వారఫలాలు

20 Jan, 2019 01:09 IST|Sakshi

20 జనవరి నుంచి 26 జనవరి 2019 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మీ వైఖరి స్పష్టం చేయడంతో శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారాలు జటిలం కావచ్చు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు రద్దు కాగలవు. వారం మధ్యలోశుభవార్తలు. వాహనయోగం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనక«ధారా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని సమస్యలు, ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఎంతటి పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో  సోదరులతో కలహాలు. అనారోగ్యం సూచనలు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థత చాటుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్య, వివాహయత్నాలు కలసివస్తాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత నీలం రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో సోదరులతో అవగాహనకు వస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను  కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పోటీపరీక్షల్లో విజయం  సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  బాధ్యతలు కాస్త తగ్గుతాయి. రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, ఎరుçపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీపై నిందలు మోపాలనుకున్న వారే పశ్చాత్తాపం చెందుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. సంఘంలో మంచి పేరు గడిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కళారంగం వారికి సేవలకు గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.  పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ను పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ముఖ్య పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మొదట్లో చికాకులు ఎదురైనా క్రమేపీ అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. భూముల వివాదాల తీరతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు, సోదరులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. వేడుకలు నిర్వహిస్తారు.  జీవిత భాగస్వామితో తగాదాలు పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆత్మీయతను కుటుంబçసభ్యులకు పంచుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కొంక వరకూ బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
తలపెట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. సోదరులు, సోదరీల నుంచి ఆహ్వానాలు రాగలవు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఒక సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహారాధన మంచిది.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనుల్లో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం  పెరుగుతుంది. పండితులు, ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం, బంధువులతో తగాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (20 జనవరి నుంచి  26 జనవరి 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అదృష్టం తలుపు తడుతుంది. జీవితంలో పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి ఆర్థిక నష్టాలను, అవరోధాలను మరచిపోయి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. దైవబలం మీవైపే ఉంది. ఆశ్చర్యకరమైన రీతిలో ఆర్థిక లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామంపై దృష్టిపెడతారు. భావ సారూప్యత గల వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆమోదిస్తారు. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబీ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఏకకాలంలో చాలా రకాల పనులు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. పని బాధ్యతలు పెరిగినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా సవాళ్లను స్వీకరిస్తారు. ఆశించిన స్థాయికి మించి అద్భుత ఫలితాలను సాధిస్తారు. కార్యాలయంలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలకు సంబంధించి పెద్దలను సలహాలు కోరుతారు. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నా ఆనందం పొందడంలో విఫలమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాస్త లౌక్యం ప్రదర్శిస్తే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశాలు ఉంటాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పరిస్థితుల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక లాభాలనిచ్చే అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమికుల మధ్య అలకలు, కలతలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితంలో ఒక అంకం ముగిసిందనుకుంటే, మరో కొత్త అంకానికి తెరతీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి దిశగా మార్పులు ఉంటాయి. అధికార పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. కఠోర శ్రమను నమ్ముకున్నందుకు తగిన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. సృజనాత్మక కళా రంగాల్లోని వారికి సత్కారాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మకు దగ్గరైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కుటుంబ సభ్యులకు, సన్నిహిత మిత్రులకు సమయాన్ని కేటాయిస్తారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉరకలేసే ఉత్సాహంతో పనులు కొనసాగిస్తారు. లక్ష్య సాధన దిశగా చకచకా ముందుకు సాగుతారు. పనులు పూర్తి చేయడంలో మీ వేగం, సడలని మీ ఉత్సాహం వల్ల సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. అనుకున్న రీతిలో ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో పరీక్షలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. మిత్రులతో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు.
లక్కీ కలర్‌: నీలం

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో అత్యుత్తమమైన పనితీరు కనపరుస్తారు. అలాగే, అంతకు మించిన ప్రతిఫలాన్నీ అందుకుంటారు. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి పట్ల ఆకర్షణ పెంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. జీవనశైలిని మెరుగుపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్‌ లావాదేవీలు అనుకూలిస్తాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సడలని ఉత్సాహంతో విజయాల బాటలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వాక్చాతుర్యం, ఇతరులను ఒప్పించే నేర్పు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ సహజ నైపుణ్యాలతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కీలకమైన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తారు. కొత్తగా చేపట్టే భారీ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వెన్నునొప్పి, తలనొప్పి వంటి బాధలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా కలిసొచ్చే కాలం ఇది. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. 
లక్కీ కలర్‌: నేరేడు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రేమానుబంధాలలో తలెత్తిన పొరపొచ్చాలు సమసిపోతాయి. మనసులు కుదుటపడతాయి. ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన సమస్యల నుంచి తేలికగా గట్టెక్కుతారు. పని ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకుంటారు. మీ కోసం మీరు సమయం కేటాయించుకుంటారు. తీరిక సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకుంటారు. విహార యాత్రల కోసం దూర ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ప్రతికూలమైన ఆలోచనలను విరమించుకుంటే వృత్తి ఉద్యోగాల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. 
లక్కీ కలర్‌: మట్టి రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అతిశయాలకు పోయేవారి పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇదివరకటి పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. రొటీన్‌గా మారిపోయిన పని పట్ల విసుగు పెంచుకుంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. కొత్త కొత్త అవకాశాల వైపు దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరచుకుంటారు. కుటుంబంలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇల్లు లేదా స్థలం కొనాలన్న చిరకాల వాంఛ తీరుతుంది. 
లక్కీ కలర్‌: తెలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా జరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమకు ఇప్పుడు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువు కోసం సాగిస్తున్న అన్వేషణ ఫలిస్తుంది. ఇతరుల ప్రభావం నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. మీపై మానసిక ఆధిపత్యం సాధించడానికి కొందరు పావులు కదుపుతుంటారు. అలాంటి వారిని పసిగట్టి, వారిని దూరం పెట్టడం క్షేమం. శరీరాకృతిపై శ్రద్ధ చూపిస్తారు. వ్యాయామం వైపు మొగ్గుతారు. ఆహార విహారాల్లో ఆరోగ్యకరమైన మార్పులు చేపడతారు. ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ సహజ స్వభావంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్తగా పరిచయమైన వారు సైతం మీ ఆకర్షణలో పడిపోతారు. జీవితం పట్ల, ప్రేమానుబంధాలలోని సంక్లిష్టతల పట్ల ఆత్మావలోకనం చేసుకుంటారు. సామర్థ్యానికి మించిన బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. మనో నిబ్బరం కోల్పోకుండా సవాళ్లను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమిస్తారు. మెరుగైన పనితీరుతో పురోగతి సాధిస్తారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వాటిని అందిపుచ్చుకుని, ఆర్థిక పురోగతికి కొత్త బాటలు వేసుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఆర్థికంగా అంచనాలకు మించిన ఫలితాలను సాధిస్తారు. ఆనందంలో ఓలలాడతారు. జనాకర్షణ పెంచుకుంటారు. ఇతరులను తేలికగా ప్రభావితం చేయగలుగుతారు. ఇంట్లో మార్పులకు శ్రీకారం చుడతారు. గడ్డు సమస్యలను పరిష్కరించడంలో కొంత లౌక్యం అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాల్లో పరీక్షలు ఎదురుకావచ్చు. విద్యార్థులు వినోదాన్ని పక్కనపెట్టి మరింతగా ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: గులాబీ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు