అండుకొర్రల వంటలు

30 Dec, 2018 01:01 IST|Sakshi

అండు కొర్రల కిచిడీ
కావలసినవి:  పెసర పప్పు – అర కప్పు అండు కొర్రల రవ్వ – ఒక కప్పు ఉప్పు – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – అర కప్పు తరిగిన పచ్చి మిర్చి – 4 అల్లం తురుము – అర టీ స్పూను
వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను తరిగిన టొమాటో – 1 కరివేపాకు – రెండు రెమ్మలు పసుపు – కొద్దిగా నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:  స్టౌ మీద  బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించాలి. గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

అండుకొర్రలు  (Browntop Millet)  నియాసిన్‌ (Niacin)mg (B3)    18.5
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.027
థయామిన్‌  (Thiamine) mg (B1)    3.2
కెరోటిన్‌(Carotene)ug        0
ఐరన్‌ (Iron)mg        0.65
కాల్షియం  (Calcium)g        0.01
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.47
ప్రొటీన్‌ (Protein)g        11.5
ఖనిజాలు(Carbo Hydrate) g    69.37
పిండిపదార్థం  (Fiber) g        12.5
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    5.54

అండు కొర్రల పొంగలి
కావలసినవి: అండు కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పుకొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంతమిరియాల పొడి – పావు టీ స్పూను
జీలకర్ర – ఒక టీ స్పూను, జీడి పప్పులు – 10కరివేపాకు – 2 రెమ్మలు, నెయ్యి/నూనె – తగినంత

తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది.

అండు కొర్రల ఊతప్పం
కావలసినవి: అండు కొర్రలు – పావు కప్పు మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూనుఅల్లం పచ్చిమిర్చి ముద్ద – ఒక టీ స్పూను
ఉప్పు – తగినంత, నూనె – తగినంతటొమాటో తరుగు – 2 టేబుల్‌ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

అండు కొర్రల ఉప్మా
కావలసినవి: అండు కొర్రల రవ్వ – 3 కప్పులు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లుపచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను, మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – 4, క్యారట్‌ తరుగు – పావు కప్పు, టొమాటో తరుగు – పావు కప్పుకరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత

తయారీ: 
స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి (నూనె వేయకూడదు) దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యారట్‌ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’