ఉత్తరాంధ్ర శోభ- పోలవరం, సుజల స్రవంతి

9 Apr, 2015 02:40 IST|Sakshi
ఇమామ్

 సందర్భం
 రాష్ట్ర విభజన పెను సవా ళ్లను మిగిల్చింది. ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి, రా యలసీమలో 4, ఉత్తరాం ధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజె క్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే పూర్తి చేయడం ఇందులో భాగ మే. కానీ జరుగుతున్న పరిణామాలు ప్రజానీకాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

 పోలవరంతో ప్రయోజనాలు ఎన్నో: గోదావరి డెల్టా ఆయకట్టులో 10.5 లక్షల ఎకరాలకు 2 పంట లకు నీరు అందుతుంది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలలో కొత్తసాగుకు నీరందుతుంది. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని తరలించి 13 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణకు దోహ దం చేయవచ్చు. విశాఖపట్నం ఇంకా 540 గ్రామా లకు తాగు, పారిశ్రామిక అవసరాలకు 25 టీఎంసీల నీరు ఇవ్వవచ్చు. 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి చేర్చడం ద్వారా, శ్రీశైలం నుంచి నీటి విడు దలను తగ్గించి, ఆదా అయిన 45 టీఎంసీల నీటిని తెలంగాణ, రాయలసీమలకు వినియోగించుకోవచ్చు. ఇంకా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 308 టీఎంసీలు మనం వినియోగంలోకి తీసుకురా వచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో 2.57 లక్షల ఆయ కట్టుకు, విశాఖజిల్లాలో 2.67 ఎకరాల ఆయకట్టుకు నీటిని; కాకినాడ, విశాఖలకు  పోలవరం ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుంది.

 ఉత్తరాంధ్ర జిల్లాల సేద్యపు నీటి రంగం అవసరాలకు 7,214 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘సుజల స్రవంతి’ పథకానికి 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  శంకుస్థాపన చేశారు. మొదటి విడ తగా రూ. 50 కోట్ల నిధులు విడుదల చేశారు. టెం డర్లు పిలవడం కూడా జరిగింది. ఆ తరువాత వచ్చి న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ దీనికి తిలోదకాలిచ్చింది. అయినా పోలవరం మనం పేర్కొన్న 7 జిల్లాలకు వరప్రసాదమే. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అం దిస్తుంది. కానీ నేడు చంద్రబాబు పోలవరానికి ఒక గ్రహణంలా మారారు. ఆయన ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని తలకెత్తుకున్నది. ఆయనకు పోలవరం చేపట్టడం ఇష్టంలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం వల్ల కృష్ణానది వైపు ఉన్న ఆయకట్టు, రాయలసీమలకు సేద్యపు నీటి అవసరాలు నిలిచిపోతాయి.

 ఉమ్మడి రాష్ట్రంలో మన వనరులన్నీ హైదరాబాద్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఒక మహానగరంగా అభివృద్ధి అయ్యే లక్షణాలు విశాఖపట్టణానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు పరిశ్రమలను నెల కొల్పి విశాఖను అభివృద్ధి చేయవలసిన సమయం లో పోలవరం ప్రాజెక్టును కనుమరుగు చేయడానికి ప్రయత్నించడం ఉత్తరాంధ్రకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ముఖ్యమంత్రి ఉరుకులూ, పరుగులూ రాజధాని దిశగానే సాగుతున్నాయి. అంటే రాజధాని యోచనను వ్యతిరేకించడం ఇక్కడ ఉద్దేశం కాదు. అభివృద్ధినంతా రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేస్తే ఎంత ముప్పో విభజనతో చూశాం. కాబట్టి  రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా కల్పిం చడానికి చంద్రబాబు కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయకపోవడం పుండు మీద కారం చల్లినట్టే. పోల వరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేపట్టి పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాంతాల అభి వృద్ధికి పునాదులు వేసుకోవచ్చు.

వనరులు ఉన్న ప్పటికీ అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురి కావడం ఎవ రికైనా ఆవేదన కలిగిస్తుంది. దీనినే ఉత్తరాంధ్ర సామాజిక కార్యకర్తలు, మేధావులు, నిపుణులు తీవ్రంగా పరిగణించాలి. ఈ ప్రాంతం పట్ల జరిగిన నిర్లక్ష్యం వల్లనే తీవ్రవాద ఉద్యమాలు ముందుకొ చ్చాయి. సహజ సిద్ధమైన పోరాట సంప్రదాయం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు, చైతన్యవంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజానీకంలో చోటు చేసుకున్న అసంతృప్తిని గమనించి మరో విభ జన ఉద్యమానికి  దోహద ం చేయాలి. ఇప్పుడిప్పుడే గ్రేటర్ రాయలసీమ వాసుల్లో ఇలాంటి భావనే చోటు చేసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ వలెనే మరో ‘గ్రేటర్ రాయలసీమ’ మరో ‘ఉత్తరాంధ్రప్ర దేశ్’ ఉద్యమాలు రాకుండా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు చేపట్టాలి.

 (ఉత్తరాంధ్ర నీటి సమస్యలపై రేపు విశాఖపట్నంలో  విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న సందర్భంగా)
 (వ్యాసకర్త ‘కదలిక ’సంపాదకుడు)

మరిన్ని వార్తలు