నెత్తుటి ముద్ర

2 Jul, 2017 00:38 IST|Sakshi
నెత్తుటి ముద్ర

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘాట్‌ రోడ్డులాంటి రోడ్డు అది. కారు కింద ఎక్కడో పడిపోయి ఉంది. ఆ కారులో ఉన్న రాజేశ్వరి చనిపోయింది. ‘‘ఎలా జరిగింది?’’ రాజేశ్వరి భర్త రాంబాబును అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘ఇక్కడికి దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరాం. ఆమె డ్రైవింగ్‌ చేస్తూ ఉంది. చిన్న విషయంలో గొడవ వచ్చింది.  సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చే సమయానికి గొడవ పెద్దదైంది. భరించడం ఇక నా వల్ల కాలేదు.

సారీ... నేను నీతో పాటు ప్రయాణించలేను. నువ్వు వెళ్లు... అంటూ కారు దిగిపోయాను. వచ్చి కూర్చుంటావా లేదా? అని కోపంగా అరిచింది. ప్లీజ్‌ నువ్వు వెళ్లు... అని నేను నడుస్తుండగానే కారును వేగంగా కొండ దిగువకు పోనిచ్చింది. పెద్ద శబ్దం! నేను ఊహించని పరిణామం ఇది. నేను కిందికి పరుగెత్తుకు వెళ్లాను. అప్పటికే ఆమె చనిపోయి ఉంది’’ బొంగురు గొంతుతో చెప్పాడు రాంబాబు.‘‘నిజంగా ఆమె డ్రైవింగ్‌ చేసిందంటావా?’’ అని ఇన్‌స్పెక్టర్‌ అన్నాడో లేదో కారు దగ్గరికి వెళ్లి నిశితంగా పరిశీలించారు సిబ్బంది.

గేర్‌ నాబ్, స్టీరింగ్‌ వీల్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌ ఉన్నాయి.‘‘ఆమె ఫింగర్‌ ప్రింట్స్‌ కనిపించాయి. సందేహం లేదు. ఆమె డ్రైవింగ్‌ చేసింది. ఇది ఆత్మహత్య’’ అన్నారు పోలీసు సిబ్బందిలో ఒకరు. ఫింగర్‌ ప్రింట్స్‌ గురించి రెండు మూడు సార్లు గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్‌. ఒకటే సమాధానం వినిపించింది.‘‘ఇది ఆత్మహత్య కాదు హత్య’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.కొద్దిసేపట్లోనే ఇన్‌స్పెక్టర్‌ చెప్పింది నిజమని రుజువైంది.రాజేశ్వరిది ఆత్మహత్య కాదని ‘హత్య’ అని ఇన్‌స్పెక్టర్‌కు అనుమానం రావడానికి కారణం ఏమిటి?

జవాబు: కారు బయటే భార్యను హత్య చేసి శవాన్ని కారులో దాచాడు  రాంబాబు. కొండ ప్రాంతంలో ఆమెను డ్రైవరు సీట్లో కూర్చోపెట్టి సీట్‌బెల్ట్‌ కట్టాడు. ఆ తరువాత... ఔట్‌ సైడ్‌ డోర్‌ హ్యాండిల్, సీట్‌బెల్ట్‌–బకెల్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌ తుడిచేశాడు.ఔట్‌ సైడ్‌ డోర్‌ హ్యాండిల్, సీట్‌బెల్ట్‌–బకెల్‌లపై ‘ఫింగర్‌ ప్రింట్స్‌’ లేకపోవడం ఇన్‌స్పెక్టర్‌లో అనుమానాన్ని రేకెత్తించింది.  ఈ అనుమానమే హంతకుడిని పట్టించింది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా