తెలుగు బఫెట్

18 Mar, 2015 22:40 IST|Sakshi
తెలుగు బఫెట్

చైనీస్, మొఘలాయ్, పంజాబీ, రాజస్థానీ వంటి మల్టీ కుజిన్స్... రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఇక పిజ్జాలు, బర్గర్‌లు, శాండివిచ్, ఫాస్ట్‌ఫుడ్‌లకు కొదవే లేదు. మరి అచ్చమైన తెలుగు వంటల రుచులు కావాలంటే.. వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి వారి కోసం వెలిసిందే ఈ ‘అబ్సల్యూట్ తెలుగు బఫెట్’ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో...  మామిడి తోరణాలు, గోడలపై బొమ్మలు, పట్టు చీరలతో ముస్తాబు చేసిన డైనింగ్ టేబుల్స్, తలంబ్రాల సీన్...

ఇలా అణువణువునా తెలుగుదనం ఉట్టిపడుతుంది. చూసిన మనసుకు ఆహ్లాదమే కాదు.. ఇక్కడ తిన్నవారికి ఆరోగ్యం కూడా. ఎందుకంటే వంటకాలన్నీ మట్టి కుండల్లో సంప్రదాయ బద్దంగా వండివారుస్తున్నారు. 42 రకాల శాకాహార, మంసాహార రుచులు ఇక్కడ చవులూరిస్తాయి.

రాగి సంగటి ముద్దలు, మామిడికాయ పప్పు, చింతాకు పచ్చడి, నేతి గారెలు, రాజుగారి వెజ్ పలావ్, గోంగూర అన్నం, త్రీజీ రైస్, దానిమ్మ గింజలతో దద్దోజనం, నాటు కోడి కూర, గోంగూర మటన్, పీతల ఇగురు, సొరపొట్టు కూర, పప్పుచారు అన్నం, ఆవకాయ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ డిషెస్‌తో పాటు... సగ్గుబియ్యం పాయసం, గులాబ్ జామూన్, జున్నులాంటి స్వీట్స్ కూడా మీ నోరూరించడం ఖాయం!
- సిరి

>
మరిన్ని వార్తలు