తెలుగువారి ఘనకీర్తి

26 Sep, 2019 00:47 IST|Sakshi

ఆంధ్రా మిల్టన్‌గా, ఆంధ్రాస్కాట్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు సమా జసేవతోపాటు ఇటు సాహితీసేవ చేస్తూ ఆనాటి సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారు. అలా పోరాడేవారికి అండదండలందిం చారు. అందుకు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. కందుకూరి వీరేశ లింగాన్నే తనకు స్ఫూర్తిగా తీసుకున్నారు. బాల్య వివాహాలను నిరోధించ డంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో, ఇతర సామాజిక సంస్కరణలు తీసుకు రావడంలో చిలకమర్తి ముందున్నారు. తన రచ నల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాలల స్థాపనకూ, పుస్తకాల పంపిణీకి ఆయన వినియోగించారు. ధనవంతులు స్వీయ ప్రతిష్ట కోసం సత్రాలు కట్టించి, సమారాధనలు, సంతర్పణలూ చేసే బదులు సమాజం లోని అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆలోచిం చడం లేదని చిలకమర్తి వాపోయారు.

మానవ సేవే మాధవసేవ అని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవా నుడే చెప్పినా వీరికి పట్టదని ఆవేదన చెందారు. భాగ్యవంతులంతా నిమ్నజాతి ఉద్ధరణ కోసం తమ వంతు వెచ్చించినప్పుడే సమాజం ఉన్నత స్థితికి ఎదుగుతుందని నమ్మిన మహనీయుడాయన! దేశ స్వాతంత్య్రోద్యమంలో దక్షిణ భారత మంతటా సభలు నిర్వహించి, తన ఉపన్యాసాలతో ఆనాటి యువతను ఉర్రూతలూగించారు. ప్రజల్లో స్వరాజ్యకాంక్షను రగిలించారు. ఇంగ్లిష్‌ చదువులు అవసరమే గానీ, వారి ఆచారవ్యవహారాలను అనుసరించ నక్కరలేదని, మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో విలువైనవని ఆయన హితవు పలికారు. ఈనాటి యువతరానికి చిలకమర్తి స్వీయ చరిత్రతోసహా ఆయన రచనలన్నిటినీ అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి.(నేడు సాయంత్రం హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ  గానసభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం 152వ జయంతి వేడుకల సందర్భంగా) 

సి.కె.ఎమ్‌. కుమార్, శారదానగర్, హైదరాబాద్‌
మొబైల్‌ : 99121 81379 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాణదాత ఎవరు.. ప్రాణహర్త ఎవరు?

పరుగులెత్తనున్న ప్రగతి రథం

కోడెలను కాటేసిందెవరు?

హిందీ ఆధిపత్యం ప్రమాదకరం

రైతు సమస్యల పరిష్కారంతోటే జాతి భద్రత

ఇంట్లో ‘ఈగలు’... బయట పల్లకీలు!

రాయని డైరీ.. నరేంద్ర మోదీ (భారత ప్రధాని)

భారత తీరానికి యూరప్‌ హారం

తసమదీయ మాయాబజార్‌!

కేంద్ర బడ్జెట్‌ నిండా హంసపాదులే

ఈ ఆర్థికంలో అద్భుతాలు సాధ్యమా?

గతం వలలో చిక్కుకోవద్దు

ఒంటికి సెగ తగిలినా కదలరా?

ఫరూఖ్‌ నిర్బంధం తీవ్ర తప్పిదం

దక్షిణాది భాషలపై హిందీ పెత్తనం

ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?

‘తుఫాను’ ముందు ప్రశాంతత

పల్నాడులో బాబు ఫ్యాక్షనిజం

తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు

రాయని డైరీ.. సోనియా గాంధీ

నైతిక పతనం దిశగా ఐపీఎస్‌

కాలంతో నడక

సదా వార్తల్లో వ్యక్తి

సాగు సంక్షోభంతోనే మాంద్యం

న్యాయం బదిలీ

కొంపముంచే రాజకీయాలేనా బాబూ?

అడుగడుగునా అడ్డంకుల్లో బ్రెగ్జిట్‌

విమర్శిస్తే రాజద్రోహమా?!

మాట్లాడక తప్పని సమయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

అమితానందం