రోబోలతో పెళ్లిళ్లు జరుగుతాయట!

1 Sep, 2015 00:04 IST|Sakshi
రోబోలతో పెళ్లిళ్లు జరుగుతాయట!

పరిపరి  శోధన
 
ఇదేమీ బ్రహ్మంగారి కాలజ్ఞానం కాదు గానీ, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిష్ట్ వర్సిటీకి చెందిన డేవిడ్ లెవీ అనే పరిశోధకుడు ఇదే మాట చెబుతున్నాడు. భవిష్యత్తులో మనుషులు రోబోలను పెళ్లాడుతారని, 2050 నాటికి చాలా దేశాలు రోబోలతో పెళ్లిళ్లను చట్టబద్ధం కూడా చేస్తాయని అంటున్నాడు.

ప్రపంచంలో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రమే రోబోలతో పెళ్లిళ్లను చట్టబద్ధం చేసే తొలి రాష్ట్రమవుతుందని కూడా చెబుతున్నాడు. ఇతగాడు ఇటీవలే ‘రోబోలూ-మానవ సంబంధాలు’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి, పీహెచ్‌డీ కూడా పొందాడు. అలాగే, భవిష్యత్తులో రోబోల ప్రేమ కథలు, శృంగార కథలు సాహిత్యాన్ని ఏలుతాయని కూడా ఈ అధునికానంతర కాలజ్ఞాని సెలవిస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు