చంద్రబింబం: ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వరకు

24 Feb, 2014 11:12 IST|Sakshi
చంద్రబింబం: ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. రాజకీయరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)

 రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వారం మధ్యలో ధనవ్యయం.
 
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. రాజకీయరంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో ప్రయాణాలు, రుణాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 అవసరాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. పరిశోధనల్లో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమానంతరం కొంత ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణాలు తీరతాయి. ఇంటిలో శుభకార్యాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదనిపిస్తుంది. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు, వివాదాలు.
 - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 

మరిన్ని వార్తలు