కవ్వింత: ఏం చెప్పాడు!

15 Jun, 2014 00:15 IST|Sakshi
కవ్వింత: ఏం చెప్పాడు!

పనివాడు: సార్... మన థియేట ర్లో ఆడుతోన్న సినిమా చూడ్డానికి ఎవరూ రావడం లేదు. ఒక్క టిక్కెట్టు కూడా అమ్ముడవ్వలేదు.
 యజమాని: దానికంత కంగారెందుకు? టిక్కెట్లు ఫ్రీగా పంచిపెట్టు. అందరూ వచ్చాక తలుపులు తాళం వేసెయ్. బయటకు వెళ్లాలంటే రెండొందలు కట్టాలని చెప్పు.  పనివాడు: ఆ...!
 
 అంతే తెలుసు!
 తల్లి: స్వీటీ... ఇంగ్లిష్ ఎగ్జామ్ ఎలా రాశావ్?
 స్వీటీ: బాగా రాశాను మమ్మీ. మీ డాడీ ఏం చేస్తారు అని అడిగితే స్వీపర్ అని రాశాను.
 తల్లి: అదేంటి... మీ డాడీ అసిస్టెంట్ కమిషనర్ కదా?
 స్వీటీ: అవుననుకో. కానీ నాకు అసిస్టెంట్ కమిషనర్ స్పెల్లింగ్ రాదు. అందుకని...!
 
 అలా జరిగిందా?
 సుబ్బు: కడుపునొప్పని డాక్టర్ దగ్గరికెళ్లావ్‌గా, ఏమయ్యింది?
 పండు: ఆ డాక్టర్ ఇంతకుముందు హోటల్ నడిపాడేమోనని అనుమానంగా ఉందిరా?
 సుబ్బు: అదేంటి?
 పండు: ఇంజెక్షన్ చేసి డబ్బులడిగాడు. లేవు అంటే... హాస్పిటల్‌లో ఉన్న టవళ్లు, దుప్పట్లు ఉతికించాడు.
 
 అదెలా సాధ్యం?!
 భర్త: రాత్రి కలలో దేవుడు కనిపించాడు.
 భార్య: అవునా... ఏం కోరుకున్నారు?
 భర్త: నీ బుద్ధిని పదిరెట్లు చేయమని అడిగాను.
 భార్య: పెంచాడా?
 భర్త: సున్నాలకి మల్టిప్లికేషన్ ఉండదు అని మాయమైపోయాడు.

మరిన్ని వార్తలు