అసలు సిసలు ప్రేయసీ!

20 Mar, 2016 02:11 IST|Sakshi
అసలు సిసలు ప్రేయసీ!

టీవీ టైమ్
 
కుటుంబ కలహాలు, బాంధవ్యాల మధ్య విభేదాలు, ప్రేమ కోసం పోరాటాలు, పగలు ప్రతీకారాలు... ఏ సీరియల్ అయినా ఉండేవి ఇవే. కానీ వాటిని ఎంత డిఫరెంట్‌గా చూపించాం, ఎంత కొత్తగా అల్లుకున్నాం అన్నదాని మీదే సక్సెస్ ఆధారపడివుంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘ఇది ఒక ప్రేమకథ’ సీరియల్. ఎన్ని ప్రేమకథలు చూడలేదు? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, అంతస్తుల భేదాల వల్ల వారి ప్రేమలో అవరోధాలు ఏర్పడటం, ఆ తర్వాత రకరకాల సమస్యలు... చాలా సీరియళ్లు ఇలా నడిచాయి. అయితే ‘ఇది ఒక ప్రేమకథ’లో మాత్రం పాత్రల చిత్రణ బాగుంది.

హీరో సాఫ్ట్ నేచర్, హీరో తల్లిగా జ్యోతి అద్భుతమైన అభినయం, చక్కని సంభాషణలు కలగలసిన ధారావాహిక అది. ఉత్కంఠను రేకెత్తించే కథనం కూడా బలాన్ని చేకూరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ శ్రీవాణి తన పాత్రకి చక్కగా సరిపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయింది. స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే సున్నితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ మార్కులు కొట్టేస్తోంది. అసలు ప్రేయసి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేస్తోంది. అందుకే ఆ సీరియల్ సక్సెస్‌లో శ్రీవాణి భాగం కాస్త ఎక్కువే!
 
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు