పార్వేట మంటపం ధ్వంసం

22 Feb, 2016 10:39 IST|Sakshi

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని పార్వతీసమేత త్రిపురాంతకేశ్వర స్వామి పార్వేట మంటపాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏటా శివరాత్రి నాడు జరిగే కల్యాణోత్సవం సందర్భంగా స్వామి వారిని ప్రధాన ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పార్వేట మంట పానికి తీసుకురావటం ఆనవాయితీ. పొలాల్లో ఉన్న మంటపం నాలుగు రాతి స్తంభాల్లో రెండింటిని గుర్తు తెలియని దుండగులు పడగొట్టారు. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుప్త నిధులున్నాయనే అనుమానంతోనో లేక ఆలయ స్థలం ఆక్రమించుకునేందుకో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు