ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

29 Nov, 2015 23:35 IST|Sakshi
ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

కేప్టెన్ అమెరికా : సివిల్ వార్ - ట్రైలర్
నిడివి 2 ని. 26 సె.
హిట్స్ : 2,90,51,567

మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ ‘కేప్టెన్ అమెరికా’ పాత్ర చుట్టూ అల్లిన కథతో తయారౌతున్న అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘కేప్టెన్ అమెరికా: సివిల్ వార్’ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. వచ్చే ఏడాది మే 6న త్రీడీలో, ఐమాక్స్ త్రీడీలో విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తున్నవారు.. ‘మరీ ఇంత నిరీక్షణను తాళలేకపోతున్నాం’ అని కామెంట్స్ పెడుతున్నారు! కేప్టెన్ అమెరికా (క్రిస్ ఈవాన్స్), ఐరన్ మేన్ (రాబర్ట్ డౌనీ జూనియర్) మధ్య జరిగే వాగ్వాదం.. ‘అవెంజర్స్’ బృందాన్ని అయోమయంలోకి నెట్టడంతో కథ మొదలౌతుంది.

 
మై లైఫ్ ఆఫ్టర్ 44 ఇయర్స్ ఇన్ ప్రిజన్
నిడివి : 6 ని. 21 సె.
హిట్స్ : 67,76,964

 ఒటిస్ జాన్సన్ (అమెరికన్ బ్లాక్) తన 25వ ఏట జైలుకు వెళ్లాడు. 69వ యేట విడుదలయ్యాడు. జైలు నుంచి ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక జరిగిన మార్పులు చూసి అశ్చర్యపోయాడు. అబ్బుర పడ్డాడు. ఆహ్లాదం చెందాడు. అప్పటికీ ఇప్పటికీ జీవన విధానాల్లో కనిపించిన వ్యత్యాసం, అందుకు కారణం అయిన టెక్నాలజీ ఆయనకు పునర్జన్మను ఇచ్చినట్లుగా అనిపించిందట. ఆ వివరాలను, అలనాటి జ్ఞాపకాలను ఆయన ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అల్ జెరీరా ఇంగ్లిష్ చానల్ ఇందుకు ఆయనకు సహకరించింది.
 
లేడీ స్టీల్స్ ఫ్రమ్ కిడ్ : బ్లాక్ ఫ్రైడే
నిడివి : 24 సె.
హిట్స్ : 46,34,455

నవంబర్ నాలుగో గురువారం యు.ఎస్.లో ‘థ్యాంక్స్ గివింగ్ డే’. ఆ తర్వాతి రోజు వచ్చేదే ‘బ్లాక్ ఫైడే’. బ్లాక్ ఫ్రైడే నుంచి క్రిస్మస్ షాపింగ్ మొదలౌతుంది. తొలిరోజు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్‌లు ఇస్తాయి. ఉచిత బహుమతులూ పంచిపెడతాయి. వాటి కోసం అంతా ఒకరిమీద ఒకరు పడిపోతుంటారు. ఈ వీడియోలో ఒక మహిళ ఒక చిన్నారి చేతిలోంచి వెజ్జీ స్టీమర్‌ని లాక్కోవడం కనిపిస్తుంది. ఇది యు.ఎస్.లోని ఓ స్టోర్‌లో పనిచేసే వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి అప్‌లోడ్ చేశాడు.  దీనిపై యూట్యూబ్ వీక్షకులు ‘షేమ్ షేమ్’ అంటూ స్పందిస్తున్నారు.

మై రహూ యా న రహూ
నిడివి : 6 ని. 46 సె.
హిట్స్ : 33,75,575

టి సీరీస్ విడుదల చేసిన బ్రాండ్ న్యూ సింగిల్ ఫుల్ వీడియో సాంగ్ ఇది. ఎమ్రాన్ హష్మీ, ఈషా గుప్తా మధ్య నేపథ్యంగా సాగుతుంది. అమిత్ శర్మ డెరైక్ట్ చేశారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు. అమాల్ మాలిక్ స్వరపరిచారు. రష్మీ విరాగ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ‘నేను జీవించి ఉన్నా, లేకున్నా.. నువ్వు నాలో ఏదో ఒక మూల తప్పకుండా ఉంటావు. నా చివరి క్షణాలు ఆసన్నమైనప్పుడు నా కలలలోకి వస్తూ ఉంటావు‘ అని మొదలయ్యే ఈ హృద్య గీతం... ‘నేను నీకు కనిపించినా, కనిపించకున్నా నువ్వు నన్ను అనుభూతి చెందుతూనే ఉంటావు’ అని ముగుస్తుంది.
 

ట్రంప్ మాక్స్ రిపోర్టర్
నిడివి : 40 సె.
హిట్స్ : 21,12,351

అమెరికా అధ్యక్ష  పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ... న్యూ యార్క్ టైమ్స్ రిపోర్టర్  కోవెలెస్కీ అంగ వైకల్యాన్ని తన అనుకరణతో అవహేళన చేయడం ఇందులో కనిపిస్తుంది. 9/11 దాడుల అనంతరం న్యూ జెర్సీలోని ‘వేలాది’ మంది ముస్లింలు వేడుకలు చేసుకున్నారు అనే వివాదాస్పద విషయాన్ని సమర్థించుకోడానికి ట్రంప్ 2001 నాటి కోవెలిఎస్కీ ఆర్టికిల్‌ను అడ్డుపెట్టుకున్నారు. అయితే అందులో నేను అలా రాయలేదు అని కోవెలస్కీ చెప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేక ఇలా బహిరంగంగా కోవెలెస్కీని అనుకరించారు.    
 
మన్‌మా ఎమోషన్ జాగే : దిల్‌వాలే
నిడివి : 3 ని. 11 సె.
హిట్స్ : 19,98,375

‘దిల్‌వాలే’ చిత్రంలోని ఇంకో సాంగ్‌ని రెండు రోజుల క్రితమే సోనీ మ్యూజిక్ అప్‌లోడ్ చేసింది. వరుణ్ ధావన్, కృతీ సానూన్ మధ్య ఫన్నీగా హిప్ హాప్ స్టెయిల్‌లో ఈ సాంగ్ ఉంది. ప్రీతమ్ ఫన్ మ్యూజిక్, అమిత్ భట్టాచార్య ఫన్నీ లిరిక్స్, అమిత్ మిశ్రా, అనుష్కా మన్‌చందా, అంతరా మిత్రా ఫన్నీ వాయిసెస్ ‘మన్‌మా ఎమోషన్ జాగే’ సాంగ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ తె చ్చాయి. రోహిత్ శెట్టి డెరైక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని గౌరీఖాన్ నిర్మించారు. డిసెంబర్ 18 న విడుదలౌతోంది. ఇప్పటికి వరకు మొత్తం మూడు ‘దిల్‌వాలే’ పాటలు యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యాయి.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు