర్చే తరుణమిదిరా కిరణమై పదపదరాఓ ఏమి వదిలి ఎటు కదులుతోంది మది మాటకైన మరి తలచినదా / మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా / మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వే నీకు తొలి గెలుపు కదా / మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరాలోకం చీకట్లు చీల్చే ధ్వేయం నీ ఇంధనం / ప్రేమై వర్షించని నీ ప్రాణం / సాయం సమాజమే నీ ధ్వేయం నిరంతం / కోరే ప్రపంచ సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం / విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా / ఎదురు చూసే ఎదను మీటే పవనమై పద పదరాలేనిదేదో పనిలేనిదేదో విడమరిచి చూడగల రుషిగుణమా / చిగురు మొలిసే చినుకు తడిగ పయనమై పద పదరా / పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా / నీలో లక్ష్యానికి జై హో / పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా / నీలో స్వప్నాలు అన్నీ సాకరమవ్వగా  జై హో / 

గోపికమ్మా చాలునులేమ్మా...
చిత్రం: ముకుందా 
సంగీతం: మిక్కీ జే మేయర్‌ 
గానం: చిత్ర
సాహిత్యం:  సిరివెన్నెల  
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా / గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా / విరిసిన పూమాలగా.. వెన్నుని ఎదవాలగా.. తలపుని లేపాలిగా బాలా / పరదాలే తీయకా.. పరుపే దిగనీయకా.. పవళింపా ఇంతగా మేలా / కడవల్లో కవ్వాలు.. సడి చేస్తున్నా వినకా / గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా / కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చేనమ్మా...నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ / నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి / నీ కోసమని గగనమే భువి పైకి దిగివచ్చేనని / ఆ రూపాన్ని చూపుతూ అల్లుకుపో సౌదామిని / జంకేలా జాగేలా సంకోచాలా జవ్వని / బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి పిల్లనగ్రోవై ప్రియమాల నవరాగాలే పాడనీ అంటూ.. / ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరానఏడే అల్లరి వనమాలి నను వీడే మనసును దయమాలీ / నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే...ఏడే.. / లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది / తనలో తృష్ణ తేనేలా విందిస్తానంటున్నదీ / అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది / అందరికన్నా ముందుగా తనవైపే రమ్మనదీ / విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపికా / చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక / త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారకా / వదిలావో వయ్యారీ బృందవిహారి దొరకడమ్మా....

రాకాసి రాకాసి... 
చిత్రం: రభస 
సంగీతం: థమన్‌
గానం: జూ.ఎన్టీఆర్‌
సాహిత్యం:  శ్రీమణి
రాకాసి రాకాసి.. నను రబ్బరు బంతిల ఎగరేసి.. పారేసి పారేసి.. నువు వెళ్లకే నవ్వులు విసిరేసి / రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి../అచ్చ తెలుగు ఆడపిల్లలా.. కొత్తకొత్త ఆవకాయలా.. /జున్ను ముక్క మాటతోటి ఉక్కులాంటి పిల్లగాడిని తిప్పమాకు కుక్కపిల్లలా... అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్తకొత్త ఆవకాయలా../నువ్వులేని జీవితం రంగులేని నాటకం  సప్పగున్న ఉప్పులేని చాపకూర వంటకం.../నువ్వులేని జీవితం బైకులేని యెవ్వనం..గర్ల్స్‌లేని పబ్బులోన క్లబ్‌ డ్యాన్స్‌ చేయడం../ గుండె బద్ధలవ్వడం అప్పడం విరిగడంలా.../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా ఎగరేసి...పారేసి పారేసి నువు వెళ్లకే నవ్వులు విసిరేసి../హే ప్రేమలేఖ రాసుకున్న ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్లు దారిలోన వాలుపోస్టరేసుకున్నా.../ సూసైడ్‌ లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనేడే తాగి నీ అవసరాన్ని తెలుసుకున్న../మిలమిల నీకై ఇలా ఎంతెంత వేచినానే వేయి కనుల ఇలా ఇలా ఎన్నాళ్లైనా..ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా../ నువ్వులేని జీవితం..క్లీనుబౌల్డ్‌ కావడం..సెంచరీకి ఒక్క రన్‌ ముందు ఔటు అవ్వడం.../నువ్వులేని జీవితం..డస్ట్‌బిన్‌ వాలకం..టేస్టుగున్న కోక్‌టిన్‌ కాలులేపి తన్నడం ఫూట్‌బాల్‌ తన్నడం  గట్టిగా తుమ్మడంలా.../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి.. పారేసి పారేసి నువు వెళ్లకే నవ్వులు విసిరేసి../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా.../హే గోల్డు నెవ్వడు చేయలేడే ఏ బ్రహ్మదేవుడైనా గాని నిన్ను మించి అందెగత్తెనెప్పుడైనా చెక్కలేదే.../రోల్డ్‌గోల్డ్‌ నేపేరే ఫైవ్‌ ఫీట్‌ తెల్లకాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటె ఎవడడగడే../మిలమిల నీతో ఇలా జన్మంతా ఉండిపోనీ నీకు జంటలా..నా కలే నిజం అయ్యేంతలా ఉన్నా చోట కాలమాగిపోనీ ఇలా.../నువ్వులేని జీవితం రాశిలేని జీవితం పేలబోయే మందుగుండు మీద కాలు పెట్టడం../ నువ్వులేని జీవితం ఒళ్లు మండిపోవడం... ఎండమావి బావిలోన నీళ్లు తోడుకోవడం../ఎండదెబ్బ తగలడం కాకిలా రాలడంలా../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి..పారేసి పారేసి నువ్వు వెళ్లకే నవ్వులు విసిరేసి../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా...

ఏం సందేహం లేదు... 
చిత్రం: ఊహలు గుసగుసలాడే 
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 
గానం: కళ్యాణ్‌ కోడూరి, సునీత 
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
ఏం సందేహం లేదు / ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది / ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది / ఏం సందేహాం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది / నిమిషము నేల మీద నిలపని కాలిలాగ / మది నిను చేరుతోందో చిలకా / తనకొక తోడులాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా /వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది.. నిన్నే ఊహిస్తుంటే / ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే / నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే / నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు మది నిను చేరుతోంది చిలకా / తనకొక తోడులాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా...నీ కొమ్మల్లో గువ్వ / ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా / నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా / ఏమౌతున్నాగాని ఏమైనా అయిపోనీ ఏం ఫరలేదన్నావా 
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనకా / అడిగిన దానికింక బదులిక పంపుతోంది / పదములు లేని మౌన లేఖా...

టాపు లేచిపోద్ది 
చిత్రం : ఇద్దరమ్మాయిలతో సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : సాగర్, గీతా మాధురి 
సాహిత్యం : భాస్కరభట్ల
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతదీ? మంచి బీటొస్తది.. పిచ్చ పాటొస్తది.. హొయ్‌ / అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతదీ? మస్త్‌ మాసొస్తది.. బెస్టు ఊపొస్తది.. హోయ్‌ / రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే / టాపు లేచిపోద్దె పో పో (2) / రారో రారో నా శివకాశి.. అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే /  టాపు లేచిపోద్దె పో పో (2) / చెట్టుమీద మ్యాంగోలా.. నువ్వెంత సక్కగున్నావే.. హే చాకు లాంటి పిల్లాడే.. ఎంత షార్పుగున్నాడే / చాకొచ్చి మ్యాంగో కోస్తే / టాపు లేచిపోద్ది కన్నే కొట్టావంటే.. టాపు లేచిపోద్ది ముద్దే పెట్టావంటే.. టాపు లేచిపోద్ది చెయ్యే పట్టావంటే / టాపు టాపు టాపు లేచిపోద్దిరో / అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతదీ? మంచి బీటొస్తది.. పిచ్చ పాటొస్తది..సమ్మర్‌లోన లస్సీలా.. వింటర్‌లోన కాఫీలా / ఊరిస్తున్నావే.. పట్టీ లాగేస్తున్నావే.. పిల్లా పొంగే పూరీలా / రాము భీము తమ్ముడిలా.. జాకీచాను అల్లుడిలా / ముద్దొస్తున్నావే.. వచ్చి గుద్దేస్తున్నావే / అమ్మో బ్రేకుల్లేని లారీలా / రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి.....కో కో కోతికేమో కొబ్బరిలా.. పిల్లాడికి బర్గర్‌లా నచ్చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే.. అరే కొత్త ఫిల్మ్‌ ట్రైలర్‌లా / పోలీసుకి రౌడీలా.. ఆడోళ్లకి కేడీలా / బుక్కైపోయావే నాకు సెట్టయిపోయావే సోడాబుడ్డిలోని గోళీలా / రాయే రాయే నా రాకాసి..... 

కనిపెంచిన  మా అమ్మకే..
చిత్రం: మనం
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
గానం: భరత్‌
సాహిత్యం:  చంద్రబోస్‌
కనిపెంచిన మా అమ్మకే, అమ్మయ్యానుగా/ నడిపించినా మా నాన్నకే, నాన్నయ్యానుగాఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు/ ఒకరిది మాటా, ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ...హా.. అ../ అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా / అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా / కన్నోళ్లతో నేను చిన్నోడిలా, కలగలిసిన ఎగసిన బిగిసిన కథఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ...  కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా / కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా.. /జోలలు నాకే పాడారుగ, ఆ జాలిని మరచి పోలేనుగ / మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా... / ఇది ప్రేమా ప్రేమా.. / ఎదురొచ్చె హాయిగా... / ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ..

కళ్లు కళ్లు ప్లస్సు.. 
చిత్రం: 100% లవ్‌
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: అద్నాన్‌ సమీ
సాహిత్యం: చంద్రబోస్‌
కళ్లు కళ్లు ప్లస్సు వాళ్లు వీళ్లు మైనస్‌...ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్‌/ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌../ఎడమ భుజము కుడి భుజము కలిసి..ఇక కుదిరే కొత్త త్రిభుజం/పడుచుచదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం../సరళ రేఖలిక  మెలిక తిరిగి.... పెనవేసుకున్న చిత్రం/చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం.../కళ్లు కళ్లు ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్‌.. ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్‌/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు... ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌... ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌... ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌/దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట.. కోరికలకు కొలమానం ఈ...జంట.../ సెంటిగ్రేడు సరిపోదంట.. ఫారిన్‌ హీట్‌ పని చెయదంట..వయసు వేడి కొలవాలంటే తంట.../లేతలేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణా... అర్థం కాదు ఏ సైన్స్‌కైనా.../పైకి విసిరినది కింద పడును అని... తెలిపె గ్రావిటేషన్‌... పైన కింద తలకిందులవుతది ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌.../ సౌత్‌ పోల్‌ అబ్బాయంట..నార్త్‌ పోల్‌ అమ్మాయంట.. రెండు జంట కట్టే తీరాలంట../ధనావేశం అబ్బాయంట.. రుణావేశం అమ్మాయంట..కలిస్తే కరెంటే పుట్టేనంట../ ప్రతీ స్పర్శ ప్రశ్నేనంటా.. మరో స్పర్శ జవాబంట.. ప్రాయానికే పరీక్షలంట../పుస్తకాల పురుగులు రెండంట..ఈడు కొచ్చెనంట.. అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట../కళ్లు కళ్లు ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్‌.. ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్‌../ ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌..

సినిమా చూపిస్త మావా.. 
చిత్రం:  రేసుగుర్రం 
సంగీతం: థమన్‌
సాహిత్యం: సింహ, దివ్య, గంగ
రచన: వరికుప్పల యాదగిరి
మామా నువ్వు గిట్ల గాబరా గీబరా... తత్తర.. దిత్తరా.. షక్కరా..గిక్కరా..వచ్చి పడిపోతే..నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగినా యాడ దొరకడే../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా/ సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../ గల్లవట్టి గుంజుతాంది దీని సూపే...లొల్లివెట్టి సంపుతాంది దీని నవ్వే..కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే..డప్పుకొట్టి పిలవవట్టే ఈని తీరే..నిప్పులెక్క కాల్చవట్టే ఈని పోరే.. కొప్పు గూడా గొట్టవట్టే ఈని జోరే.../మామా దీని సూడకుంటే..మన్నుదిన్న పాములెక్క..మనసు పండవట్టే.../అయ్యయ్యయో సూడగానే పొయ్యి మీద పాలలెక్క వీని మనసు పొంగవట్టే.../దీని బుంగమూతి సూత్తే నాకు బొంగుతిన్న కోతిలెక్క సిందులేయ బుద్ధివుట్టే.../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా.. సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../గల్లవట్టి గుంజుతాంది దీని సూపే...లొల్లివెట్టి సంపుతాంది దీని నవ్వే..కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే../మామా నీ బిడ్డ వచ్చి తగిలినక్కనే లవ్వు దర్వాజా నాకు తెర్సుకున్నదే../ఓ రయ్యా ఈ పోరగాడు నచ్చినంకనే నన్నీ బద్మాష్‌ బుద్ధి సుట్టుకున్నదే../ పట్టు వట్టేసెనే కుట్టేసెనే..సుత్తూత బొంగరాల్లా తిరగవట్టెనే.../సిటారు కొమ్మ మీద కూకవెట్టెనే..మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే.. సందులెల్ల దొంగలెక్క తిప్పవట్టెనే...దీని బుంగమూతి సూత్తే నాకు బొంగు తిన్న కోతిలెక్క సిందులేయ బుద్ధివుట్టే.../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../ ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ పటానా..మామా నీకు ముందు ఉందే పుంగి భజానా..

నువ్వంటే నాకు... 
చిత్రం : హార్ట్‌ ఎటాక్‌
గానం : జెస్సీ గిఫ్ట్‌
సంగీతం : అనూప్‌ రూబెన్స్‌
సాహిత్యం : భాస్కరభట్ల 
నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే... అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే / నే నచ్చితే ఇవ్వొచ్చుగా.. లేదంటే మానొచ్చుగా.. అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా.../నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే... అది మాటల్లోన చెప్పలేక, ముద్దడిగానే.. ముద్దడిగానే.../హెయ్‌.. చిరాగ్గా ఉంటున్నాదంటే.. పరాగ్గా అనిపిస్తూందంటే... సరిగ్గా తగలాల్సింది లిప్‌ టు లిప్‌ కిస్సే.../మనస్సే తడబడిపోతుంటే.. వయస్సే వెలవెలబోతుంటే.. తెలుస్సా కావలసింది మసాలా కిస్సే.../సింగిల్‌ గుంటే ఎట్టుంటాదే.. ఎంగిల్‌ పడితే బాగుంటాదే.. అర్థం అయినా కానట్టుగా ఎల్‌. కె. జి. ఫేస్‌ పెడతావా../నువ్వంటే.../ఓ.. పెదాల్లో యంత్రం ఉంటాదే.. అదేదో ఆత్రం ఉంటాదే... ఎన్నెన్నో ముద్దులనైనా అచ్చే వేస్తాదే... ఇదేదో బానే ఉందంటూ.. ఆమాంతం నీకు అనిపిస్తే... ఓసారి ప్రాక్టీస్‌ చెసెయ్‌ అలవాటయిపోద్దే../సిమ్మేలేని సెల్లెందుకే... చుమ్మాలేని జన్మెందుకే... నీ మంచికే చెబుతున్నానే..  జస్ట్‌ ఫర్‌ టేస్ట్‌మీ టేస్ట్‌మీ తొందరగా../నువ్వంటే...

ఆరడుగుల బుల్లెట్టు... 
చిత్రం: అత్తారింటికి దారేది  
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
గానం: యం.ఎల్‌.ఆర్‌ కార్తికేయన్, విజయ్‌ప్రకాష్‌
సాహిత్యం: శ్రీమణి 
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం.. తరలింది తనకు తానే ఆకాశం... పరదేశం / శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం.. విడిచింది చూడు నగమే.. తన వాసం.. వనవాసం....భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో / ఉక్కుతీగ లాంటి ఒంటి నైజం / వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం / రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో / శత్రువంటి లేని వింత యుద్ధం... ఎన్ని గుండెల్లోతు గాయమయిన సిద్ధం / నడిచొచ్చే నర్తనశౌరీ / పరుగెత్తే పరాక్రమ శైలి / హలాహలం ధరించిన దత్తహృదయుడో / వీడు ఆరడుగుల బుల్లెట్టు... వీడు ధైర్యం విసిరిన రాకెట్టు..
దివి నుంచి భువిపైకి.. భగభగమని కురిసేటి / వినిపించని కిరణం చప్పుడు వీడు / వడి వడిగా వడగళ్లై.. దడదడమని జారేటి.. కనిపించని జడివానేగా వీడు / శంఖంలో తాగేటి, పోటెత్తిన సంద్రం హోరితడు / శోకాన్నే తాగేసే అశోకుడు వీడురో....తన మొదలే వదులుకొని.. పైకెదిగిన కొమ్మలకి.. చిగురించిన చోటుని చూపిస్తాడు / తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి.. తన తూరుపు పరిచయమే చేస్తాడు / రావణుడో రాఘవుడో మనసుని దోచే మానవుడో / సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో....

పండగలా దిగివచ్చావు
చిత్రం: మిర్చి 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: కైలాష్‌ ఖేర్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి  
పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు.. రక్తాన్నే ఎరుపెక్కించావు / మా తోడుకు తోడయ్యావు.. మా నీడకు నీడయ్యావు.. మా అయ్యకు అండై నిలిచావు / అయ్యంటే ఆనందం.. అయ్యంటే సంతోషం.. మా అయ్యకు అయ్యన్నీ నువ్వు / కలిసొచ్చిన ఈ కాలం.. వరమిచ్చిన ఉల్లాసం.. ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు....ఓ... జోలాలి అనలేదే చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా / ఓ... నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాల / మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా / ఓ... మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా / గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా / వేరు మూలము వెదికి మా జత చేరినావు ఇలా...ఓ... పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో  కన్నీళ్లు ఇన్నాళ్లు ఇన్నేళ్లు / ఓ... అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీ తిరునాళ్లు / ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు / మా పుణ్యం పండేలా ఈ పైనా మేమంతా మీ వాళ్లు ఐనోళ్లు / అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు / ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు....

ఉయ్యాలైనా జంపాలైనా
చిత్రం: ఉయ్యాలా జంపాలా 
సంగీతం: సన్నీ ఎంఆర్‌ 
గానం: అనుదీప్, హర్షిక 
సాహిత్యం: వాసు వలబోజు 
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ / మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని / ఇదో రకం స్వయంవరం అనేట్టుగా ఇలా / నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా / హరివిల్లు దారాలా బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగలిలా / ఓహో...నీవేగా నాలో నా గుండెలో శ్రుతి లయ / ఓహో...నీవేగా నాకు నా ఊహలో çసఖీప్రియా /చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లో ఉంది / చందమామ నీలా మారి నా పక్కనుంది / నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా / గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా / ఒక్కో క్షణం పోతే పోనీ   పోయేదేముంది / కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది / రేపంటు మాపంటు లేనే లేని లోకములో ఇద్దరినే ఊహించని / ఎటువైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలాఎదురైతే రాలేను ఎటు వైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా / ఓహో...నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా / ఓహో...వనవాసమైన నీ జంటలో సుఖం కదా...నా పాదమే పదే పదే నీ వైపుకే పడే / జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే / ఓహో...ఎన్నాళ్లుగానో నా కళ్లలో కనే కల / ఓహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయాగుండెకే చిల్లు పడేలా జింకలా నువ్వే గెంతాలా / ఇద్దరం చెరో సగం సగం సగం సగం / ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా / నువ్వు నా చెంత చేరి చేయి నిజం కొంచెం...

ఆరడుగులుంటాడా.. 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  
సంగీతం: మిక్కీ జె మేయర్‌  
గానం: కళ్యాణి 
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా.. ఏమడిగినా ఇచ్చే వాడా / ఆశ పెడుతుంటాడా.. ఆట పడుతుంటాడా.. అందరికి నచ్చేసేవాడా / సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే.. బెరుగ్గా బెరుగ్గా అయిపోకే / బదులేది ఇవ్వకుండా వెళ్లిపోకేఅడిగిన సమయంలో తను అలవోకగా నన్ను మోయాలి / సొగసును పొగడడమే తనకలవాటైపోవాలి / పనులని పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి / అలకని తెలుసుకొని అందంగా బ్రతిమాలాలి / కోరికేదైనాగానీ తీర్చి తీరాలని / అతన్ని అతన్ని అతన్ని చూడడానికి / వయస్సే తపిస్తు ఉంటుందే / అప్పుడింక వాడు నన్ను చేరుతాడే.....

బంతిపూల జానకి...
చిత్రం : బాద్‌షా
గానం : దలేర్‌మెహందీ, రైనా రెడ్డి
సంగీతం : థమన్‌ ఎస్‌
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
కొట్టిన తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రోయ్‌.../రాం జై.. రాం జై.. రాం జై..రాం జై.. రాం జై.. రాం జై../హే బంతిపూల జానకి జానకి, నీకంత సిగ్గు దేనికి దేనికి.. ఛలో ఛలో నాతో వచ్చెయ్‌ అత్తారింటికి/రాం జై.. రాం జై../హే బంతిపూల/హే... ఆకు వక్కా సున్నముంది నొరుపండటానికి, హే.. ఆడ ఈడు ముందరుంది నీకు చెందడానికి/హే, ఉట్టె మీద తేనెపట్టు నోటిలోకి జారినట్టు సోకులన్ని పిండుకుంటానే.../కొట్టినా తిట్టినా/చాపకింద నీరులాగ చల్లగ.. చల్లగా,చెంతకొచ్చినావు చెంప గిల్లగ గిల్లగా../చేప ముల్లు గుచ్చినావే మెల్లగా.. పాతికెళ్ల గుండె పొంగి పొర్లగా పొర్లగా../చూపులో ఫిరంగి గుళ్ల జల్లుగా.. సిగ్గులన్ని పేల్చినావు ఫుల్‌గా ఫుల్‌గా../సంకురాత్రి కోడి సుర్రకత్తె కట్టి, దూకు దూకు దూకుతాదే కారంగ/షంక్‌ మర్కు లుంగి పైకి ఎత్తి కట్టి,ఎత్తుకెళ్లిపోరా నన్ను ఏకంగ/హే ఆనకట్టు తేల్చినట్టు దూసుకొస్తా మీదికి, ఆ మందుగుండు పెట్టినట్టు మాయదారి గుట్టు మొత్తం నిన్ను చూసి ఫట్టుమందిరో../ఆ.. అంతలేసి తొందరేంది పిల్లడా.. పిల్లడా.. అందమంతా పట్టినావు జల్లెడా.. జల్లెడా../అందుబాటులోని పాల మీగడ... ఆకలేస్తే నంజుకోనా అక్కడా అక్కడా/మేకు లాంటి పిల్లగాడ్ని ఎక్కడా చూడలేదె కంచిపట్టు పావడ.. పావడ../చెక్కు రాసినట్టూ.. లెక్క తీరినట్టూ హక్కులన్ని ఇచ్చుకోవే మందారం/నీకు ముళ్ల పట్టు తొక్క తీసినట్టు మూతి ముద్దులిచ్చుకోరా బంగారం/హే.. అగ్గిపెట్టి చెప్పమాకే కుర్రకళ్ల కుంపటి,హే.. మత్తులోన లవ్వు లారి స్పీడుగా వచ్చి గుద్దినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటాలే.../కొట్టినా..

ఆటగదరా శివ... 
చిత్రం: మిథునం 
సంగీతం: స్వరవీణాపాణి 
గానం: యేసుదాస్‌ 
సాహిత్యం: తనికెళ్ల భరణి
ఆటగదరా శివ.. ఆటగద కేశవ.. (2) / ఆటగదరా నీకు అమ్మ తోడు / ఆటగదరా శివ.. ఆటగద కేశవ / ఆటగద జననాలు.. ఆటగద మరణాలు.. మధ్యలో ప్రణయాలు ఆటగద నీకు / ఆటగద సొంతాలు.. ఆటగద పంతాలు.. ఆటగద సొంతాలు... ఆటగద పంతాలు.. ఆటగద అంతాలు ఆట నీకు.. ఆటగదరా శివ..
ఆటగదరా నలుపు.. ఆటగదరా తెలుపు.. నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు / ఆటగదరా మన్ను.. ఆటగదరా మిన్ను (2) / మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను / ఆటగదరా శివ.. ఆటగద కేశవ..

ఏం మంత్రమో.. 
చిత్రం: అందాల రాక్షసి 
సంగీతం: రాధన్‌ 
సాహిత్యం: వశిష్ఠశర్మ  
గానం: బోబో శశి
ఏం మంత్రమో.. అల్లేసిందిలా.. ఎదకే వేసే సంకెలా / భూమెందుకో వణికిందే ఇలా.. బహుశా తనలో తపనకా / ఆకాశం రూపం మారిందా.. నాకోసం వానై జారిందా.. గుండెల్లో ప్రేమై చేరిందా.. ఆ ప్రేమే నిన్నే కోరిందా / మబ్బుల్లో ఎండమావే.. ఎండంతా వెన్నెలాయే.. మనసంతా మాయమాయే.. అయినా హాయే /క్షణము ఒక రుతువుగా మారే.. ఉరుము ప్రతి నరమును తరిమే / పరుగులిక వరదలే పోయే కొత్తగా / ఉన్నట్లు ఉండి అడుగులు ఎగిరే / పగలు వల విసిరె ఊహలే / మనసు మతి చెదరగా శిలగా నిలిచెగా /కళ్లలో కదిలిందా కలగా కరిగిపోకలా / ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోకలా / ఓ మాయలా  ఇంకో మాయలా.. నన్నంత మార్చేంతలా / ఓ మాయలా ఇంకో మాయలా.. నువ్వే నేనయ్యేంతలా / వెన్నెలాలాలా...

ఆకాశం అమ్మాౖయెతే... 
చిత్రం: గబ్బర్‌సింగ్‌ 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: శంకర్‌ మహదేవన్, గోపిక పూర్ణిమ
సాహిత్యం: చంద్రబోస్‌
ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం..ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం...ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం.../ఆకాశం అమ్మాౖయెతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే.../ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే.../వానల్లే నువ్వు జారగా నీళ్లల్లే నేను మారగా... వాగల్లే నువ్వు నేను చేరగా.. అది వరదై పొంగి సాగరం అవుతుందే../హోలా..హోలా.హోలా..హోలా...నీ కళ్లల్లో నే చిక్కానే పిల్లా../హోలా..హోలా.హోలా..హోలా..ఇక చాలాచాలా జరిగే నీ వల్లా.../ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం.. /ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం... ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం... /అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి..శత్రువంటి ప్రేయసి.. /పట్టేసి..కనికట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి..దేవతంటి రూపసి../గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే..నిద్దర పుచ్చేనే.../ఒహో లోకంలో అందాలన్నీ నీలో చేరేనే..నిద్దుర లేపేనే../హోలా..హోలా.హోలా..హోలా.. నీ కళ్లల్లోనే చిక్కానే పిల్లా../ఆనందం ఆనందం..ఆనందం అంటే అర్థం..ఈనాడే తెలిసింది కొత్త పదం../ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం...గుండెల్లో కదిలింది పూలరథం.../వచ్చేసి బతికిచ్చేసి..మసి చేసినావె రుషిలాంటి నా రుచి..మార్చినావె అభిరుచి.../సిగ్గేసి చలి ముగ్గేసి...ఉసిగొల్పినావె స..రి గమల పదనిసి..చేర్చినావె ఓ కసి../స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే..ప్రాణం పోసేనే..ఒహో నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే../హోలా..హోలా.హోలా..హోలా...నీ కళ్లల్లో నే చిక్కానే పిల్లా.. హోలా..హోలా.హోలా..హోలా..ఇక చాలాచాలా జరిగే నీ వల్లా.../ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం../ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం...ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం...

నేనే నానీనే
చిత్రం: ఈగ   
సంగీతం, సాహిత్యం: కీరవాణి 
గానం: దీపు, సాహితి 
నేనే నానినే నేనే నానినే / పోనే పోనీనే నీడై ఉన్నానే / అరె అరె అరె ఓ (2) / కళ్లకు ఒత్తులు వెలిగించి / కలలకు రెక్కలు తొడిగించి / గాలిని తేలుతు ఉంటున్నాకనబడినా ఓకే... కనుమరుగవుతున్నా ఓకే (2) / మాటలు ముత్యాలై దాచేసినా.. చిరునవ్వు కాస్తయినా వొలికించవా / కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వని / కనబడినా ఓకే... కనుమరుగవుతున్నా ఓకే (2) నా భాషలో రెండే వర్ణాలని / నాకింక నీ పేరే జపమవునని / బిందు అంటే.. గుండె ఆగి.. దిక్కులన్నీ చూడనా / కనబడినా ఓకే.. కనుమరుగవుతున్నా ఓకే (2) / అరె అరె అరె వో (2)

చిన్నదాన నీకోసం.. 
చిత్రం: ఇష్క్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
గానం: అనూప్‌ రూబెన్స్, రాజ్‌హసన్, శ్రావణి
రచన: కృష్ణచైతన్య
హో తెరెబిన్‌ జానా..కుచుబి నహీ మై..ఇష్క్‌ మే మై దీవానా / అయిలెబ్బా.. అయిలెబ్బా..అయిలె..అయిలె..అయిలె.. అయిలెబ్బా.. నన్నాన్నాన్నా అయిలెబ్బా... నన్నానాన్ననా.. తందానతననా.. /ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లదిరే...అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం..../చిన్నదాన నీకోసం..ఓ చిన్నదాన నీకోసం.../ నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం..ఏదైనా..ఏమైనా..వేచున్నా నేను చిన్నవాడా నీకోసం../చిన్నవాడా నీకోసం..మాటలన్నీ నీకోసం..మౌనం అంతా నీకోసం.../ఓ కూవనే కోయిలా ఉండదే రాయినా కొత్త పాట పాడుతా... తీయనీ హాయిలో తేలనీ గాలిలో పెళ్లిదాకా పరిచయం ఇలా../హే ఎటువైపెళ్లినా.. నే నిన్నే చేరనా...మెలిపెడుతూ ఎలా ముడిపడిపోనా...ఓ జాజి కొమ్మే నా చెలి జావళీలే పాడెనురో../ప్రేమ అంటే అంతేరో అన్ని వింతేరో../వేకువంతా నీకోసం..వెన్నెలంతా నీకోసం...ఊసులన్నీ నీకోసం..ఊపిరంతా నీకోసం../ఓ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలిక../మాటలే రావుగా మౌనవే హాయిగా భావమైతే బోలెడుందిగా.../నీ నవ్వే సూటిగా.. తెలిపిందే రాయికా...చాల్లే తికమకా అల్లుకు పోవే../హో గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చెదరదులే..అలలా అడుగున మునిగిన తీరం చేరునులే../కాదల్‌ అయిన నీకోసం..నీకోసం../ప్రేమ అయిన నీకోసం..నీకోసం../లవ్‌ యూ అయిన నీకోసం..నీకోసం.../ఇష్క్‌ అయిన నీకోసం...నీకోసం...

గురువారం మార్చి ఒకటి..
చిత్రం : దూకుడు
సంగీతం : ఎస్‌.థమన్‌
గానం : రాహుల్‌ నంబియార్‌
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గురువారం మార్చి ఒకటి, సాయంత్రం ఫైవ్‌ఫార్టీ, తొలిసారిగ చూశానే నిన్ను/చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్‌ పెట్టి/నిదరేపోనందే నా కన్ను/రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే,అనుకుంటే కనిపిస్తావు నువ్వే/మొత్తంగా నా ఫోకస్‌ నీ వైపే మారేలా ఏం మాయో చేశావే/ఓం శాంతి శాంతి అనిపించావేజర జరా సున్‌తో జర జానే జానా/దిల్‌సే తుఝ్‌కో ప్యార్‌ కియా ఏ దీవానా/నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన/సోచో జరా ప్యార్‌ సే దిల్‌కో సమ్‌ఝానా/ఐ లవ్‌ యూ బోలోనా హసీనానువ్వాడే పెర్‌ఫ్యూమ్‌ గుర్తొస్తే చాలే/మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే/నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం/నీ రూపం నన్నొదిలి పోనందే/క్లైమేట్‌ అంతా నాలాగే లవ్‌లోపడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే/నింగినేల తలకిందై కనిపించే జాదూ/ఏదో చేసేశావే/గడియారం ముల్లై తిరిగేస్తున్నానే ఏ నిమిషం...నువ్వు ఐ లవ్‌ యూ అంటావో అనుకుంటూ...క్యాలెండర్‌ కన్నా ముందే ఉన్నానే నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ డైలీ రొటీన్‌ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే/చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ/అంతో ఇంతో డీసెంట్‌ కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే/ ఓంశాంతి / ఓంశాంతిజర జర ప్రేమలోకి అడుగేస్తున్నా/చెలియలా చేరిపోనా నీలోన/ఏదేమైనా నీకు నేను సొంతం కానా/నన్నే నేను నీకు కానుకిస్తున్నా

సారొస్తారొస్తారా.. 
చిత్రం: బిజినెస్‌మేన్‌
సంగీతం: థమన్‌. ఎస్‌. 
గానం: థమన్‌ ఎస్‌., సుచిత్ర
సాహిత్యం:  భాస్కరభట్ల
సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే.. దావత్తే ఇస్తారా రత్తా రత్తారే../ఒంటిగంట కొట్టినాక ఓరినాయనో.. వేడి పుట్టె వంటిలోన ఏటి సెయ్యనో.. సారొస్తారొస్తారె సారొస్తారొస్తారె/కోరికేదో రేపుతుంటే ఏడ దాచనో.. లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనో../వాలు కళ్ళకే నచ్చినావు తెగ, లోపలేక్కడో అంటుకుంది సెగ, నీ చూపు కందిరీగ, కొరికి తినగా.. తుర్‌nు పే ఫిదా హోగా.../సారొస్తారొస్తారా.../మాతిరెమూసా సాయీఆయీఆయి.../ముద్ద బంతి, రావే రావే...ముద్ధు గుమ్మ, రావే రావే... ముస్తాబయ్యి, రావే రావే.. ముద్దులిచ్చి, పోవే పోవే.... ఏహే వస్తారే వస్తారే వస్తారే.../రామ సిలకో రాను అనకో.. మేరే దిల్‌ కో ఫరక్‌ లేదు గిల్లుకో... బెంగ తీరి పోతే అల్లుకో.. ఇది ఉడుకో లేక దుడుకో.. అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో.. సిగ్గు పానకంలో జర జర పుడకో... తేరి నజరోంకా ఏక్‌ ఇషారా, యారా.. మై ఛోడ్‌ చలూన్‌ జగ్సారా, జారా.. తేరి బాహోంకా సహారా, ఆ, మాంగో దూబారా జరా, ఎ, తాంలే ఆరా.. సారొస్తారొస్తారే... /మాతిరెమూసా మత్తిరెమొసా సాయీఆయి ఆఅయిదె మూసా సొరె మాఈ సాయీ....సారొస్తా, సారొస్తా, సారొస్తారొస్తారా...

ఎందుకో ఏమో...
చిత్రం: రంగం
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
గానం: ఆలాప్‌ రాజు
సాహిత్యం:  వనమాలి
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే..పిచ్చి పరుగులు తీసే.. వెల్లివిరిసెను వయసే/ఎందుకో ఏమో గుండె దరువులు వేసే.. కొంటె తలపులు తోచే.. పొంగి పొరలెను ఆశే/ఏదో గజిబిజిగా.. గజిబిజిగా కనిపించే రూపం/రేపో దరి కనని దరి కనని తీరం..ఏదో గజిబిజిగా గజిబిజిగా..కనిపించే రూపం/రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం/ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే...చెలి దూరమయ్యె వరసే.. రేయి కలలుగా విరిసే/ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే..చిన్ని గుండెనేదో తొలిచే.. ఒంటరిగ నను విడిచే/ఏదో గజిబిజిగా...గజిబిజిగా కనిపించే రూపం/రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం/రోజూ తడబడుతూ వెలిగే ఉదయం../నువ్వు నేను ఒక యంత్రమా...కాలం నడిపే ఓ మహిమా ప్రేమా/ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా/చెంత నువ్వు నిలబడగానే.. నిన్ను విడిచి పరిగెడుతున్నా/సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే...అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే/నవ్వుల్తో చంపే మాయే చాల్లే...ఏమో తుళ్ళి తిరిగెను మనసే/పిచ్చి పరుగులు తీసే...వెల్లివిరిసెను వయసే/ఎందుకో ఏమో గుండె దరువులు వేసే...కొంటె తలపులు తోచే...పొంగి పొరలెను ఆశే/నువ్వు నేను ఒక యంత్రమా...కాలం నడిపే ఓ మహిమా ప్రేమా/నిలవనీక నిను తెగ వెతికే... కనులకిన్ని తపనలు ఏంటో/ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో/కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను/కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను/నీడనే దోచే పాపే నేను/ఏమో తుళ్ళి తిరిగెను మనసే/పిచ్చి పరుగులు తీసే... వెల్లివిరిసెను వయసే/ఒహో.. ఏమో గుండె దరువులు వేసే...కొంటె తలపులు తోచే... పొంగి పొరలెను ఆశే/ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం...రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో/ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం...రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం../ ఏమో...

చలి చలిగా.. 
చిత్రం : మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం : శ్రేయా ఘోషల్‌ 
సాహిత్యం : అనంత శ్రీరామ్‌ 
చలిచలిగా అల్లింది.. గిలిగిలిగా గిల్లింది.. నీవైపే మళ్లిందీ మనసు / చిటపట చిందేస్తోంది.. అటు ఇటు దూకేస్తోంది.. సతమతమైపోతోంది వయసూ / చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో.. గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి / చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి / నువ్వు నాతోనే ఉన్నట్టు.. నా నీడవైనట్టు.. నన్నే చూస్తున్నట్టు ఊహలు.. నువ్వు నా ఊపిరైనట్టు.. నా లోపలున్నట్టు.. ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు / చలిచలిగా.....గొడవలతో మొదలై.. తగువులతో బిగువై.. పెరిగిన పరిచయమే నీదీ నాది / తలపులు వేరైనా.. కలవని తీరైనా / బలపడి పోతోందే ఉండే కొద్దీ / లోయలోకి పడిపోతున్నట్టు.. ఆకాశం పైకి వెళుతున్నట్టు.. తారలన్నీ తారసపడినట్టు.. అనిపిస్తోందే నాకేమైనట్టు / నువ్వు నాతోనే ఉన్నట్టు......నీపై కోపాన్ని.. ఎందరి ముందైనా.. బెదురే లేకుండా తెలిపే నేను / నీపై ఇష్టాన్ని.. నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను / నాకు నేనే దూరం అవుతున్నా.. నీ అల్లర్లన్నీ గుర్తొస్తుంటే / నన్ను నేనే చేరాలనుకున్నా.. నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే / నువ్వు నాతోనే ఉన్నట్టు.......

ఏదో అనుకుంటే...
చిత్రం: అలా మొదలైంది 
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 
సాహిత్యం: లక్ష్మీ భూపాల్‌ 
గానం: దీపు, నిత్య మీనన్‌
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే / నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే / సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే / మందుంది మనసు బాధకి.. వదిలేద్దాం కథని కంచికే / అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్మీ వై / ఎవరిష్టం వాళ్లది మనకెందుకు వదిలేయ్‌ / ఏయ్‌ ప్రేమ దోమ ఎందుకు టెల్‌ మీ వై / ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే / నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే...ప్రేమించినా పెళ్ళాడకు వైఫ్‌ ఒక్కటే తోడెందుకు / మగవాళ్ళని టైంపాసని అని అనుకుంటు  వెంట తిరగనీ / మన ఖర్చే వాళ్ళు పెట్టనీ ఆపై వాళ్ళ ఖర్మ పోనీ / మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్‌ మీ వై / అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్‌ / మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్‌ మీ వైనువ్వొక్కడివే పుట్టావురా నువ్వొక్కడివే పోతావురా / ఆ మధ్యలో బతకాలిగా / ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు / సూసైడు నేరం వద్దు మనకి / మరి లైఫూ గీఫూ ఎందుకు టెల్‌ మీ వై

పొడుస్తున్న పొద్దు మీద... 
చిత్రం:జైబోలో తెలంగాణ
సంగీతం: చక్రి
గానం, సాహిత్యం: గద్దర్‌
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...పోరు తెలంగాణమా... కోట్లాది ప్రాణమా (2)అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవడు.. సూర్యుడు / ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం / అలా కాలంతో నడిచినవాడే కదిలిపోతాడు / ఓ.. పొడుస్తున్న పొద్దు వందనం వందనంభూతల్లి.. సూర్యుడిని ముద్దాడిన భూతల్లి.. అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది.. అమ్మా.. నీవు త్యాగాల తల్లివి.. త్యాగాల గుర్తువు / భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు హా / మా భూములు మాకేనని భలే భలే భలే భలే హా / మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా / తిరగబడ్డ రాగమా / పోరు తెలంగాణమా / కోట్లాది ప్రాణమా / భలే భలే భలే భలే...అమ్మా గోదావరి.. నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం / అమ్మా కృష్ణమ్మా.. కిల కిల నవ్వే కృష్ణమ్మా.. అమ్మా మీకు వందనం / గోదావరి అలల మీద కోటి కళల గానమా / కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా హా / మా నీళ్లు భలే భలే భలే భలే హా / మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా / కత్తుల కోలాటమా కన్నీటి గానమా / పోరు తెలంగాణమా / కోట్లాది  ప్రాణమా...అదిగో ఆ ప్రకృతిని చూడు.. అలా అలుముకుంటుంది / ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి / ఆ పువ్వులు అలా ఆడుతాయి / అదిగో పావురాల జంట మేమెప్పుడు విడిపోమంటాయి / విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా / ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా హా / పువ్వులు పుప్పొడిలా పవిత్రబంధమా పరమాత్ముని రూపమా / పోరు తెలంగాణమా / కోట్లాది ప్రాణమా / భలే భలే భలే...అదిగో రాజులు దొరలు వలసదొరలు.. భూమిని నీళ్లని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు..రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరసులు / రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా / దొరవారి గడులల్లో భలే భలే భలే / దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా/  ఆంధ్రవలస తూటాలకు ఆరిపోయిన దీపమా / మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా / 

ఇనుములో హృదయం మొలిచెనే..
చిత్రం: రోబో
సంగీతం: ఎఆర్‌. రెహమాన్‌
గానం: ఎ.ఆర్‌.రెహమాన్, సుజేన్‌ 
సాహిత్యం:  సుద్దాల అశోక తేజ
ఇనుములో ఓ హృదయం మొలిచెనే/ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే/పూజించే యంత్రుడు పూవాసన కొచ్చాడు/మరమనిషి వింతోడు మన్మ«థుడై వచ్చాడు / గూగుల్‌కే అందని అందం చుడాలనుకున్నాడు/కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు/ఐ రోబో నీ చెవిలో ఐ లవ్‌ యు కోరేదఐ యామ్‌ ఏ సూపర్‌ గర్ల్‌.. ప్రేమించే రాపర్‌ గర్ల్‌ (2)వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే/నీ నీలి కన్నులో విద్యుత్తే దొంగలిస్తా/నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా/నా ఏంజెల్‌ గుండెల్ని నీ సేవకి అర్పిస్తా/నీ నిద్ర రాత్రిలో నా సృష్టి ఆపేస్తా/ఏనాడూ ఏ పొద్దు నీ వాడే బొమ్మేనవుతవాచ్‌ మీ రోబో షేక్‌ ఇట్‌.. ఐ నో యూ వానా బ్రేక్‌ ఇట్‌.. 
గట్టి మాటగన... నువ్వే షాక్‌ కొడితే ప్రేమే బూడిదేరా/వొట్టి వేగమైతే కౌగిలి రాత్రి బ్యాటరీ అయిపోతే/మెమరీలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే/ షట్‌డౌనే చేయను పో రోజంతా చూస్తానే ఓ..ఒ రోబో/ సెన్సార్లన్ని అరిగే దాకా నీలో అన్ని చదివానే/నీ వల్లే నా నియమం హద్దులన్ని మరిచానే/ఎంగిలి లేని దొంగముద్దు వద్దనకుండ తీసుకోవా/రక్తం లేని నా హంగులనే వద్దు పోరా అంటావా
జీవశాస్త్ర భాషలోన్న యంత్రాన్నే ఓహ్‌ చెలి/తారాలోకం భాషలోన్న చంద్రుడినే నా సఖి/చావే లేని శాపం పొంది భువి పైకి వచాన్నే/నా ప్రేమ పువ్వు వల్లే వాడిపోదు అంటానే/హే రోబో మసకొద్దు....
నువ్వు కాళ్ళకు బంధం వేయకు ఫో.../ప్రేమ కోరే రోబో.../నీ అవసరం లేదు పో.. పో.... ఇనుములో ఓ హృదయం మొలిచెనే/ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే/ పూజించే యంత్రుడు పూవాసన కొచ్చాడు/మరమనిషి వింతోడు మన్మథుడై వచ్చాడు, గూగుల్‌కే అందని అందం చూడాలనుకున్నాడు/కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు...ఐ రోబో నీ చెవిలో ఐ లవ్‌ యు కోరేదా/ ఐ యామ్‌ ఏ సూపర్‌ గర్ల్‌.. ప్రేమించే రాపర్‌ గర్ల్‌ / ఐ రోబో నీ చెవిలో ఐ లవ్‌ యు కోరేదా/ ఐ యామ్‌ ఏ సూపర్‌ గర్ల్‌.. ప్రేమించే రాపర్‌ గర్ల్‌

రూబా రూబా... 
చిత్రం: ఆరెంజ్‌  
సంగీతం: హారిస్‌ జైరాజ్‌  
గానం: శాహిల్‌ హదా
సాహిత్యం:  వనమాలి 
రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్‌ రబ్బా / తౌబా తౌబా.. హే తౌబా తౌబా.. తు హై మేరీ మెహబూబా / అయ్యయ్యయ్యో యే మాయో నీ వెంట తరుముతోంది / ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది / సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే ఇంచు దూరమే అడ్డున్నా ఎలా ఉండగలమంటున్నా.. నిన్ను తాకమని తొందర చేసే నా మదే / కొంటె చేష్టలే చేస్తున్న.. తనేం చేసినా కాదనదే.. ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే / ఈ ఆనందంలో సదా ఉండాలనుందే / ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే / నీతో సాగే ఈ పయనం.. ఆగేనా ఇక ఏ నిమిషం /
రెక్కలొచ్చినట్టు ఉందే.. మదే తేలిపోతుందే / రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే / నవ్వు  నాకు తెగ నచ్చిందే / నడుస్తున్న కల నచ్చిందే / నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే / నువ్వేమంటున్నా వినాలనిపిస్తు ఉందే / రోజూ నీ ఊసే కలల్లే పంచుతోందే / నీతో ఉంటే సంతోషం.. కాదా నిత్యం నా సొంతం / 

సదా శివా సన్యాసి... 
చిత్రం: ఖలేజా
సంగీతం: మణిశర్మ
గానం: కారుణ్య, రమేష్‌ వినయగం
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుక నాదానందాయ, ఓం నమో నిటలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ, ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!!సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి/నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి./ఏయ్‌ సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసీ మీదిగా/సూడ సక్కని సామి దిగినాడురా, ఏసైరా ఊరు వాడా దండోరా/ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా, నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా, నీ తాపం, శాపం తీర్చేవాడేరా/పైపైకలా, బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల/లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ/ఏయ్‌. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు/సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి/నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి/ఏయ్‌.ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ/సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా/మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా/ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా. మనకండ దండ వీడే నికరంగా/సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా/లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ/ఏయ్‌. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు

వింటున్నావా... 
చిత్రం:  ఏ మాయ చేసావె
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
గానం: కార్తీక్, శ్రేయా ఘోషల్‌ 
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
పలుకులు నీ పేరే తలుచుకున్నా / పెదవుల అంచుల్లో అణుచుకున్నా / మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా / తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా/విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు/నాగుండెల్లో ఇప్పుడే వింటున్నా/తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా/చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా/ఓ బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా..... ఏమోఏమో ఏమవుతుందో/ఏ..దేమైనా నువ్వే చూసుకో/విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా...ప్రియా/గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే/నన్నే ఆపీ నువ్వే రాసినా, ఆ పాటలనే వింటున్నా.తరిమే వరమా తడిమే స్వరమా/ఇదిగో ఈ జన్మ నీదని అటున్నా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..వింటున్నావా.... ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి/ఆద్యంతం ఏదో ఆనుభూతి అనవరతం ఇలా అందించేది.. గగనం కన్నా మునుపటిది.. భూతలం కన్నా ఇది వెనుకటిది.. కాలంతోన పుట్టింది కాలం లా మారే.. మనసే లేనిది ప్రేమ../ రా ఇలా కౌగిళ్లల్లో నిన్ను దాచుకుంటా.. నీ దానినై నిన్నే దారిచేసుకుంటా.. ఎవరిని కలువని చోటులలోన.. ఎవరిని తలువని వేళలలోన.. తరిమే వరమా.../వింటున్నావా../విన్నా  వేవేల...

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ... 
గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతలకొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి, తెరలను వదిలి, పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులుని వదిలి ముడులని వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి.... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది/ గుండె గుబులుని.. గంగకు వదిలి, ముందు వెనకలు.. ముంగిట వదిలి, ఊరి సంగతి, ఊరికి వదిలి.. దారి సంగతి, దారికి వదిలి.. తప్పు ఒప్పులు, తాతలకొదిలి.. సిగ్గు ఎగ్గులు, చీకటికొదిలి.. తెరలను వదిలి.. పొరలను వదిలి.. తొలి తొలి విరహపు చెరలను వదిలి.. గడులుని వదిలి ముడులని వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి... హా ..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది../ లోకం రంగుల సంత.. హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌/ప్రతిదీ ఇక్కడ వింత.. హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌ హొయ్‌/అందాలకు వెల ఎంత.. కొందరికే తెలిసేటంత/పాతివ్రత్యం, పై పై వేషం.. ప్రేమ త్యాగం, పక్కా మోసం/మానం శీలం, వేసే వేలం.. మన బతుకుంతా, మాయాజాలం/ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో...(శివ..శివ)/ఎగిరిపోతే....

పంచదార బొమ్మ 
చిత్రం:  మగధీర
సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి
గానం: అనూజ్‌ గుర్వారా, రీతా
సాహిత్యం:  చంద్రబోస్‌
పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ/ మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవదనకమ్మా/చేతినే తాకొద్దంటే.. చంతకేరావొద్దంటే ఏమౌతానమ్మా/నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ/నువ్వు అందకపోతే వృథా ఈ జన్మపువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే/పసిడిపువ్వు నువ్వని పంపిందే/నువ్వు రాకు నా వెంట పూల చుట్టు ముళ్లంటా/అంటుకుంటే మండే వళ్లంతాతీగ పైన చెయ్యేస్తే తిట్టినన్ను నెట్టిందే/మెరుపు తీగ నువ్వని పంపిందే/మెరుపు వెంట ఉరుమంటా/ఉరుము వెంట వరదంట/నీ వరదలాగ మారితె ముప్పంటవరదైనా వరమని భరిస్తానమ్మా/మునకైనా సుఖమని మునకేస్తానమ్మా
గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది/నేను నిన్ను తాకితే తప్పా/గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది/ఏమింటంట నీలోని గొప్పావెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది/పక్షపాతమెందుకు నాపైనా/వెలుగు దారి చూపిందే/చినుకు లాల పోసిందే/వాటితోటి పోలిక నీకేలా/ అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా/నీ చితిలో తోడై నేనొస్తానమ్మా

హృదయం ఎక్కడున్నదీ... 
చిత్రం: గజిని
సంగీతం: çహారీస్‌ జయరాజ్‌
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరీష్‌ రాఘవేంద్ర, బొంబే జయశ్రీ
హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది../నీ చుట్టూనే తిరుగుతున్నదీ.../అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ../చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ../చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా... తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా ../చెలి అందం నేడే అందుకున్నా.../గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా.../చూపే వేసీ బతికిస్తావనుకున్నా...ఆ..కంటిపాపలా.. పూవులనే నీ కనులలో కన్నా../నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.... నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా...అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ.. /చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా ...తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...మనసులో నిన్ను కన్నా... మనసుతో పోల్చుకున్న.../తలపుల పిలుపులు విన్నా../సెగలలో కాలుతున్నా .. చలికి నే వణుకుతున్నా../నీడే లేని జాడే తెలుసుకున్నా...ఆ../మంచు చల్లనా.. ఎండ చల్లనా.. తాపంలోనా మంచు చల్లనా ../కన్నా..నీ కోపంలోనా ఎండ చల్లనా... కన్నా.. నీ కోపంలోనా ఎండ చల్లనా...

రబ్బరు గాజులు...
చిత్రం: యమదొంగ
సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి
గానం: దలేర్‌ మెహందీ
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే/రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే/అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తిరి నీదరి కొచ్చావే/నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి చస్తానే/నీవెంటె పడిపడీ వస్తానే/చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పినచోటికి తెచ్చేరో/వెన్నెల కొండలు వెన్నెల కొండలు వెచ్చని వేళకు పట్టెయ్‌రో/మెత్తని దిండుగ పట్టెను నిన్నుగ గమ్మున పట్టుకొచ్చెయ్‌రో/నువ్వంటే పడి పడి..రాజుగారి ఏనుగుమీద రైరై రఫ్‌రై రై రై రఫ్‌ రై అని ఊరిగిస్తానే పిల్లా/రాణిగారి పానుపు మీద దాయిదాయి అమ్మదాయి హాయి హాయి అమ్మాహాయి అని బజ్జోపెడతానే పిల్లాఅట్టాగంటే ఐస్‌ అవుతానా/ఇట్టాగొస్తే క్లోజ్‌ అవుతానా/ అంతందంగా అలుసవుతానా/ కీ అని నువ్వంటే కీలుగుర్రం ఎక్కించి, జూం అని జాం అని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే.. రోజు రోజూ తోటకి వెళ్లి ఢీఢీ ఢీక్కంఢీ డీఢీఢీక్కంఢీ అని లవ్వాడేద్దామే పిల్లా/ఢీ ఢీ ఢీక్కంఢీ ఢీ ఢీ ఢీక్కంఢి/ఏదో రోజు పేటకు వెళ్ళి పీపీడుండుంపి పిపిడుండుండుండుంపి అని పెళ్లాడేద్దామే పిల్లా అట్టా చెపుతే సెట్‌ అయిపోతా/పుస్తె కడితే జటై్టపోతా/ఆకుల్లోన వక్కైపోతాఅ అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా/ఢూం అని ఢం అని డప్పులు తప్పలు తగిలిచ్చేస్తానే....

నిజంగా నేనేనా... 
చిత్రం: కొత్త బంగారు లోకం
సంగీతం: మిక్కీ జె మేయర్‌
గానం: కార్తీక్‌ 
సాహిత్యం: అనంత∙శ్రీరామ్‌
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా / ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా / యెదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా / వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా / హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా/ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా/హరే హరే హరే హరే హరేరామా/మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా.. ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం/నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం/ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం/అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా/అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా... నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే/నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే/ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే/పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే/పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా/ యెదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా/వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా...

గాల్లో తేలినట్టుందే... 
చిత్రం: జల్సా
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: టిప్పు, గోపికా పూర్ణిమ 
సాహిత్యం:  భాస్కరభట్ల 
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే/తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే/వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే/ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే/ఊర్వశివో, నువ్వు రాక్షసివో, నువ్వు ప్రేయసివో, నువ్వు నా కళ్లకి.. ఊపిరివో, నువ్వు ఊహలవో, నువ్వు ఊయలవో, నువ్వు నా మనసుకి/హే నిదుర దాటి కలలే పొంగే/పెదవి దాటి పిలుపే పొంగే/అదుపు దాటి మనసే పొంగే... నాలో గడపదాటి వలపే పొంగే/చెంపదాటి ఎరుపే పొంగే/నన్ను దాటి నేనే పొంగే....నీ కొంటె ఊసుల్లో రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు/దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో, నువ్వు తుంటరివో నువ్వు, తొందరవో నువ్వు, నా ఈడుకి/తలపుదాటి తనువే పొంగే/సిగ్గుదాటి చనువే పొంగే/గట్టుదాటి వయసే పొంగే లోలో.. కనులుదాటి చూపే పొంగే/అడుగుదాటి పరుగే పొంగే/హద్దు దాటి హాయే పొంగే.. నీ చిలిపి నవ్వుల్లో తూరుపువో నువ్వు, వేకువవో నువ్వు, సూర్యుడివో నువ్వు నా నింగికి../జాబిలివో నువ్వు, వెన్నెలవో నువ్వు, తారకవో నువ్వు నా రాత్రికి..

ఎంతవరకు.. ఎందుకొరకు... 
చిత్రం: గమ్యం
సంగీతం: ఈఎస్‌ మూర్తి, అనీల్‌
గానం: రంజిత్‌ 
సాహిత్యం:  సిరివెన్నెల
ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు/గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు/ప్రశ్నలోనే బదులు ఉందే గురుతు పట్టే గుండెనడుగు/ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా/తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా/ కనపడవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు/అడగరే ఒక్కొక్క అల పేరు/మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు/పలకరే మనిషి అంటే ఎవరు../సరిగా చూస్తున్నదా నీ మది, గదిలో నువ్వే కదా ఉన్నది/ చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది/నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా/మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా, కాదా... మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై/నీడలు నిజాల సాక్ష్యాలే/శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే/ఋతువులు నీ భావ చిత్రాలే/ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం/మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యము/పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ/జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ...

అరెరె.. అరెరే.. 
చిత్రం: హ్యాపీ డేస్‌
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
గానం: కార్తీక్‌ 
సాహిత్యం: వనమాలి
అరరే అరరే మనసే జారే అరరే అరరే వరసే మారే/ ఇదివరకెప్పుడూ లేదే, ఇది నా మనసే కాదే/ఎవరేమన్నా వినదే, తన దారేదో తనదేఅంతా నీ మాయలోనే, రోజూ నీ నామస్మరణే/ప్రేమా ఈ ఇంతలన్నీ నీ వల్లనేస్నేహమేరా జీవితం అనుకున్నా/ఆజ్‌మేరా ఆశలే కనుగొన్నా/మలుపులు ఎన్నైనా/ముడిపడిపోతున్నా/ఇక సెకనుకెన్ని నిమిషాలో, అనుకుంటు రోజు గడపాలా/మది కోరుకున్న మధుబాలా, చాల్లే నీ గోలాచిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే/చెంత చేరి, చిత్రమే చూస్తున్నా/చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా/తెలుగింటి లోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా/ అలవాటు లేని పరవశమా వరమా హాయ్‌ రామా

నాలో ఊహలకు... 
చిత్రం: చందమామ
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌
గానం: ఆశా భోంస్లే 
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ/నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ/పరుగులుగా... పరుగులుగా.../అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ/నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూకళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే/పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే/శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుంది ఇలామౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ/మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ/నిన్ను చూస్తూ... ఆవిరవుతూ... అంతమవ్వాలనేపరుగులుగా... పరుగులుగా... అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ/నాలో ఊహలకు... నాలో ఊసులకు... అడుగులు నేర్పావూ....  

అపుడో ఇపుడో ఎపుడో... 

చిత్రం: బొమ్మరిల్లు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: సిద్ధార్థ్‌ 
సాహిత్యం: అనంత శ్రీరామ్‌
అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి/అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి/కలవో అలవో వలవో నా ఊహల హాసిని/మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని/ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేననితీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే/హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే/నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానేనన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పక పొతుంటే/నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఎదో చిన్నమాటే నువ్వు నాతో మాటాడావంటే/నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే....

వాజీ వాజీ వాజీ... 
చిత్రం: శివాజీ 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
గానం: హరిహరన్, మధుశ్రీ
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
పువ్వల్లే నవ్వుల్‌ నవ్వుల్‌..లవ్వల్లే మువ్వల్‌ మువ్వల్‌../నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి../నీ కాటుక కళ్ళకు జారిపడీ..పని బడీ ఇటు చేరితి పైనబడీ/వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ... /వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ.../చూపే కత్తి కదూ..అది నా సొత్తు కదూ..నీలో ఆశలు నా తనువంతా పూజల్లు../ఎద గుత్తుల తోనే గట్టిగ ఇప్పుడే ..గుండె ముట్టి వెళ్ళు../వాహ్‌ జీ..వాహ్‌ జీ..వాహ్‌ జీ.. రారాజే నా శివాజీ...ఉవాహ్‌ జీ..వాహ్‌ జీ..వాహ్‌ జీ.. రేరాజే నా శివాజీ.../సిరివెన్నెలవె..మెలిక మల్లికవే..విరితేనియవే..ఇక ఊ అనవే..నా కౌగిలిలో ఇలా ఇలా కరగా../పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్‌ రా..ఆ..ఆ../పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్‌ రా/విధికి తలవంచని రణధీరా..ఎదకు ఎద సరసన కలిపెయ్‌ రా../ఓ..మాటలతో ఎందుకే చెలియా..చేతలతోనే..(రతీమగని) ధీటునే../వాహ్‌ జీ..వాహ్‌ జీ..వాహ్‌ జీ.. రారాజే నా శివాజీ.../వాహ్‌ జీ..వాహ్‌ జీ..వాహ్‌ జీ.. రేరాజే నా శివాజీ.../పువ్వల్లే నవ్వుల్‌ నవ్వుల్‌..లవ్వల్లే మువ్వల్‌ మువ్వల్‌../పసి జాణ ఇదీ..తన వూసులతో..కసి తళుకులతో నను లాగెనులే..అది పొంగులుగా సుఖంసుఖం ఇంకా../ఆనంద సందడిలో చందురిని మోముగా మలచుకోనా..ఆ..ఆ../తారలిక జతులతో ఆడే..వెన్నెలను వేదిక చేసేనా..ఆ..ఆ../అరెరె అల్లరి చేసే ..చిన్నది చూస్తే పాలరాతి బొమ్మరో../వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ.../వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ.../పువ్వల్లే నవ్వుల్‌ నవ్వుల్‌..లవ్వల్లే మువ్వల్‌ మువ్వల్‌.. /నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి../నీ కాటుక కళ్ళకు జారిపడీ..పనిబడీ ఇటు చేరితి పైనబడీ...

ఉప్పొంగెలే గోదావరి... 
చిత్రం: గోదావరి
సంగీతం: కెఎమ్‌. రాధకృష్ణ
గానం: ఎస్‌.పి. బాలసుబ్రమణ్యం
సాహిత్యం:  వేటూరి
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి/భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి/వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి/శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి/వేసెయ్‌ చాప జోర్సెయ్‌ నావ బారుసెయ్‌ వాలుగా/చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా/ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి/భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరిసావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం/వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం/ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం/ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం/ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ/నది ఊరేగింపులో పడవ మీదలాగా/ప్రభువు తాను కాగాగోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు/లంకానాథుడింక ఆగనంటూ పండు కొరుకు/చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి/సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి/లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు/అల పాపికొండల నలుపు కడగలేక/నవ్వు తనకు రాగా వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి/శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి/వేసెయ్‌ చాప జోర్సెయ్‌ నావ బారుసెయ్‌ వాలుగా/చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

గల గల పారుతున్న.. 
చిత్రం: పోకిరి 
సంగీతం: మణిశర్మ 
గానం: నిహాల్‌ 
సాహిత్యం:  కందికొండ 
గల గల పారుతున్న గోదారిలా.. జల జల జారుతుంటే కన్నీరలా (2) / నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా.. నాకెందుకో ఉన్నదీ.. హాయిగా (2) / గల గల పారుతున్న గోదారిలా.....వయ్యారి వానలా.. వాన నీటిలా ధారగా.. వర్షించి నేరుగా వాలినావిలా నాపైన / వెళ్లేటి దారుల వేచి నువ్విలా చాటుగా.. పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా / ఓ ఓ.. ఈ అల్లరి.. ఓ.. ఓ.. బాగున్నదీ / గల గల పారుతున్న గోదారిలా.. జల జల జారుతుంటే కన్నీరలా (2)చామంతి రూపమా.. తాలలేవుమా రాకుమా / ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా / హిందోళ రాగమా మేళ తాళమా గీతమా / కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా / ఓ.. ఓ.. ఈ లాహిరి.. ఓ.. ఓ.. నీ ప్రేమది.. / గల గల పారుతున్న గోదారిలా.....

పిలిచినా రానంటావా... 
చిత్రం: అతడు
సంగీతం:  మణిశర్మ
గానం : కార్తీక్, కవితా సుబ్రమణ్యం 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
పిలిచినా రానంటావా/కలుసుకోలేనంటావా /నలుగురూ ఉన్నారంటావా  ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా/తెలివిగా చేరే తోవా.. తెలియనే లేదా బావా/అటు ఇటూ చూస్తూ ఉంటావా  ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా/సమయం  కాదంటావా/సరదా లేదంటావా/సరసం చేదంటావా బావా/చనువే  తగదంటావా/మనవే  విననంటావా  వరసై  ఇటు రమ్మంటే   నా మాట మన్నించవా/ డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా/చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా/హేయ్‌ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా/చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా/కనులుంటే సొగసే కనపడదా/మనసుంటే తగు మార్గం దొరకదా/రాననకా .. రాననకా .. రాననకా/అనుకుంటే సరిపోదే వనితా/అటుపై ఏ పొరబాటో జరగదా రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా../పెరిగిన దాహం తరగదే పెదవుల తాకందే తరిమిన తాపం తాళదే   మదనుడి బాణం తగిలితే/చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే/బ్రేక్‌  ఇట్‌  డౌన్‌/హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ/హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ/పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా/నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా/మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా  చేరవుగా .. చేరవుగా .. చేరవుగా../ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా  ఆగవుగా .. ఆగవుగా .. ఆగవుగా../దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా/వరాల బాలా వరించువేళా  వరించనంటూ తగువేలా  నిగారమిట్టా జిగేలనాలా  జనం చెడేలా/ఎవ్రిబడీ ../నిగారమిట్టా జిగేలనాలా  జనం చెడేలా జవరాలా నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా జవరాలా...

రా రా..
చిత్రం: చంద్రముఖి
సంగీతం: విద్యాసాగర్‌
గానం: నిత్యశ్రీ, శంకర్‌ మహదేవన్‌
రచన:  భువనచంద్ర
రారా... రారా...రారా..రారా.. రారా... సరసకు రారా రారా..చెంతకు చేరా...ప్రాణమే నీదిరా... ఏలుకో రా దొరా.. శ్వాసలో శ్వాసవై రారా../తోంతోంతోం...తోంతోంతోం... ఆఆఆఆఆ...దిరనన దిరనన దిరనన దిరనన... ఆఆఆఆ/దిరనన దిరనన దిరనన దిరనన....... ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ....ఆఆఆఆఆఆఆఆఆ...నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా../ఆఆఆఆ... కాలాన మరుగైన ఆనంద/రాగాలు...వినిపించ నిలిచానురా.../తనన ధీంత ధీంత ధీంతన...తనన ధీంత ధీంత ధీంతన... తనన ధీంత ధీంత ధీంతన..ధీంతనా../వయసు జాలమోపలేదురా.. మరులుగొన్న చిన్న దాన్నిరా.. తనువు బాధ తీర్చ రావెర.. రావెరా../సలసలసలసల రగిలిన పరువపు సొద ఇది.. తడి బుడి తడి బుడి తపనల స్వరమిది...రారా.../లకలక లకలక లకలక లకలక/ఏ బంధమో ఇది ఏ బంధమో.. ఏ జన్మ బంధాల సుమగంధమో.../ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో.. నయనాల నడయాడు తొలి స్వప్నమో../విరహపు వ్యథలను వినవా.. ఈ తడబడు తనువును తరవా../మగువల మనసులు తెలిసి.. నీ వలపును మరుచుట సులువా../ఇది కనివిని ఎరుగని.. మనుసుల కలయిక... సరసకు పిలిచితి.. నిరసన తగదిక/ జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని..మిలమిల మొగసిరి మెరుపు మెరియగ రారా..రారా..ఉలకలక లకలక లకలక లకలక... తాం తరికిట ..ధీం తరికిట..తోం తరికిట..నం తరికిట...తత్తత్తరికిట ధిత్తిత్తిరికిట నం తరికిట... తళాంగు తకజోం..తదింత నకజోం.. తళాంగు తకజోం.. తదింత నకజోం.. తళాంగు తకజోం.. తదింత నకజోం...

జగమంత  కుటుంబం... 
చిత్రం: చక్రం
సంగీతం:  చక్రి
గానం: శ్రీ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది/సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే/కవినై, కవితనై, భార్యనై, భర్తనై/మల్లెల దారిలో మంచు ఎడారిలో/పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల/నాతో నేను అనుగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ/ఒంటరినై అనవరతం/కంటున్నాను నిరంతరం కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని/ మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై/మంటల మాటున వెన్నెల నేనై/వెన్నెల పూతల మంటను నేనై/రవినై, శశినై, దివమై, నిశినై.. నాతో నేను సహగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ.. ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం... కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని/ గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగివెడలె/గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే, నా హృదయమే నా లోగిలి/నా హృదయమే నా పాటకి తల్లి/నా హృదయమే నాకు ఆలి/నా హృదయములో ఇది సినీవాలి

చంద్రుడిలో ఉండే కుందేలు... 
చిత్రం:  నువ్వొస్తానంటే నేనొద్దంటానా!
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: శంకర్‌ మహదేవన్‌ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
చంద్రుడిలో ఉండే కుందేలు కిందికొచ్చిందా/ కిందికొచ్చి నీలా మారిందా/తందానా.. తందానా/ చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా/నిన్ను మెచ్చి నీలో చేరిందా/నువ్వలా సాగే తోవంతా/నావలా తూగే నీవెంట..నీవెంట/నువ్వెల్లే దారే మారిందా/నీవల్లే తీరే మారి ఏరై పారిందోమే నేలంతా...గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా.. తెలుసా ఎక్కడ వాలాలో../నవ్వులే తీసుకువచ్చావే ఈడు సంబరమా... తెలుసా ఎవ్వరికివ్వాలో... కూచుపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా/పాటలాంటి లేత పదం పాఠశాలగా../కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా/జావలీల జాన తనం బాట చూపగా/కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేనా/అంతటా ఎన్నో వర్ణాలు.. /మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా/ఇంతలో ఏవో రాగాలు/ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా/ సాగుతున్న ఈ పయనం ఎంతవరకో/ రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుకా/రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో/మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెం తంటే.. లెక్కలే మాయమైపోయే/ రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే.. దిక్కులే తత్తర పడిపోవా

కన్నుల బాసలు..
చిత్రం:  7/జి బృందావన కాలని
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
గానం: కార్తీక్‌ 
సాహిత్యం:  శివ గణేష్, ఎ.ఎమ్‌. రత్నం
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే/ఒకవైపు చూపి మరువైపు దాచగఅద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే/ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే/గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే/దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే/ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే/అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులేఅడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే/ కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే/దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే/మెరుపుల వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే../కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట/ అల కడలిదాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట/లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే/ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే/మంచు బిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే/భువిలో ఉన్న అబద్ధాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే/ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చామలు మాయవునులే/నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసివచ్చులే/ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే/అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే/గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే/దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే

యమునా తీరం... 
చిత్రం: ఆనంద్‌
సంగీతం: కె.ఎమ్‌. రాధకృష్ణ
గానం: హరిహరన్, చిత్ర 
సాహిత్యం:  వేటూరి
యమునా తీరం సంధ్యా రాగం/యమునా తీరం సంధ్యా రాగం/నిజమైనాయి కలలు/నీలా రెండు కనులలో/నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో/మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా/ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం/చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం/శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమా/చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా/ ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా/ పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా/శి«థిలంగా విధినైనా చేసేదే ప్రేమా/హృదయంలా తనదైనా మరిచేదే ప్రేమా/ మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా

మౌనంగానే ఎదగమని... 
చిత్రం: నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌మెమొరీస్‌
సంగీతం: ఎమ్‌.ఎమ్‌ కీరవాణి
గానం: చిత్ర
సాహిత్యం:  చంద్రబోస్‌
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది/ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది/ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది/మౌనం../దూరమెంతో ఉందని, దిగులు పడకు నేస్తమా.. దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా.. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా.. బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా../సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది/అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది.. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది/చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో.. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో.. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో.. మారిపోని కథలే లేవని గమనించుకో/తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి/మా ధైర్యాన్ని దర్శించి, దైవాలే తలదించగా.. మా ధైర్యాన్ని దర్శించి, దైవాలే తల దించగా.. నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి/అంతులేని చరితలకి.. ఆది నువ్వు కావాలి/మౌనంగానే..

పెదవే పలికిన... 
చిత్రం: నాని
సంగీతం: ఎఆర్‌. రెహమాన్‌
గానం: ఉన్నికృష్ణన్, సాధన సర్గం 
సాహిత్యం:  చంద్రబోస్‌
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా.. కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా/తనలోని మమతే కలిపి పెడుతుంది ముద్దగా/తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ/మనలోని ప్రాణం అమ్మ.. మనదైన రూపం అమ్మ.. ఎనలేని జాలి గుణమే అమ్మ/నడిపించే దీపం అమ్మ.. కరుణించే కోపం అమ్మ/వరమిచ్చే తీపి శాపం అమ్మ/నా ఆలి అమ్మగా అవుతుండగా.. జో లాలి పాడనా కమ్మగా కమ్మగా/పెదవే../పొత్తిల్లో ఎదిగే బాబు.. నా ఒళ్లో వదిగే బాబు..ఇరువురికి నేను అమ్మవ్వనా/నా కొంగు పట్టేవాడు.. నా కడుపున పుట్టేవాడు.. ఇద్దరికి ప్రేమ అందించనా../నా చిన్ని నాన్నని, వాడి నాన్నని, నూరేళ్లు సాకన చల్లగా చల్లగా/ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగరు తండ్రి జో జో.. బొజ్జో లాలి జో/పలికే పదమే వినక కనులారా నిదురపో.. కలలోకి నేను చేరి పంచుతాను తదుపరి ప్రేమమాధురి/ఎదిగి ఎదగని

చెలియ చెలియా... 
చిత్రం: ఘర్షణ
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
గానం: కె.కె., సుచిత్ర 
సాహిత్యం: కులశేఖర్‌
చెలియ చెలియా చెలియా చెలియా.. అలల ఒడిలో ఎదురు చూస్తున్నా/తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా/చిగురు ఎదలో చితిగామారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో/కాలమంతా మనది కాదు అని, జ్ఞాపకాలే చెలిమి కానుకని, వదిలిపోయావు న్యాయమా ప్రియతమా../చెలియా/శ్వాస నీవే తెలుసుకోవె, స్వాతి చినుకై తరలిరావే, నీ జతే లేనిదే నరకమే ఈ లోకం/జాలి నాపై కలగదేమే, జాడ అయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికినే నీకోసం/ఎందుకమ్మా నీకీ మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం, పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా../గుండెలోన వలపు గాయం, మంట రేపే పిదప కాలం, ప్రణయమా.. ప్రణయమా.. తెలుసునా నీకైనా/దూరమైన చెలిమి దీపం, భారమైన బతుకు శాపం, ప్రియతమా.. హృదయమా.. తరలిరా నేడైనా/కలవు కావా నా కనుల్లో.. నిముషమైనా నీ కౌగిలిలో.. సేదతీరాలి, చేరవా నేస్తమా/చెలియా..

నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా.. 
చిత్రం: వర్షం 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: చిత్ర, రకీబ్‌ అలమ్‌ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
చినుకురవ్వలో... చినుకురవ్వలో.. చిన్నదాని సంబరాల చిలిపినవ్వులో... /పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో.../ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన/ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా/చుట్టంలా వస్తావే/చూసెళ్లిపోతావే/ అచ్చంగా నాతోనే నిచ్చం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా/నువ్వొస్తానంటే నేనొద్దంటానా/ ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా/చెవులకు సన్నా జూకాల్లా్లగా చేరుకోవే జిలుగుల చుక్క/ చేతికి రవ్వల గాజుల్లాగా.. కాలికి మువ్వల పట్టీల్లాగా.. మెడలో పచ్చల పతకంలాగా.. వదలకు నిగనిగ నిగలను తొడిగేలా.. /నువ్వొస్తానంటే నేనొద్దంటానా/చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా/కన్నెయీటి సోయగంలా నన్ను నీలా పోల్చుకోనా/పెదవులు పాడే ∙కిలకిలలోనా.. పదములు ఆడే కథకళిలోనా.. కనులను తడిపే కలతలలోనా.. నా అణువణువున నువు కనిపించేలా../నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఫీల్‌ మై లవ్‌ 
చిత్రం: ఆర్య
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: కె.కె. 
సాహిత్యం: చంద్రబోస్‌
ఫీల్‌ మై లవ్‌/నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చెలియా ఫీల్‌ మై లవ్‌/నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో... సఖియా ఫీల్‌ మై లవ్‌/నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గానో... ఫీల్‌ మై లవ్, ఫీల్‌ మై లవ్‌/హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్‌ మై లవ్‌/నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్‌ మై లవ్‌/నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతు ఫీల్‌ మై లవ్‌/నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్‌ మై లవ్‌/నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదని, నేనంటే గిట్టదంటు నా మాటే చేదని, నా చెంతే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే.. ఫీల్‌ మై లవ్, ఫీల్‌ మై లవ్‌/ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్‌ మై లవ్‌/ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్‌ మై లవ్‌/విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్‌ మై లవ్‌/వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్‌ మై లవ్‌/అడుగులకే అలసటొస్తే, చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కునుకు వస్తే, పెదవుల పలుకాగితే/ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే.... ఫీల్‌ మై లవ్‌... ఫీల్‌ మై లవ్‌...

ఓ మగువా నీతో... 
చిత్రం: సత్యం 
సంగీతం– గానం: చక్రి
సాహిత్యం:  భాస్కరభట్ల 
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా.. కాళిదాసులాగమారి కవితే రాసేశా/ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా/ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... దేవదాసులాగమారి గడ్దం పెంచేశా/ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా/ట్రిపుల్‌ ఎక్స్‌ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా.. నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా/సన్‌లైట్‌ వేళ నుంచి మూన్‌లైట్‌ వేళ్లేదాకా.. ఫుల్‌ టైమ్‌ నా గుండెల్లో హార్టులన్ని నీవేగా.. ఓ లలనా ఇది నీ జాలమా.. నీ వలన మనసే గాయమా.. కుదురేమో లేదాయే నువ్వు నమ్మవుగానీ కలవరమాయే/ఓ మగువా../కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గానీ.. నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని/క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని/ఓ మగువా నీకే న్యాయమా.. ఎదలో ప్రేమే శాపమా../మనసేమో బరువాయే.. నీ మాటలు లేక మోడైపోయే/ఓ మగువా....

రామా రామా..
చిత్రం: శివమణి
సంగీతం: చక్రి
గానం: కౌసల్య 
సాహిత్యం:  కందికొండ
రామా రామా రామా నీలి మేఘ శ్యామా/రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ/మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే/కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే/నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా/రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా/రామా.. రామా....

నువ్వే నా శ్వాస... 
చిత్రం: ఒకరికి ఒకరు
సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి
గానం: శ్రేయా ఘోషల్‌ 
సాహిత్యం:  చంద్రబోస్‌
నువ్వే నా శ్వాస.. మనసున నీకై అభిలాష/బ్రతుకైన నీతోనే.. చితికైన నీతోనే/వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ/ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా../పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు/తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు/మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు/నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా/నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ/ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా../సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని/గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని/ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహన్ని/దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని/ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా/నా ప్రేమ సందేశం విని వస్తావని, చిన్ని ఆశ... ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా..

కొడితే కొట్టాలిరా... 
చిత్రం: ఠాగూర్‌ 
సంగీతం: మణిశర్మ
గానం: శంకర్‌ మహదేవన్‌
సాహిత్యం: చంద్రబోస్‌
కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి../బాటేదైనా గాని మునుముందుకెళ్లాలి.. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి/ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి/చిందే వెయ్యాలి నటరాజులాగ.. నవ్వే చిందాలీ నెలరాజులా/మనసే ఉండాలీ మహారాజులాగ... ముగిసీపోవాలి రాజు పేద తేడాలన్నీ/కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి/చెయ్యి ఉంది నీకు చెయ్‌ కలిపేటందుకే.. చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే/మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే/ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యడానికే/అభిమానం తోడుందీ ఎందాకైనా నడపడానికే/ఆ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే/చేసే కష్టాన్నీ నువ్వే చెయ్యాలి..పొందే ఫలాన్నీ పంచివ్వాలి/అందరి సుఖాన్నీ నువ్వే చూడాలి... ఆ విధి రాతనీ చెమటతోనే చెరిపెయ్యాలి/పెద్ద వాళ్లకెప్పుడు నువ్వు శిరస్సు వంచరా..అరె చిన్నవాళ్లనెప్పుడు ఆశీర్వదించరా/లేనివాళ్లనెప్పుడు నువ్వు ఆదరించరా...ప్రతిభ ఉన్న వాళ్లనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా/శరణంటూ వచ్చేసే..శత్రువు నైనా ప్రేమించరా/సంఘాన్నే పీడించే...చీడను మాత్రం తుంచెయ్యరా/ఈ ఆశాజీవీ చిరంజీవి సూత్రమిదేరా/దేవుడు పంపిన తమ్ముళ్లే మీరు రక్తం పంచినా బంధం మీరు/చుట్టూ నిలిచినా చుట్టాలే మీరు నన్నే చూపినా అద్దాలంటే మీరే మీరే...

ఎగిరి దుమికితే... 
చిత్రం: బాయ్స్‌ 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
గానం: చిత్ర, కార్తిక్‌
సాహిత్యం: ఎ.ఎం.రత్నం
ఎగిరి దుమికితే నింగి తగిలెను.. పదములు రెండూ పక్షులాయెను.. వేళ్ల చివర పూలు పూచెను..కనుబొమ్మలే దిగి మీసమాయెను.. అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/హే.. ఆనంద బాష్పాల్లో మునిగా... ఒక్కొక్క పంటితో నవ్వా...కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై... నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై...అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/ప్రేమను చెప్పిన క్షణమే.. అది దేవున్ని కన్న క్షణమేగాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...(2) ఎగిరి దుమికితే../నరములలో మెరుపురికెనులే.. తనువంతా వెన్నెలాయెనులే../చందురుని నువు తాకగనే.. తారకలా నే చెదిరితినే.../మనసున మొలకే మొలిచెను.. అది కరువై తలనే దాటలే.. అలె.. అలె../నే చలనం లేని కొలనుని, ఒక కప్ప దూకగా ఎండితిని/ప్రేమను చెప్పిన క్షణమే.. అది దేవున్ని కన్న క్షణమే... గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ.../ఎగిరి దుమికితే.../ఇసకంతా ఇక చక్కెరయా.. కడలంతా మరి మంచినీరా../ తీరమంతా నీ కాలిగుర్తులా.. అలలన్నీ నీ చిరునవ్వులా../కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయెనులే.. అలె.. అలె../హరివిల్లు తగులుతూ ఎగరగ... ఈ కాకి కూడా నెమలిగా మారెనులే../ప్రేమను చెప్పిన క్షణమే...

నువ్వు నేను కలిసుంటేనే..
చిత్రం: గంగోత్రి 
సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
గానం: బాలు, మాళవిక
సాహిత్యం: చంద్రబోస్‌
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం..నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం/నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండీ నేనక్కడుంటే ఎంతో కష్టం../ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని..రుచి చూసిన కాకి ఎంగిళ్లే అభిరుచులను కలుపుతాయని/తెగతిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని.. మనమాడిన గుజ్జనగూళ్లే ఒక గూటికి చేర్చుతాయని/లాలించి పెంచినవాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిశాకా.../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం../ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని..ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయని../రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ../ఆ బొమ్మల పెళ్లిళ్లే ఆశీస్సులు తెలుపుతాయని../తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిశాకా../నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం..నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం/నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండీ నేనక్కడుంటే ఎంతో కష్టం..

నువ్వు నువ్వు... 
చిత్రం: ఖడ్గం
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
నువ్వు నువ్వు నువ్వు.. నువ్వు నువ్వు../నువ్వు.. నువ్వు... నువ్వు../నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు/నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు..నా గుండె మీద నువ్వు... నా ఒళ్లంతా నువ్వు/బుగ్గల్లో నువ్వూ... మొగ్గల్లే నువ్వు... ముద్దేసే నువ్వూ../నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ.../నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు..నా మనసును లాలించే చల్లదనం నువ్వు/పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు..బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు/నా ప్రతి యుద్ధ నువ్వూ నా సైన్యం నువ్వు/నా ప్రియ శత్రువు నువ్వూ.. నువ్వూ../మెత్తని ముల్లై గిల్లే తొలిచినుకే నువ్వు/నచ్చే కష్టం నువ్వూ.. నువ్వూ.../నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు... నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు/ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు... నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు/తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు/తప్పని స్నేహం నువ్వు... నువ్వూ.../తీయని గాయం చేసే అన్యాయం నువ్వు/అయినా ఇష్టం నువ్వూ.. నువ్వూ../మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు..నే కోరుకునే నా మరోజన్మ నువ్వు/కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు../నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు/నా అందం నువ్వు ఆనందం నువ్వు/నేనంటే నువ్వూ../ నా పంతం నువ్వు.. నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ...

నీవే నీవే.. 
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
సంగీతం –గానం: చక్రి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటానా కలలని కన్నది నీవే / నా మెలకువ వేకువ నీవే / ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా / నా కష్టం ఇష్టం నీవే /చిరునవ్వు దిగులు నీవే / ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా / కనిపించకపోతే బెంగై వెతికావే / కన్నీరే వస్తే కొంగై తుడిచావే / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటానే గెలిచిన విజయం నీదే / నే ఓడిన క్షణం ఓదార్పే / నా అలసట తీరే దారే నీవేగా / అడుగడుగున నడిపిన దీపమా / ఇరువురికే తెలిసిన స్నేహమా / మది మురిసే ఆనందాలే నీవేగా / జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే / ధన్యోస్మి అంటూ దణ్ణం పెడతాలే / నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం

చెప్పవే చిరుగాలి... 
చిత్రం: ఒక్కడు
సంగీతం: మణిశర్మ
గానం: ఉదిత్‌ నారాయణ్, సుజాత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి...ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి/చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి..ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి/ఆశా దీపికలై మెరిసే తారకలు...
చూసే తీపికలై విరిసే కోరికలు/మనతో జతై సాగుతుంటే...ఓ అడుగే అలై పొంగుతుంది/ చుట్టూ ఇంకా రేయున్నా.. అంతా కాంతే చూస్తున్నా/ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ...రెక్కలు విప్పుకు ఎగిరే కళ్లు..దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే/ఆపగలవా చీకట్లు.. కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాలా కేళి..చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి/యమునా తీరాల కథ వినిపించేలా..రాధా మాధవులా జత కనిపించేలా పాడని వెన్నెల్లో ఈ వేళ/ఓ చెవిలో సన్నాయి రాగంలా../కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా/లాహిరి లాహిరి లాహిరి తరంగాలా రాత్రి ఏటిని ఈదే వేళా..జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి/ఊపిరే ఉల్లాసంగా తుల్లి ఓ చూపదా వసంతాల కేళి..ఊపిరే ఉల్లాసంగా తుల్లి/చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి...ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి...

ఉదయించిన సూర్యుడినడిగా.. 
చిత్రం:కలుసుకోవాలని 
సంగీతం – గానం – సాహిత్యం:  దేవిశ్రీ ప్రసాద్‌ 
హే.. ఉదయించిన సూర్యుడినడిగా.. కనిపించని దేవుడినడిగా.. నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ / చలిపెంచిన చీకటినడిగా.. చిగురించిన చంద్రుడినడిగా.. విరబూసిన వెన్నెలనడిగా.. నువ్వెక్కడనీ / చిక్కవే హే ఓ చెలి.. నువ్వెక్కడే నా జాబిలి / ఇక్కడే హే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే / వెచ్చని నీ కౌగిలి.. చిత్రాలు చేసెనే చెక్కిలి.. ఇప్పుడు ఓ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే / 
మనసు అంతా నీ రూపం.. నా ప్రాణమంతా నీకోసం / నువ్వెక్కడెక్కడని వెతికి వెతికి అలిసిపోయే పాపం / నీ జాడ తెలిసిన ఆ నిమిషం.. అహ అంతులేని సంతోషం / ఈ లోకం అంత నా సొంతమిది ఇది ప్రేమ ఇంద్రజాలం / అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే / కలల నుండి ఓ నిజమై రావే.. నన్ను చేరవే / హోయ్‌.. ప్రేమ పాటకు పల్లవి నువ్వే.. గుండె చప్పుడికి తాళం నువ్వే.. ఎదను మీటి సుస్వరమైనావే నన్ను చేరవే / ఉదయించిన సూర్యుడినడిగా......నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది / నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోందే / కాస్త దూరమే కదా మన మధ్య వచ్చి వాలింది.. దూరాన్ని తరిమివేసే ఘడియ మన దరికి చేరుకుంది / ఏమి మాయవో ఏమో కానీ.. నువ్వు మాత్రమే నా ప్రాణమనీ.. నువ్వు ఉన్న నా మనసంటోందే నిన్ను రమ్మనీ / హేయ్‌ నువు ఎక్కడున్నావోగానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేను లేను అని నీకు తెలుపనీ / ఉదయించిన సూర్యుడినడిగా......  

చూపుల్తో గుచ్చి గుచ్చి... 
చిత్రం: ఇడియట్‌ సంగీతం: చక్రి
గానం: శంకర్‌ మహదేవన్‌
సాహిత్యం: కందికొండ
చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే మెరేహాయ్‌.. /గుండెల్ని గుల్ల చేసి జారకే మెరేహాయ్‌/నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్నైపోయానే/నీ కళ్లు పేలిపోను చూడవే మెరేహాయ్‌/నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్‌ మైకమే/ఏదోలా కొత్తగా ఉంది లోకమే హయ్‌ లోకమే/నిలువెల్లా నీరైపోయే దేహమే çహాయ్‌ దేహమే/లైఫంతా అయిపోయింది భారమే హాయ్‌/నీ అందం అడవైపోను..చూడవే  మెరేహాయ్‌ /ఓలల్లా.../నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్‌ హృదయమే/ నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్‌ నిమిషమే/సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్‌ స్వర్గమే/ఛీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్‌/
నీ ఈడు బీడైపోను చూడవే మెరేహాయ్‌/ఓలల్లా ../చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే మెరేహాయ్‌/గుండెల్ని గుల్ల చేసి జారకే మెరేహాయ్‌...

వెన్నెల్లో హాయ్‌ హాయ్‌... 
చిత్రం: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
సంగీతం– గానం: చక్రి
సాహిత్యం: సాయి శ్రీహర్ష
వెన్నెల్లో హాయ్‌ హాయ్‌..మల్లెల్లో హాయ్‌ హాయ్‌ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్‌ హాయ్‌..ట్రంపెట్లో హాయ్‌ హాయ్‌ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్‌... ఆగస్ట్‌లో వాన హాయ్‌/జనవరిలో మంచు హాయ్‌ హాయ్‌ రామా హాయ్‌/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి/కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా..సుధ చిందేనా/కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా/తనను ఇక ఎల్లాగైనా కళ్లారా నే చూడాలి/పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి/మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన/వదల తరమా మదికి వశమా చిలిపి తనమా/చిత్రమైన బంధమాయె అంతలోన../అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా/వెన్నెల్లో హాయ్‌ హాయ్‌.../మల్లెల్లో హాయ్‌ హాయ్‌ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్‌ హాయ్‌..ట్రంపెట్లో హాయ్‌ హాయ్‌ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్‌ ఆగస్ట్‌లో వాన హాయ్‌/జనవరిలో మంచు హాయ్‌ హాయ్‌ రామా హాయ్‌/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి/గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి/మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి/అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే/స్పెషలు మనిషైనా కూడా మనకేముంది మామూలే/కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస/మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా/మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది.. ఎంత ఎంత వింతగున్నదీ/మల్లెల్లో హాయ్‌ హాయ్‌ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్‌ హాయ్‌..ట్రంపెట్లో హాయ్‌ హాయ్‌ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్‌ ఆగస్ట్‌లో వాన హాయ్‌/జనవరిలో మంచు హాయ్‌ హాయ్‌ రామా హాయ్‌/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి...

దాయి దాయి దామ్మా... 
చిత్రం: ఇంద్ర
సంగీతం: మణిశర్మ
గానం: కె.కె, మహాలక్ష్మి అయ్యర్‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ/నీపై మనసైందమ్మా నా నిండు చందమామ/ఒహూ..ఒహూ.. ఒళ్లో వాలుమా...ఒహూ..ఒహూ.. వయసే ఏలుమా/నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ/తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా/హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ/నీపై మనసైందమ్మా నా నిండు చందమామ/టకటకమంటూ తలపును తట్టితికమకపెట్టే... లకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా/నిలబడమంటూ నడుముని పట్ట కితకితపెట్టే... మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా/కేరింతలాడుతు కవ్వించలేదా.. కాదంటే ఇప్పుడు తప్పేదెలా.. అరె కాదంటే ఇప్పుడు తప్పేదెలా/నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ ఆపేదెలా..అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా/ఒహూ..ఒహూ.. కోరిందే కదాఒహూ..ఒహూ.. మరే ఇందిర/మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంతా చేదా/వ్యవహారం శ్రుతిమించే సుకుమారి బెదిరిపోదా/హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే.. పాప గమనించవే మా కొంప మునిగిపోయే/ పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా... సొగసుల బరువా ఓ తుంటరి మగువా/నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడలేవా..తగు జతకావ నా వరసై పోవా /అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియా రానీయవా..ఆ కళ్యాణ ఘడియా రానీయవా/అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శ్రుతిమించవా..నీ హితబోధలాపి శ్రుతిమించవా/ఒహూ..ఒహూ.. వాటం వారెవా ఒహూ..ఒహూ.. ఒళ్లోవాలవా/అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా..సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన/హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్లు చెదిరిపోయే/అయినా అది కూడా ఏదో కొత్త కొంటె హాయే..

రాను రానంటూనే... 
చిత్రం: జయం
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
గానం: ఆర్‌.పి.పట్నాయక్, ఉష
సాహిత్యం: కులశేఖర్‌
ఏమైందిరా.. బాధగా ఉంది..నాకు లేని బాధ నీకెందుకురా/నీ బాధ.. నా బాధ కాదా..ఎహె రాయే.../హబ్బబ్బబా... రాను రాను ..నాను రాను కుదరదయో../వద్దు వద్దు మీద మీదా పడకురయ్యో../
సిగ్గు సిగ్గు.. సిన్నకోకా లాగకయ్యో../రాను రానంటూనే సిన్నదో సిన్నదో..రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో..తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది/పచ్చిపచ్చివంటూనే పిల్లదో పిల్లదో..పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది/రాను రానంటూనే సిన్నదో సిన్నదో...రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/ఏం పండు.. తీసుకొచ్చిందిరా అబ్బాయ్‌../యాపిలు పండు.. నారింజ పండు..బత్తాయి పండు.. బొప్పాయి పండు..అనస పండు.. పనస పండు..నిమ్మ పండు... దానిమ్మ పండు..మామిడి పండు... అరటి పండు../రాను అని, కాదు అని అంతలెసీ మాటలనీ..సంతకొచ్చే సూడవయ్యో సిన్నది/కాదనంటే అవుననిలే లేదనంటే ఉందనిలే..ఆడవారి మాట తీరు వేరులే/అవునా.. మైనా.. మాతో చిందెయ్‌ చిందెయ్‌ బాబోయ్‌.. రానోయ్‌.. నాకసలే సిగ్గోయ్‌ సిగ్గోయ్‌/సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో...సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది/కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో...కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది/హరిలో రంగ హరి.. స్వామి రంగా హరి హరీ/ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి...గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా.../తప్పు అని, గిప్పు అని అందరిలో ముందరనీ..సాటుకొచ్చీ సిందులేసే సిన్నది/తప్పనంటే ఒప్పనిలే ఒప్పనంటే తప్పనిలే..సూటిగానూ సెప్పదయ్యో ఆడదీ/రావే.. పిల్లా.. ఎందుకు మళ్లాగిల్లా..ఎల్లోయ్‌.. ఎల్లోయ్‌.. ఎల్లోయ్‌.. ఎల్లోఎల్లోయ్‌/రాను రానంటూనే సిన్నదో సిన్నదో..రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో...తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది/పచ్చిపచ్చివంటూనే పిల్లదో పిల్లదో..పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది...


దేవుడే దిగివచ్చినా... 
చిత్రం: సంతోషం
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
గానం: కె.కె, ఉష
సాహిత్యం:కులశేఖర్‌
దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా/షాజహాన్‌ తిరిగొచ్చినా తాజ్‌మహల్‌ రాసిచ్చినా/ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా/లోలోన మనసంతా సంతోషమే/ఈ ప్రేమ పులకింత సంతోషమే/లోలోన మనసంతా సంతోషమే/ఈ ప్రేమ పులకింత సంతోషమే/వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం/నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకాశం/ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం/ఎప్పుడూ ముందరెప్పుడూ చూడలేదిలా దీని వాలకం/ప్రేమొస్తే ఇంతేనేమో పాపం/దాసోహం అంటుందేమో వంగీవంగీ ఈ లోకం/కోయిలా నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం/హాయిగా పీల్చు కోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం/నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది/చీటికీ మాటిమాటికీ కొత్తకొత్తగా ఉంది ఏమది/అణువంతే ఉంటుందమ్మా ప్రేమా అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా/దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా.. షాజహాన్‌ తిరిగొచ్చినా తాజ్‌మహల్‌ రాసిచ్చినా/ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా/లోలోన మనసంతా సంతోషమే...ఈ ప్రేమ పులకింత సంతోషమే...

పాటకు ప్రాణం 
చిత్రం: వాసు
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
గానం: స్వర్ణలత, కృష్ణ కుమార్‌
సాహిత్యం: పోతుల రవికిరణ్‌
పాటకు ప్రాణం పల్లవి అయితే... ఓ..ఓ..ఓ.. పల్లవి అయితే../ ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ.. .ఓ.. ఓ.. ఓ..ప్రేయసి కాదా../బ బహామ.. బ బహామ../ ఎవరేమనుకున్న వినదీ ప్రేమా.. బహామ
ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా.. బహామ/కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా... బహామ...నిదురే రాకున్నా నిజమో ప్రేమా... ఓ చెలీ.. సఖీ/ప్రియా యూ లౌ మీ నౌ.. నౌ ఫర్‌ ఎవర్‌ అండ్‌ ఎవర్‌
ప్రియా.. నన్నే/వయసాగక నిను తలచిన... నను మరచిన పదే పదే పరాకులే../నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా అదే అదే ఇదాయెలే/ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుస్తుందే... అది ప్రేమించిందో ఏమో నిన్నే/నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం... ఇన్నాళ్లూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం/ఓ అనుకున్నదే నిజమైనదే ఎదురైనదీ ఇలా.../అనుకోకులే అలవాటులో పొరపాటుగా.. అలా నీ తీరులోనా వెంటే నీవుంటే నీడెల్లే తోడుంటే/పెదవి విప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే యస్సౌనేమో/కుట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా/కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ/పాటకు ప్రాణం పల్లవి అయితే...ఓ..ఓ..ఓ.. పల్లవి అయితే../ ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే... ప్రేమికుడులే... / ఎవరేమనుకున్నా.../ పాటకు ప్రాణం

నలుగురికి నచ్చినది.. 
చిత్రం: టక్కరి దొంగ
సంగీతం: మణిశర్మ
గానం: శంకర్‌ మహదేవన్‌
సాహిత్యం: చంద్రబోస్‌
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/పొగరని అందరు అన్నా... అది మాత్రం నా నైజం/తెగువని కొందరు అన్నా... అది నాలో మేనరిజం/నిండు చందురుడు ఒకవైపు... చుక్కలు ఒకవైపు/నేను ఒక్కడిని ఒకవైçపు.. లోకం ఒకవైపు/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/నువ్వు నిలబడి నీళ్లు తాగడం నథింగ్‌ స్పెషల్‌/పరుగులెత్తుతూ పాలు తాగడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్‌ స్పెషల్‌/అప్పుడప్పుడు తప్పు చెప్పడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/లేనివాడికి దానమివ్వడం నథింగ్‌ స్పెషల్‌/ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్‌ స్పెషల్‌/ఉన్నవాడిది దోచుకెళ్లడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/బుద్ధిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్‌ స్పెషల్‌...పోకిరోడిలా పేరుకెక్కడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/రాజమార్గమున ముందుకెళ్లడం నథింగ్‌ స్పెషల్‌...దొడ్డిదారిలో దూసుకెళ్లడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్‌ స్పెషల్‌..బాధ కలిగినా నవ్వుతుండడం సమ్‌థింగ్‌ స్పెషల్‌/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం..తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం/నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు..నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

తూనీగ తూనీగ... 
చిత్రం: మనసంతా నువ్వే
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
గానం: ఉష, సంజీవని
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/ దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా/ఆ వంకా ఈ వంకా.. తిరిగావే ఎంచక్కా/ ఇంకానా చాలింకా.. ఇంతేగా నీ రెక్క/ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా/తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/దోసిట్లో ఒక్కో చుక్కా.. పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలకలుగా/వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా/ సూర్యుణ్నే కరిగిస్తాగా చినుకులుగా...సూర్చుడు ఏడి నీతో ఆడి...చందమామ అయిపోయాడుగా/ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్లి...తిరిగొచ్చే దారిని ఎప్పుడూ మరిచిపోవెలా/ఓసారి అటు వైపెళ్తుంది... మళ్లీ ఇటు వైపొస్తుంది/ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా/కూ కూ బండి మా ఊరుంది... ఉండిపోవె మాతోపాటుగా.../తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/ దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా/ఆ వంకా ఈ వంకా.. తిరిగావే ఎంచక్కా/ ఇంకానా చాలింకా.. ఇంతేగా నీ రెక్క/ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా/తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా...

కనులు తెరిచినా... 
చిత్రం: ఆనందం 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గానం: మల్లికార్జున్, సుమంగళి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ఎదుటే ఎప్పుడో తిరిగే వెలుగా... ఇదిగో ఇప్పుడే చూశా సరిగా/ఇన్నాళ్లూ నేనున్నది నడి రేయి నిదురలోన/అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా/కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/పెదవుల్లో ఈ దరహాసం... నీకోసం పూసింది/నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది/ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది/అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది/దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది... కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది/ నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది.. నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని/ కనులు తెరిచినా కనులు మూసినీ కలలు ఆగవేలా/ నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది/ ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది/నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది/ నాక్కూడా ఈ కలవరమిప్పుడే పరిచయమయ్యింది/ అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావె.. నేనే ఇక లేనట్టు నీలో కరిగించావె/ప్రేమ ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది... నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది/కనులు తెరిచినా కనులు మూసినీ కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా.. ఇదిగో ఇప్పుడో చూశా సరిగా/ఇన్నాళ్లూ నేనున్నది నడి రేయి నిదురలోన/అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా...

ఎక్కడో పుట్టి...
చిత్రం: స్టూడెంట్‌ నెం.1
సంగీతం – గానం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్‌
ఓ మై డియర్‌ గర్ల్స్‌ డియర్‌ బాయ్స్‌/డియర్‌ మేడమ్స్‌ గురుబ్రహ్మలారా/ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము/చదువులమ్మ చెట్టునీడలో/వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్లిపోతున్నామూ... చిలిపితనపు చివరి మలపులో/వి మిస్‌ ఆల్‌ ది ఫన్‌/వి మిస్‌ ఆల్‌ ది జాయ్‌/వి మిస్‌ యూ/నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలు...సైన్స్‌ ల్యాబ్‌లోన షీలాపై చల్లిన ఇంకు చుక్కలు/ఫస్ట్‌ బెంచీలోన మున్నీపై వేసిన పేపరు ఫ్లైటులు...రాధ జడలో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు/రాజేశు ఇచ్చిన రోజాపువ్వులు.. శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు/కైలాసు కూసిన కాకి కూతలు.. కల్యాణి పేల్చిన లెంపకాయలు/మరపురాని తిరిగిరాని గుర్తులండి.. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి/అంత పెద్ద మాటలొద్దు ఊరుకొండి.. ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండి/వి మిస్‌ ఆల్‌ ది ఫన్‌/వి మిస్‌ ఆల్‌ ది జాయ్‌/వి మిస్‌ యూ/బోటనీ మాస్టారి బోడిగుండుపైన బోలెడు జోకులు/రాగిని మేడమ్‌ రూపురేఖపైన గ్రూపు సాంగులు/సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు/టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు/బ్లాక్‌బోర్డుపైన గ్రీకు బొమ్మలు సెల్‌ఫోనుల్లోన సిల్లీ న్యూసులు/బాతురూముల్లోన భావ కవితలు... క్లాసురూముల్లోన కుప్పి గంతులు/మరపురాని తిరిగిరాని గుర్తులండి... మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి/మనకు మనకు క్షమాపణలు ఎందుకండి... మీ వయసులోన మేం కూడా ఇంతేనండి/వి మిస్‌ ఆల్‌ ది ఫన్‌/వి మిస్‌ ఆల్‌ ది జాయ్‌/వి మిస్‌ యూ

 గాజువాక పిల్లా...
చిత్రం: నువ్వు నేను 
సంగీతం–గానం: ఆర్‌.పి.పట్నాయక్‌ 
సాహిత్యం: కులశేఖర్‌
గాజువాక పిల్లా.. మేం గాజులోళ్లం గాదా/ గాజువాక పిల్లా మేం గాజులోళ్లం గాదా/ నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా/ గాజువాకే పిల్లా మాది గాజులోళ్లమే పిల్లా మేము/ సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం గాదా/ సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం గాదా/ నీ వీపు సూపలేదా... మా సబ్బు రుద్ద లేదా/ సబ్బవరమే పిల్లా మాది... సబ్బులోళ్లమే పిల్లా మేము/సిరిపురం పిల్లా మేం సీరలోళ్లం గాదా/ సిరిపురం పిల్లా మేం సీరలోళ్లం గాదా/ నీ సీర ఇప్పలేదా...మా సీర సుట్టలేదా/ సిరిపురమే పిల్లా మాది... సీరలోళ్లమే పిల్లా మేము/మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్లం కాదా/ మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్లం గాదా/ నీ కాలు సాపలేదా...మా మువ్వ కట్టలేదా/ మువ్వలపాలెమే పిల్లా మాది... మువ్వలోళ్లమే పిల్లా మేము...

దేవుడు వరమందిస్తే... 
చిత్రం: 6 టీన్స్‌
సంగీతం: ఘంటాడి కృష్ణ 
గానం: కుమార్‌ సాను 
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే (2)/ కాశ్మీరులో కనబడుతుందా.. నీ నడకల్లోని అందం / తాజుమహలుకైనా ఉందా.. నీ నగవుల్లోని చందం / నా ఊపిరి చిరునామా నువ్వే / దేవుడు వరమందిస్తే...మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే.. మాటైనా వినకుండా నిన్ను చేరమంటోందే (2)/ నిను మేఘాన ఒక బొమ్మ గావించగా.. నే మలిచాను హరివిల్లునే కుంచెగా / ఈ చిరుగాలితో చెప్పనా.. నీ మది నిండా నేనుండగా / దేవుడు వరమందిస్తే...ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా.. కొంగు ముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా (2) / నా కలలన్నీ నీ కనులు చూడాలని.. బతిమాలాను నీ కంటిలో పాపని / మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమని / దేవుడు వరమందిస్తే...

అమ్మాయే సన్నగా...
చిత్రం: ఖుషి 
సంగీతం: మణిశర్మ
గానం: ఉదిత్‌ నారాయణ్, కవిత కృష్ణమూర్తి
సాహిత్యం: చంద్రబోస్‌
అమ్మాయే సన్నగా...అర నవ్వే నవ్వగా..మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే/అబ్బాయే సూటిగా.. కన్నెత్తీ చూడగా... ఆ వాడి చూపులకీ మంచైన మరిగేలే/ఆ నవ్వులు ఈ చూపులు... ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే/అమ్మాయే సన్నగా... అర నవ్వే నవ్వగా... మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే/ప్రేమలు పుట్టే వేళ... పగలంతా రేయేలే/ ప్రేమలు పండే వేళ... జగమంతా జాతరలే/ప్రేమే తోడుంటే... పామైనా తాడేలే/ప్రేమే వెంటుంటే... రాౖయెనా పరుపేలే/ నీ ఒంట్లో ముచ్చెమటైనా... నా పాలిట పన్నీరే/ నువ్విచ్చే పచ్చిమిర్చైనా...నా నోటికి నారింజే/ ఈ వయసులో ఈ వరసలో... ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే/నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం... నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం/ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం... ఒలికే నీ వలపే చేయించే తలస్నానం/ ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం/ మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవికిరణం/ పులకింతలే మొలకెత్తగా... పులకింతలే మొలకెత్తగా... ఇది వలపుల వ్యవసాయం/అమ్మాయే సన్నగా... అర నవ్వే నవ్వగా... మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే/అబ్బాయే సూటిగా... కన్నెత్తీ చూడగా... ఆ వాడి చూపులకీ మంచైన మరిగేలే/ఆ నవ్వులు ఈ చూపులు... ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అలనాటి రామచంద్రుడు...
చిత్రం: మురారి 
సంగీతం: మణిశర్మ
గానం: జిక్కి, సునీత, సంధ్య
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి/ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి/అనిపించే అరుదైనా అబ్బాయికి మనువండి/తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన/శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన/అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి/చందమామ చందమామ/ కిందికి చూడమ్మా/ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా/వెన్నెలమ్మా వెన్నెలమ్మా/ వన్నెలు చాలమ్మా/మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మా/పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు/పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు/ నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు/ ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు/ అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన/కలలకు దొరకని కళగల జంటని పది మంది చూడండి/ తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి/సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా/ విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన/గౌరీ శంకరులేకమైన సుముహుర్తమల్లే ఉన్నా/ మరగలేదు మన్మథుని ఒళ్లు ఈ చల్లని సమయాన/ దేవుళ్ల పెళ్లి వేడుకలైనా/ ఇంత ఘనంగా జరిగేనా/ ఆ.. ఆ../ ఆ.. ఆ.. ఆ../ దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా/ అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి/తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి

అనగనగా ఆకాశం ఉందీ... 
చిత్రం: నువ్వే కావాలి 
సంగీతం: కోటి
గానం: చిత్ర, జయచంద్రన్‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది/ మేఘం వెనుక రాగం ఉంది...రాగం నింగిని కరిగించింది/ కరిగే నింగి చినుకయ్యింది... చినుకే చిటపట పాటైయ్యింది/ చిటపట పాటే తాకే నేల.. చిలకలు వాలే చెటై్టయ్యింది/నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి/ఊగే కొమ్మల్లోన... చిరుగాలి కవ్వాలి.. పాడి కచ్చేరి చేసే వేళల్లో/గుండెల గుమ్మంలోన... సరదాలే సయ్యాటలు ఆడి తాలాలే వేసే వేళల్లో/కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా... కవ్వింతగా ... /ఆఆ..ఆఆ../నీ చెలిమే చిటికేసి... నను పిలిచెయ్‌ నీకేసి/నీ చెలిమే చిటికేసి... నను పిలిచెయ్‌ నీకేసి/నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేశా పరుగులు తీసి/నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి/చుక్కల లోకం చుట్టూ... తిరగాలి అనుకుంటూ... ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో/నేనున్నా రమ్మంటూ... ఓ తార నా కోసం వేచి.. సావాసం పంచే సమయంలో/నూరేళ్లకీ సరిపోయే ఆశల్ని పండించగా... ఆ.. ఆ../ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి...అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే/ నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/ రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి

కలిసుంటే కలదు సుఖం... 
చిత్రం:కలిసుందాం రా 
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌
సాహిత్యం: వేటూరి 
గానం: రాజేశ్‌ 
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసేఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే / హలో ఆమని చలో ప్రేమనీ / వసంతాలిలా ప్రతీరోజు వస్తూ ఉంటే చలీ కేకలా చెలే కోకిలా / నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం / వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం / ప్రేమలన్ని ఒకసారే పెనేసాయి ఈ ఇంటా / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటంఒకే ఈడుగా ఎదే జోడుకడుతూ ఉంటే / అదే ముచ్చటా కథే ముద్దటా / తరం మారినా స్వరం మారనీ ప్రేమ / స్వరాగానికే వరం ఐనదీ / పాటలకే అందనిది పడుచుల పల్లవిలే /  చాటులలో మాటులలో సాగిన అల్లరిలే / పాల పొంగు కోపాలో / పైట చెంగు తాపాలో / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి

మరిన్ని వార్తలు