'దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్'

11 Dec, 2015 17:59 IST|Sakshi

చీపురుపల్లి (విజయనగరం) : 'డాక్టర్లూ.. ఏమిటి మీ సమస్య? నా వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) మీతో మాట్లాడితే తప్పేంటి? నేను రాష్ట్ర మంత్రిని. రాష్ట్రంలో అందరితోనూ మాట్లాడలేను కదా...! మీకు ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి... దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదు'  రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రభుత్వ వైద్యులతో అన్న మాటలు ఇవి. మంత్రి పీఎస్ రామకృష్ణ తమను వేధిస్తున్నారంటూ వైద్యులు, ప్రజాప్రతినిధులు, డీఎంహెచ్‌ఓ వద్ద మొరపెట్టుకున్న విషయాలపై ఈ నెల 10న 'సాక్షి' మెయిన్ ఎడిషన్‌లో 'ఆయనకో దండం' శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే.

శుక్రవారం చీపురుపల్లి వెళ్లిన మంత్రి మృణాళిని స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను పిలిపించి మరీ వారిపై మండిపడ్డారు. వైద్యులంతా రోజూ ఎందుకు విధులకు రావడం లేదని ప్రశ్నించారు. సెలవులు పెట్టకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి క్యాంపులకు వెళ్లిపోతే ఎవరూ అడగకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే రాసిచ్చేయాలని.. దాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు