మాట్లాడుకుందాం రా..!

10 Oct, 2014 02:08 IST|Sakshi
మాట్లాడుకుందాం రా..!

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు.. ఇన్‌డెప్త్‌గా ఈ సినిమా డైలాగ్‌లో మానసిక ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్ దొరుకుతుంది. మంచి ఉద్యోగం.. చక్కటి సంపాదన.. కుటుంబం.. ఇన్నీ ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కామన్‌మ్యాన్ నుంచి కరోడ్‌పతి వరకు మనసులోని బాధలకు బందీలైపోతున్నారు. ఎదను తొలిచే బాధను మొహమాటంతోనో.. ధైర్యం చాలకో.. ఇతరులతో పంచుకోకుండా అందరిలో ఉన్నా ఒంటరైపోతున్నారు. నాలుగు మాటలతో మానసిక బలాన్ని తిరిగి పొందొచ్చని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు. ఒత్తిడిని జయించడానికి కౌన్సెలింగ్‌కు మించిన మందు లేదంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా నాలుగు మంచి మాటలు.
- సత్యబాబు
 
 ఒక సమస్య తీవ్రమైన మానసిక క్షోభకు దారితీయడానికి దానిని ఇతరులతో పంచుకోకపోవడమే ప్రధాన కారణం. కుటుంబసభ్యులకో.. దగ్గరి స్నేహితుడి కో.. మీ సమస్యలు చెప్పుకుంటే.. గుండె బరువు కాస్త దిగుతుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్‌లో మనలోని బాధలు చెప్పుకునే వ్యక్తులు కనబడరు. ఒకవేళ చెప్పినా మనల్ని ఎలా అంచనా వేస్తారోనన్న భయంతో చాలా మంది సమస్యలను పెదవి దాటనివ్వడం లేదు. ఏ ఎమోషనైనా షేర్ చేసుకోవడం వల్లే మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు.
 
 రిలేషన్ బ్రేకప్స్..
 చాలా వరకు తీవ్రమైన మానసిక సమస్యలకు కారణం రిలేషన్‌షిప్ మెయింటనెన్సే. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్.. చినికి చినికి గాలివానలా మారి తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి కంపౌండ్‌లోకీ చొరబడి భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతున్నాయి. టీనేజర్స్‌లో లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్‌కు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్‌కు వస్తున్న వారిలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్సే ఉంటున్నారు.
 
 పియర్ ప్రెషర్స్..
 వేగంగా ఎదిగే అవకాశాలున్న ఐటీ వంటి రంగాల్లో పనితో పాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. మిగతావాళ్లు ఎదిగిపోతున్నారన్న కంపారిజన్ పియర్ ప్రెషర్‌కు కారణం అవుతోంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి దశలవారీగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త డెవలప్ అయిన తర్వాత ఎలాంటి టెన్షన్ అయినా అధిగమించే
 శక్తి వస్తుంద ంటున్నారు.
 
 కౌన్సెలింగ్ క్యాప్సుల్...
 మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నగరంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లు వెలిశాయి. అలా
 ఏర్పా టైందే ‘సేవ’ సంస్థ. ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న త్యాగరాజన్ ఈ సంస్థ నెలకొల్పారు. పదహారేళ్లుగా నాలుగు మాటలతో ఎందరికో ఉచితంగా మానసిక బలాన్నిస్తున్నారు. ‘పద్మారావునగర్‌లో మా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మానసిక సమస్యలతో వ్యక్తిగతంగా కలసిన వారికి ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే గాంధీ ఆస్పత్రి వంటి పలు హాస్పిటల్స్‌లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ’ని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు