ఒళ్లంత చల్లంత..

3 Apr, 2015 01:52 IST|Sakshi
ఒళ్లంత చల్లంత..

వేసవి తాపాన్ని తగ్గించే పనిలో ఇంట్లో కూలర్లు.. ఏసీలు.. నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండగా భానుడి భగభగల నుంచి తప్పించుకున్నా.. బయటకు వెళ్లినప్పుడు మాత్రం మండుటెండకు మాడక  తప్పదు. వడగాలికి వాడిపోకుండా కూల్‌గా ఉండేలా మొబైల్ కూలర్‌ను కనుగొన్నాడు మల్కాజిగిరికి చెందిన పోసూరి రవికిరణ్. బస్‌లో, కారులో వెళ్లేటప్పుడు ఈ ట్రావెల్ కూలర్ మీకు చల్లదనాన్ని అందిస్తుంది. అరచేతిలో ఇమిడే బుల్లి కూలర్ లో అరగ్లాస్ నీరు పోస్తే చాలు. బ్యాటరీతో నడిచే ఈ కూలర్‌ను పీవీసీ పైపు, బుల్లి ఫ్యాన్ బ్లేడ్ వంటి ఇతర పరికరాలతో రూపొందించాడు. దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు రూ.150 మాత్రమే.        - అల్వాల్
 

మరిన్ని వార్తలు