వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!

14 Nov, 2023 00:45 IST|Sakshi

అభిప్రాయం

పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్‌ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు.

ప్రభుత్వ సీనియర్‌ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్‌ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది.

వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది.

అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద  నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ.

నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్‌ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్‌ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్‌ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? 

పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్‌ డయాక్సైడ్, హైడ్రోజన్‌ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్‌గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది.

బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్‌ అనే యంత్రాన్ని ఉపయోగించడం.

ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను  పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. 

బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్‌ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు.

దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్‌ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది.

ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్‌లైన్‌ నెట్వర్క్‌ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది.

అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది.

భాక్రానంగల్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్‌ స్థలానికి తీసుకెళ్లారు.

ప్రతాప్‌ సింగ్‌ ౖకైరోన్‌(పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్‌ఎస్‌ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అర్జున్‌ సింగ్‌ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా  రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్‌లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న.
టి.కె. అరుణ్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, కాలమిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు