వారఫలాలు : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ 2016 వరకు

12 Dec, 2016 14:27 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 పనులు పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయం పెరుగుతుంది. గత నిర్ణయాలను మార్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూలం. వాహన, గృహయోగాలు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 కార్యజయం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని విషయాలలో మౌనం వీడాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. బంధువులతో సత్సంబంధాలు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు సంతోషకరంగా గడుపుతారు. ఆకుపచ్చ, నీలం రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజకనంగా ఉంటుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఒక ముఖ్యసమాచారం అందుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా మూడుసార్లు పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.రాజకీయవర్గాలకు పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. తెలుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. వ్యాపారాలు ప్రగతిదాయకం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు యత్నకార్యసిద్ధి. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త పనులకు శ్రీకారం. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో సంతోషకరంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. అదనపు రాబడి దక్కుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణంతో ముందడుగు వేస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించే సమయం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. గులాబీ, లేతఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్యార్థులకు అనుకూల సమాచారం. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల అవకాశం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తథ్యం. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళ పరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందకొడి గా సాగుతాయి.ఉద్యోగులకు ఆక స్మిక మార్పులు. కళాకారులకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
 

మరిన్ని వార్తలు