చంద్రబింబం : మార్చి 2 నుండి 8 వరకు

2 Mar, 2014 01:11 IST|Sakshi
చంద్రబింబం : మార్చి 2 నుండి 8 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కళారంగం వారు అనుకోని అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, వాహనాలు కొంటారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయరంగం వారికి పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికరంగం వారికి ప్రభుత్వ సహాయం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక లావాదేవీలు కొంత మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు కొంత తగ్గుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పాతబాకీలు అందుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు.


 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 సన్నిహితులు సహకరిస్తారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు క్రమేపీ అనుకూలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.  ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.  బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో సోదరుల నుంచి ఒత్తిడులు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు.  విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌