కొత్త పుస్తకాలు

5 Oct, 2014 01:36 IST|Sakshi
కొత్త పుస్తకాలు

దుర్వాసమహర్షి ‘ఆర్యాద్విశతి’
 టీక: నాగపూడి కుప్పుస్వామి
 పేజీలు: 172; వెల: 100
 ప్రతులకు: పీపీసీ జోషి, ప్రాచీ పబ్లికేషన్స్, సైబర్ ఇ-పార్క్, సెక్టర్ 2ఎ, అలకాపూర్ టౌన్‌షిప్, పుప్పాలగూడ, హైదరాబాద్-89; ఫోన్: 9346689306
 
 అనుపమ (కవిత్వం)
 రచన: బండ్ల మాధవరావు
 పేజీలు: 112; వెల: 100
 ప్రతులకు: నవోదయా పబ్లిషర్స్, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ-2;
 ఫోన్: 0866-2573500
 
 సొనకాలువల అపూర్వ పురాగాథ (గతమూ-వర్తమానమూ- భవిష్యత్తు; వొక వాయుఆధునిక వ్యక్తీకరణ)
 రచన: డా.లెనిన్ ధనిశెట్టి
 పేజీలు: 36; వెల: 20; ప్రతులకు: మోత్కూరు శ్రీనివాస్, అనంతుడు ఫౌండేషన్, కొండగడప గ్రామం, మోత్కూరు మండలం, నల్లగొండ జిల్లా; ఫోన్: 9866061350
 
 జీవన నానీలు
 రచన: భండారి అంకయ్య
 పేజీలు: 76; వెల: 75
 ప్రతులకు: సుశీలాదేవి, ఫ్లాట్ 204, కమలశ్రీ అపార్ట్‌మెంట్స్, రాజీవ్‌కాలనీ, మంకమ్మతోట, కరీంనగర్-505001. ఫోన్: 9032742937
 
 చే లాంగ్ లివ్( డాక్యుమెంటరీ స్క్రిప్టు)
 రచన: అభి, రుషీకృష్ణ
 పేజీలు: 86; వెల: ఇవ్వలేదు
 ప్రచురణ: మయూఖ ప్రచురణలు, 2-1-477, గ్రౌండ్ ఫ్లోర్, ప్రతీక్ టవర్స్, నల్లకుంట, హైదరాబాద్-44.
 
 మనలో మనం (కొండూరు, చమర్తి వంశావళి; మన సామెతలు)
 రచన: కొండూరు జనార్దనరాజు
 పేజీలు: 86; ప్రతులకు: చమర్తి నారాయణరాజు, శంకరాపురం, కడప. ఫోన్: 9440702337
 
 ఏడుమల్లెలు (కవిత్వం)
 రచన: మంచాల ప్రసాద్
 పేజీలు: 92; వెల: 80; ప్రతులకు: మంచాల ప్రచురణలు, కేరాఫ్ మంచాల సావిత్రి, 8-3-828/16/2, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్-73; ఫోన్: 8341192800
 
 నదీమూలం లాంటి  ఆ ఇల్లు (కవిత్వం)
 రచన: యాకూబ్
 పేజీలు: 156; వెల: 100
 ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9849156588
 
 పువ్వుల మధ్య, పరిమళం మధ్య వినిపించే కవిత్వం! ఒక రోమన్ రచయిత అంటాడు-‘హృదయం ఉండే చోటే ఇల్లు ఉంటుంది’ అని. పుస్తకం తెరవగానే కనిపించిన యాకూబ్  ఇల్లు కేవలం ఇల్లుగా, భౌతిక, భౌగోళిక రూపంగా మాత్రమే కనిపించదు. అది కవి యాకూబ్  హృదయంలా ఉంటుంది. మౌనంగా కూర్చున్న  సూఫీ పకీరులా ఉంటుంది. ఒకటికి రెండు సార్లు, పదే పదే ఆ ఛాయాచిత్రాన్ని చూస్తున్నప్పుడు చెట్లతో సహా ఇంటిముందు గంభీరంగా కనిపించే రాళ్లలో చలనం వచ్చి, కవిత్వం చెబుతున్నట్లే అనిపిస్తుంది.
 
  ఈ పుస్తకంలో మహానగరం  ఉంది. ‘భార్యాపిల్లలూ రోటిన్ పరుగులూ, క్రమం తప్పని బిల్లులూ...తెరలు తెరలుగా దగ్గు’ ఈ పుస్తకంలో కనిపించి వినిపిస్తాయి. ఈ పుస్తకంలో పల్లె ఉంది. అది నల్లవాగై సుమధురశబ్దం వినిపిస్తుంది. చవ్వచవ్వగా ఉప్పుప్పగా మనల్ని పలకరిస్తుంది. ఈ పుస్తకంలో ఆకాశం ఉంది. అందమైన భావుకత ఉంది. ‘రాత్రంతా ఒక్కటే చంద్రుడు-ఒంటరి ఆకాశపు అద్దం ముందు నిల్చొని- మళ్లీ మళ్లీ ముంగురులు చెరుపుకుంటూ- తలదువ్వుకుంటూ అలసిపోయాడేమో-నా తొడ మీద తల పెట్టుకొని గాఢనిద్రలో ఉన్నాడు’. పుస్తకంలో ఇల్లుతో పాటు అమ్మ ఉంది. ఆకలిని గౌరవించే అమ్మ, ఆకలికి అన్నం ముద్దకు ఉన్న అనుబంధాన్ని ప్రేమించే అమ్మ ఉంది. ఇన్నీ ఉన్నా ఇంకా ఏమైనా ఆశిస్తే...‘అపుడపుడూ పువ్వుల మధ్య, పరిమళం మధ్య నిద్రపోవాలి’ కవితను ఒకటికి పదిసార్లు చదువుకుంటే చాలు, మీకు మీరు కొత్తగా పరిచయం అవుతారు. ‘కాలం రచించుకున్న కవి’ పేరుతో సామిడి జగన్‌రెడ్డి రాసిన విలువైన ముందుమాట పాఠకులను అదనపు కానుక.
 - పాషా

మరిన్ని వార్తలు