వస్తా నీ వెనుకా!

14 Jul, 2014 03:26 IST|Sakshi
వస్తా నీ వెనుకా!

హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ సరదా సన్నివేశంలో ఓ అందాల భామ అలజడి రేపింది. లాస్‌ఏంజెలిస్‌లోని ఇబిజా బీచ్‌లో బిజీ షెడ్యూల్స్‌కు బై చెప్పి ఈ హీరోగారు సేద తీరుతుండగా జరిగిందా ఘటన. అభిమానులు గుమిగూడగా ఫొటోలు తీసుకుంటూ స్మిత్ ఉల్లాసంగా గడుపుతున్నాడు. అప్పుడే మల్లె తీగ లాంటి చిన్నది టాప్‌లెస్‌గా ప్రత్యక్షమైంది. హీరో, అభిమానులు తీసుకుంటున్న ఫొటో ఫ్రేమ్‌ల్లోకి చొరబడింది. అక్కడితో ఆగక హీరోగారి వెంటపడింది. ‘వస్తా నీ వెనుకా’ అంటూ సతాయించింది. స్మిత్ స్పానిష్ వెకెషన్‌లో ఇలా అనుకోని ఘటన చోటుచేసుకుంది.
 
నా ఫోన్ 24/7
మొబైల్ ఫోన్ విలాసం కాదు అవసరం అంటున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌కపూర్. సినిమా షూటింగ్‌లతో రోజంతా బిజీగా ఉండే తనను సేద తీర్చేది సెల్‌ఫోనేనన్నాడు. ‘ఇషాక్‌జాదె’తో తెరంగేట్రం చేసిన బోనీకపూర్ తనయుడు అర్జున్ ‘గండే’, ‘2స్టేట్స్’ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. టెక్నాలజీ చెరుపు కాదని మంచివాళ్ల చేతిలో బాగా ఉపకరిస్తుందని చెప్పాడు. అలాగే సామాజిక బంధాలు, నైపుణ్యాలకు కూడా అది అడ్డంకి కాదన్నాడు. ట్విట్టర్ ద్వారా తను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పాడు అర్జున్‌కపూర్.

మరిన్ని వార్తలు