నైస్ స్లయిసర్!

27 Jun, 2013 03:49 IST|Sakshi
నైస్ స్లయిసర్!
ఒక్క క్షణంలో ఉల్లిపాయ... సన్నని తరుగైపోతుంది. టొమాటో రసం కారకుండా, ఏ మాత్రం నలగకుండా నాలుగు ముక్కలవుతుంది. ఇవన్నీ ఎగ్జిబిషన్స్‌లో చూసి ముచ్చటపడి ఆ స్లయిసర్‌ను కొని ఇంటికి తెచ్చి వాడితే అంత షార్ప్‌గా పని చేసేవి కాదు. ఎందుకంటే వాటిలో ఎక్కువగా సెకండ్స్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఉంటాయి. నాణ్యమైన స్టీల్‌తో, పదునైన బ్లేడ్‌లతో తయారైన స్లయిసర్‌లు ఎగ్జిబిషన్ స్లయిసర్‌లలా మోసం చేయవు. 
 
అన్నీ బ్రాండెడ్‌వే. కాబట్టి ధైర్యం చేసి కొనుక్కోవచ్చు. బంగాళదుంపని క్యూబ్స్‌గా తరుగుతుంది ఒక రకం స్లయిసర్, స్ట్రాబెర్రీని స్లయిస్ చేస్తుంది మరో స్లయిసర్. కాంటినెంటల్ హోటళ్లలో ఎప్పుడైనా గమనించారా! ఆవిరి మీద ఉడికించిన మాంసాన్ని పలుచగా చపాతీల్లా చుట్టి ఉంచుతారు. ఇంత పలుచగా, ఇలా సమంగా కత్తిరించడం ఎంత పదునైనా చాకుకీ సాధ్యం కాదని ఆశ్చర్యం కలుగుతుంది కూడ. దానికి సమాధానంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీట్ స్లయిసర్.
మరిన్ని వార్తలు