420 అంటే..?

24 May, 2015 00:00 IST|Sakshi
420 అంటే..?

మోసగాళ్లను మన దేశంలో ‘ఫోర్‌ట్వంటీ’అంటుంటాం. బ్రిటిష్ హయాంలోనే 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 420 మోసాన్ని నిర్వచిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ పుణ్యాన మోసగాళ్లకు మన దేశంలో ‘ఫోర్‌ట్వంటీ’లుగా గుర్తింపు వచ్చింది. అమెరికాలో ‘ఫోర్‌ట్వంటీ’ వేరే అర్థంలో వాడుకలో ఉంది. అక్కడ ‘ఫోర్‌ట్వంటీ’ అంటే ఏప్రిల్ 20.

నెల సంఖ్య ముందు, తేదీ సంఖ్య తర్వాత రాసే అమెరికన్ పద్ధతి ప్రకారం (4/20) అది మామూలే కదా అనుకుంటున్నారా..? నిజమే! అయితే, ఈ తేదీకి మరో విశేషం కూడా ఉంది.
 
గంజాయి వినియోగాన్ని నియంత్రించడాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం అమలులోకి తెచ్చిన చట్టం కోడ్ నంబర్ కూడా 420. అయితే ఏప్రిల్ 20 గంజాయి పొగరాయుళ్ల అనధికారిక సెలవు. దాంతో కాలిఫోర్నియాలో ఏటా ఏప్రిల్ 20వ తేదీన గంజాయి పొగరాయుళ్లు గుంపులుగా గుమిగూడి ‘దమ్ మారో దమ్’ అంటూ ఊగి తూగుతుంటారు.

మరిన్ని వార్తలు