ఈ మెషిన్‌ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ తయారీ..

29 Oct, 2023 09:02 IST|Sakshi

క్లైమేట్‌తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్‌క్రీమ్‌ ఎవర్‌గ్రీన్‌!  అలాంటి ఐస్‌క్రీమ్‌ లవర్స్‌కి ఈ మెషిన్‌ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్‌ ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్‌ ఫంక్షన్స్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్‌ లేడల్‌ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్‌తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్‌క్రీమ్‌ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్‌పరెంట్‌ మూత ఉంటుంది. ఈ మేకర్‌ని క్లీన్‌ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. 

(చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! )

మరిన్ని వార్తలు