‘టాపు’ లేచిపోద్దట!

28 Dec, 2014 03:45 IST|Sakshi
‘టాపు’ లేచిపోద్దట!

హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట. తన రాబోయే చిత్రం ‘రిగ్రెషన్’లో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా కనిపించనుందట. ఈ వార్త నెట్టింట్లో లావాలా పాకేసి పురుష పుంగవుల బాడీలు హీటెక్కిస్తోంది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదంటూ అప్పుడే అక్కసు వెళ్లబోసుకొంటున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఈ హ్యారీ పోటర్ స్టార్ గతంలో కూడా అందాల ప్రదర్శనలో కాస్త వెసులుబాటు ఇచ్చినా... అది అంతగా కిక్కెంచలేదనేది వారి అసలు బాధ. ఏదిఏమైనా... రిగ్రెషన్‌లో ‘ట్రైనింగ్ డే’ నటుడు ఇథాన్ హాకె అమ్మడితో జతకడుతున్నాడట.
 

మరిన్ని వార్తలు